Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home National సముద్ర గర్భంలో శ్రీకృష్ణునికి ప్రధాని మోదీ పూజలు

సముద్ర గర్భంలో శ్రీకృష్ణునికి ప్రధాని మోదీ పూజలు

by Satya
Modi


సముద్రంలో మునిగిపోయిన ప్రాచీన నగరం ద్వారకను ప్రధాని మోదీ స్కూబా డైవింగ్‌ ద్వారా సందర్శించారు. జలగర్భంలో శ్రీకృష్ణుడికి భక్తిపూర్వకంగా ప్రార్థనలు జరిపారు. అనేక సంవత్సరాలుగా ద్వారకను సందర్శించాలని అనుకుంటున్నానని, ఇప్పటికి ఈ కోరిక నెరవేరిందని, ఇదొక దివ్య అనుభూతి అని సముద్రం నుంచి బయటకు వచ్చిన అనంతరం మోదీ తెలిపారు. సముద్రంలో ఉన్న ద్వారక నగర అవశేషాలను సందర్శించటానికి పంచ్‌కుయి బీచ్‌ నుంచి స్కూబా డైవింగ్‌ చేశారు.

పార్లమెంట్ ఎన్నికలపై ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం

ఆయనకు సాయంగా నౌకాదళ డైవర్లు కూడా సముద్రంలోకి వెళ్లారు. సముద్ర గర్భంలో మోదీ పద్మాసనం వేసి, ముఖులిత హస్తాలతో శ్రీకృష్ణుడిని ప్రార్థించారు. నెమలి ఈకలను సమర్పించారు. బయటకు వచ్చిన తర్వాత మోదీ మాట్లాడుతూ అత్యంత దివ్యమైన అనుభూతి కలిగిందని, ద్వారక సందర్శనకు ధైర్యంకన్నా విశ్వాసమే కీలకమని చెప్పారు. ప్రాచీన నగరాన్ని స్పృశించినప్పుడు 21వ శతాబ్దంలో వైభవోపేత భారతదేశం తనముందు కదలాడిందని, చాలాసేపు నీళ్లలోనే గడిపానని మోదీ తెలిపారు. ద్వారకను సందర్శించాలన్న తన కోరిక దశాబ్దాల నాటిదని, ఇప్పుడు అది పూర్తి కావటంతో అపరిమితమైన సంతోషం కలిగిందని మోదీ తెలిపారు.

Follow us on : Facebook, Instagram & YouTube.


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు
మధ్యప్రదేశ్‍లో భోజ్ శాల ఆలయ కేసులో కీలక తీర్పు వెలువడింది. వివాదాస్పద స్థలం ఆలయానికే చెందుతుందని …
జూన్ 21న నీట్ రీ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు ఎన్‍టీఏ ప్రకటన..
దేశవ్యాప్తంగా వివాదాలకు కేంద్రబిందువైన నీట్ యూజీ 2026 పరీక్షపై కీలక అప్డేట్ వెలువడింది. ప్రశ్నపత్రం లీకేజీ, …
యూపీలో గాలివాన బీభత్సం..
యూపీలో గాలివాన సృష్టించిన బీభత్సంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. పలు ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు …

Advertisements

You may also like

Our Visitor

013890
Total views : 78342

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.