Saturday, September 12, 2026
News Navigation
Saturday, September 12, 2026
News Navigation

Breaking

Saturday, September 12, 2026
Home Film ప్రభుదేవ నటించిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ ప్రేమికుడు గ్రాండ్ రీ రిలీజ్

ప్రభుదేవ నటించిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ ప్రేమికుడు గ్రాండ్ రీ రిలీజ్

by Rama
Premikudu

కే టి కుంజుమన్ నిర్మాతగా, ఎస్. శంకర్ దర్శకత్వంలో, ఏ. ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందించగా డాన్సర్, యాక్టర్ ప్రభుదేవ (Prabhu deva), అందాల నటి నగ్మ నటించిన ప్రేమికుడు సినిమా రీ-రిలీజ్ అవబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ నిర్మాతలుగా రమణ గారు, మురళీధర్ గారు వ్యవహరిస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం, వడివేలు, రఘువరన్, గిరీష్ కర్నాడ్ ముఖ్యపాత్రలో నటించారు. ఈ సినిమా రీ రిలీజ్ కి సంబంధించిన ప్రెస్ మీట్ నేడు చాలా ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో ముఖ్య అతిథులుగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ గారు, ట్రెజరర్ రామ్ సత్యనారాయణ గారు, దర్శకుడు ముప్పలనేని శివ గారు, శివనాగు నర్రా గారు, శోభారాణి గారు, నిర్మాతలు రమణ గారు, మురళీధర్ గారు పాల్గొన్నారు.

Follow us on :FacebookInstagramYouTube & Google News

ఈ సందర్భంగా ముప్పలనేని శివ గారు మాట్లాడుతూ : 30 సంవత్సరాల క్రితం వచ్చిన ప్రేమికుడు సినిమా ఇప్పుడు రీ రిలీజ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. అప్పట్లో ప్రభుదేవ ని చూసి స్ప్రింగ్ లు ఏమన్న మింగాడా అనుకునేవాళ్లం. ఒక మంచి ప్రేమ కథ గా సెన్సేషన్ సృష్టించిన సినిమా ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అందరితోపాటు ఈ సినిమా కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను అన్నారు.

తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ గారు మాట్లాడుతూ : ఈ సినిమా రీ రిలీజ్ లో కూడా మంచి విజయం అందుకుంటుంది. ఇందులో గానకందరుడు ఎస్. పి. బాలసుబ్రమణ్యం గారి నటన అద్భుతంగా ఉంటుంది. ప్రభుదేవ నటన, డాన్సులు నగ్మ అందాలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. మా సోదరి సుధారాణి గారికి ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

దర్శకుడు శివనాగు గారు మాట్లాడుతూ : ఈ సినిమా ఈ తరంలో వచ్చుంటే కచ్చితంగా 100 కోట్లు కొట్టే సినిమా అయ్యేది. అప్పుడున్న బడ్జెట్ కి 3 కోట్లతో చేసిన సినిమ ఇప్పుడు ఉన్న కలెక్షన్లకి రీ రిలీజ్ లో 30 కోట్లు సాధిస్తుంది అని ఆశిస్తున్నాను. ఎస్. పి. బాలసుబ్రమణ్యం గారి నటన ఈ సినిమాల అద్భుతంగా ఉంటుంది. ప్రభుదేవా గారి డాన్సులు అలాగే బాలసుబ్రమణ్యం గారితో కూడా డాన్స్ వేయించడం ఈ సినిమాకి హైలెట్. రీ రిలీజ్ లో కూడా ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

నిర్మాతలు రమణ మరియు మురళీధర్ గారు మాట్లాడుతూ : 30 సంవత్సరాల క్రితం సెన్సేషన్ సృష్టించిన సినిమా మేము రీ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అతి త్వరలో ఫ్రీ రిలీజ్డ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా చేయబోతున్నాం. ఈవెంట్ కి ప్రభుదేవా గారు కూడా హాజరయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నాం. రీ రిలీజ్ లో కూడా కలెక్షన్లు సృష్టిస్తుందని ఆశిస్తున్నామన్నారు.

ఈ ఈవెంట్లో ముఖ్య అతిథులుగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ గారు, ట్రెజరర్ రామ్ సత్యనారాయణ గారు, దర్శకుడు ముప్పలనేని శివ గారు, శివనాగు నర్రా గారు, శోభారాణి గారు, నిర్మాతలు రమణ గారు, మురళీధర్ గారు పాల్గొన్నారు.

ఇదిచదవండి: ‘టిల్లు స్క్వేర్’ చిత్రం నుంచి ‘ఓ మై లిల్లీ’ పాట విడుదల


ప్యారడైజ్ నా కెరీర్‌లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా.
ప్యారడైజ్ నా కెరీర్‌లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా. సెప్టెంబర్ 24న వస్తున్నాం. ఫస్ట్ నుంచి …
ఘనంగా ఇరుముడి బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్..
ఘనంగా ఇరుముడి బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్.. నాకు రెస్పెక్ట్ తెచ్చిపెట్టిన సినిమా అంటూ రవితేజ ఎమోషనల్ …
‘వృషకర్మ’ 2026 డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్.
యువ సామ్రాట్ నాగ చైతన్య, కార్తీక్ దండు, ఎస్‌విసిసి & సుకుమార్ రైటింగ్స్ మైథికల్ థ్రిల్లర్ …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: