ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు సంబంధం లేదని ఈ కేసులో నిందితుడు, తెలంగాణ ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రస్తుతం ఇండియాకు రాలేనంటూ ప్రభాకర్ రావు లేఖ జూబ్లీహిల్స్ పోలీసులకు రాశారు. జూన్ 26న తాను అమెరికా నుంచి ఇండియాకు రావాల్సి ఉందని అయితే అనారోగ్య కారణాల వల్ల యూఎస్ లోనే ఉండిపోవాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు. క్యాన్సర్ తో బాధపడుతున్న తనకు ఇప్పుడు బీపీ కూడా పెరిగిందని ప్రభాకర్ రావు తెలిపారు. ఒక పోలీసు అధికారిగా తాను ఎలాంటి తప్పు చేయలేదని తనపై అసత్య ఆరోపణలు చేస్తూ మీడియాకు లీకులు ఇస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
చట్టపరంగా విచారణ జరపాలని కోరుతున్నానని విచారణలో పోలీసులకు సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. టెలీ కాన్ఫరెన్స్ ద్వారా అయినా, మెయిల్ ద్వారా అయినా సమాచారం ఇవ్వడానికి తాను సిద్ధమని చెప్పారు. తాను ఎక్కడికీ పారిపోనని పూర్తిగా కోలుకున్న తర్వాత దర్యాప్తు అధికారుల ముందు హాజరై, అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తానని తెలిపారు. మీడియాలో వస్తున్న వార్తలతో తాను, తన కుటుంబ సభ్యులు మానసిక వేదన చెందుతున్నామని చెప్పారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 90713