Wednesday, September 23, 2026
News Navigation
Wednesday, September 23, 2026
News Navigation

Breaking

Wednesday, September 23, 2026
Home Andhra Pradesh పర్యావరణాన్ని పరిరక్షించాలని పవన్ కల్యాణ్ పిలుపు

పర్యావరణాన్ని పరిరక్షించాలని పవన్ కల్యాణ్ పిలుపు

by Rama
పర్యావరణాన్ని పరిరక్షించాలని పవన్ కల్యాణ్ పిలుపు

పర్యావరణాన్ని పరిరక్షించి, జీవవైవిధ్యాన్ని కాపాడినప్పుడే ‘వసుధైక కుటుంబం’ అనే పేరు సార్థకమవుతుందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ అన్నారు. మంగళగిరిలోని అరణ్య భవన్‌లో నిర్వహించిన 70వ వన్యప్రాణి వారోత్సవాల ముగింపు సభలో ఆయన ప్రసంగించారు. అటవీ శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన జంతువుల బొమ్మలను ఆసక్తిగా తిలకించారు. సముద్ర తాబేళ్ల రక్షణ కోసం రూపొందించిన మెరైన్ ఫానా యాప్‌ను పవన్‌ ప్రారంభించారు. కింగ్ కోబ్రాల సంరక్షణ బ్రోచర్‌ని ఆయన ఆవిష్కరించారు.
వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో విజయం సాధించిన వారికి పవన్‌ బహుమతులు ప్రదానం చేశారు. భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలంటే ప్రజలంతా ప్లాస్టిక్‌ని నిర్మూలించాలన్నారు. అది ఇంటి నుంచే ప్రారంభం కావాలని పవన్‌ సూచించారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “రణబాలి” మూవీ.
    షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ “రణబాలి” సినిమా అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “రణబాలి” మూవీ విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్…
  • సెమీకాన్‌ ఇండియా-2026 ప్రారంభించిన మోదీ.
    భారత్‌ను ప్రపంచ సెమీకండక్టర్‌ తయారీ హబ్‌గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్‌ సెంటర్‌లో గురువారం ‘సెమీకాన్‌ ఇండియా-2026’ సదస్సును ప్రారంభించారు. సెప్టెంబర్‌ 17 నుంచి 19 వరకు మూడు రోజుల పాటు…
  • జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.
    నియోజకవర్గానికి ఒకటి చొప్పున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే 72 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు పూర్తి చేశామన్నారు. అలాగే యువత కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు…
  • 96 ఏళ్ల తర్వాత జిల్లాలో రీ-సర్వే.
    96 సంవత్సరాల తర్వాత బౌండరీస్‌ చట్టం ప్రకారం జిల్లాలో రీ-సర్వే చేపడుతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా పరేడ్‌ గ్రౌండ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన భట్టి విక్రమార్క.. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.…
  • లండన్‌లో కన్నులపండువగా గంగా హారతి.
    బ్రిటన్‌ రాజధాని లండన్‌లో థేమ్స్‌ నది ఒడ్డున నిర్వహించిన గంగా హారతి కార్యక్రమానికి వేలాది మంది హాజరయ్యారు. చిన్మయ మిషన్‌ సేవలు ప్రారంభించి 75ఏళ్లు అయిన సందర్భంగా.. చిన్మయ్‌ మిషన్‌ యూకే ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. గంగా నది ఒడ్డున ప్రతిష్ఠాత్మకంగా…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: