విదేశాల నుంచి ప్రభాకర్ రావు తిరిగి వస్తే… ఈ కేసులో ఎవరెవరు పెద్ద తలకాయలు ఉన్నాయని ప్రభాకర్ రావు వస్తేనే ట్యాపింగ్ కేసులో ముందడుగు స్పష్టమవుతోంది. ప్రభాకర్ రావును విచారించిన తర్వాత అప్పటి ప్రభుత్వ పెద్దలను బుక్ చేసేందుకు ఎక్కువ అవకాశముంటుంది. అందువలన ప్రభాకర్ రావు కోసం పోలీసులు వెయిట్ చేస్తున్నారు. అయితే ప్రభాకర్ రావు మాత్రం …ఇండియాకు రాకుండా ఉండేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇండియాకు వచ్చిన వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకుంటారని ఊహిస్తున్న ప్రభాకర్ రావు.. సాధ్యమైనంతవరకు అమెరికాలోనే ఉండేందుకు తన సన్నిహితుల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అనారోగ్యం సాకుతో మరిన్ని రోజులు అగ్రరాజ్యంలో పాగా వేసేందుకు పన్నాగాలు పన్నుతున్నారు. అటు .. ప్రభాకర్ రావు ఇండియాకు వస్తేనే కేసు దర్యాప్తులో పురోగతి వస్తుందని, లేకుంటే ఉండదని పోలీసు అధికారులు ఆఫ్ ది రికార్డ్ గా చెబుతున్నారు. వీలైనంత వరకు ప్రభాకర్ రావు అమెరికాలో ఎక్కువ కాలం ఉండేందుకు బీఆర్ఎస్ నాయకులు కూడా తమ వంతు సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రభాకర్ ధీమాగా వీలైతే ఇంకా మరికొన్ని రోజులు అమెరికాలో ఉండేందుకు పావులు కదుపుతున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- జమ్ము మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం..జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా పై హత్యాయత్నం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం సురీందర్ తో కలిసి ఓ పెళ్లి వేడుకకు వెళ్లారు మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా. ఈ సందర్భంగా ఫరూఖ్ అబ్దుల్లాకు భారీ భద్రత ఉంది.…
- ఆర్ అండ్ బీ అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష .రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధిని దీర్ఘకాలిక దృష్టితో ముందుకు తీసుకెళ్లాలని, 2047 విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. హైదరాబాద్ నగరం నుంచి రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా నిర్ణీత సమయంలో చేరుకునేలా రోడ్ల అభివృద్ధి…
- ఫుడ్స్ పెట్టలేమంటూ హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టల్ యాజమాన్యాలు సర్క్యులర్ జారీ చేశాయి.పశ్చిమాసియా యుద్ధ సెగ ఐటీ ఉద్యోగులకు తగిలింది. ఫుడ్స్ పెట్టలేమంటూ హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టల్ యాజమాన్యాలు సర్క్యులర్ జారీ చేశాయి. ఎల్పీజీ గ్యాస్ కొరత కారణంగా హైదరాబాద్ హాస్టల్ యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నాయని తెలిపాయి. కేవలం ముఖ్యమైన ఆహార…
- పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత ప్రభుత్వం ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ పార్లమెంటులో వెల్లడించిన సమాచారం ప్రకారం,…
- సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరిగింది.సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సీఎం వారికి పలు అంశాలపై లక్ష్యాలను నిర్దేశించారు. సంక్షేమ, అభివృద్ధిపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. అధికారులు-ప్రజాప్రతినిధుల…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి