హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 436 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ పై 190 పరుగుల భారీ ఆధిక్యతను సాధించింది. టీమిండియా బ్యాట్స్ మెన్లలో జడేజా 87, కేఎల్ రాహుల్ 86, యశస్వి జైశ్వాల్ 80, అక్సర్ పటేల్ 44, శిఖర్ భరత్ 41 పరుగులు సాధించారు. కెప్టెన్ రోహిత్ శర్మ 24 పరుగులు మాత్రమే చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోరూట్ 79 పరుగులు ఇచ్చి 4 వికెట్లను కూల్చాడు. రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ చెరో రెండు వికెట్లను తీయగా జాక్ లీచ్ ఒక వికెట్ పడగొట్టాడు. రవిచంద్రన్ అశ్విన్ రనౌట్ అయ్యాడు. బ్యాటింగ్ లో రాణించిన జడేజా, అక్సర్ పటేల్ బౌలింగ్ లో కూడా రాణించారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో జడేజా 3, అక్సర్ పటేల్ 2 వికెట్లు తీశారు. మరోవైపు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 246 పరుగులకే ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించింది.\
Sports
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం కబడ్డీ స్టేడియంలో గోగులమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత ఐదు రోజులుగా జరుగుతున్న జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో పురుషుల విభాగంలో విన్నర్ గా హర్యానా, రన్నర్ గా రాజస్థాన్, మూడు నాలుగు స్థానాల్లో ఆంధ్ర, వెస్ట్ బెంగాల్ జట్టు నిలిచాయి. మహిళా విభాగంలో విన్నర్ గా కలకత్తా, రన్నర్ గా కేరళ మూడు నాలుగు స్థానాల్లో ఆంధ్ర, హిమాచల్ జట్లు నిలిచాయి. ఫైనల్స్ ఆదివారం అర్ధరాత్రి వరకు జరిగాయి. విజేతలకు ఐదు లక్షలు ప్రైజ్ మనీ షీల్డ్ లను ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే జానకిరామ్, టిడిపి నాయకులు కోవ్వలి నాయుడు, కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వీర లంకయ్యలు అందించారు.
క్రికెట్ లో ఫిక్సింగ్ భూతం అంతమయ్యేలాలేదు. తాజాగా, బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ నాసిర్ హోస్సేన్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఐసీసీ ఆగ్రహానికి గురయ్యాడు. 2021-22 సీజన్ లో జరిగిన అబుదాబి టీ10 లీగ్ లో నాసిర్ హొస్సేన్ ఫిక్సింగ్ కు పాల్పడినట్టు నిర్ధారణ అయింది. ఆ సమయంలో అతడు పుణే డెవిల్స్ టీమ్ కు ప్రాతినిధ్యం వహించాడు. హొస్సేన్, మరో ఏడుగురు ఫిక్సింగ్ కు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఫిక్సింగ్ కు సంబంధించిన అంశాలను బుకీలతో ఫోన్ లో మాట్లాడడం, వారి నుంచి ఐఫోన్ ను గిఫ్ట్ గా పొందడం, బుకీలు తనను సంప్రదించిన విషయాన్ని ఐసీసీ అవినీతి నిరోధక విభాగానికి తెలియజేయకపోవడం వంటి అభియోగాలు నిజమేనని వెల్లడైంది. దాంతో అతడిపై ఐసీసీ రెండేళ్ల నిషేధం విధించింది. కాగా, తనపై వచ్చిన ఆరోపణలను నాసిర్ హొస్సేన్ అంగీకరించాడు.
టెన్నిస్ సీజన్ మళ్లీ మొదలవుతోంది. ముందుగా ఆస్ట్రేలియన్ ఓపెన్ షురూ కానుంది. జనవరి 14న ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీకి తెరలేవనుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియన్ ఓపెన్ కు సంబంధించిన క్వాలిఫైయింగ్ పోటీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించారు. ఈ మ్యాచ్ లో టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ తో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఆడడం విశేషం. ఈ మ్యాచ్ ఎంతో సరదాగా సాగింది. మ్యాచ్ ఆద్యంతం జకోవిచ్.. స్టీవ్ స్మిత్ ను ప్రోత్సహిస్తూ ఆడియన్స్ ను అలరించాడు. క్రికెట్ లో స్టార్ డమ్ అందుకున్న స్టీవ్ స్మిత్.. టెన్నిస్ రాకెట్ చేతబట్టి జకో అంతటివాడితో ఆడుతూ చక్కగా ఆస్వాదించాడు
శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి లో శ్రీ సత్యసాయి విద్యార్థులు కూడా ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీ సత్య సాయి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాఘవేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ రత్నాకర్, ట్రస్టు సభ్యులు మరియు, రామకృష్ణ మఠం కి చెందిన సభ్యులు హాజరయ్యారు. తొలుత సత్యసాయి విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ ద్వారా సత్యసాయి కి గౌరవ వందనం సమర్పించారు. హిల్ వ్యూ స్టేడియంలో బైక్ విన్యాసాలు, జిమ్నా స్టిక్, కత్తి సాము విన్యాసాలతో విద్యార్థులు చూపరులను మంత్రముగ్ధులను చేశారు. చైనీస్ డ్రాగన్ నృత్య విన్యాసాలు, బైక్ విన్యాసాలు, రోప్, స్కేటింగ్ విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ క్రీడా ఉత్సవాలను తిలకించడానికి జనం పెద్ద ఎత్తున తరలిరావడంతో కోలాహలం నెలకొంది.
Read Also..
గత ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఫార్ములా ఈ-రేస్ రద్దుతో రాష్ట్రానికి నష్టం జరిగిందని వస్తున్న విమర్శలపై స్పందించారు. రేస్ టికెట్లు అమ్ముకుని ఏస్ నెక్ట్స్ జెన్ కంపెనీ లబ్ధిపొందిందన్నారు. బిజినెన్స్ రూల్స్ ప్రకారం రేస్‌కు అనుమతి లేదన్నారు. ఈ రేస్‌తో రాష్ట్రానికి ఎలాంటి ఆదాయం రాదు. దీని కోసం ప్రభుత్వం 110 కోట్లు ఖర్చు చేయాలా అని ఆయన ప్రశ్నించారు.
భారత ఒలింపిక్ అసోసియేషన్ కొత్త సీఈఓగా రఘురామ్ అయ్యర్ ఎంపికయ్యారు. గతంలో ఆయన రాజస్థాన్ రాయల్స్ సీఈఓగా పనిచేశారు. ఈ మేరకు ఒలింపిక్ అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. క్రీడా నిర్వహణలో రఘురామ్‌కు విశేష అనుభవం దృష్ట్యా ఆయన ఈ బాధ్యతలకు తగిన వ్యక్తి అని వెల్లడించింది. పలువురు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశాక రఘురామ్‌ను ఎంపిక చేసినట్టు వెల్లడించింది. ఆయన ఎంపిక ఏకగ్రీవమని కూడా పేర్కొంది. సీఈఓ నియామకంపై ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ పలుమార్లు గుర్తు చేసిన నేపథ్యంలో రఘురామ్ నియామకం జరిగింది. రాజస్థాన్ రాయల్స్‌కు సీఈఓగా పని చేసిన రఘురామ్ గతంలో అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. ఇండియన్ సూపర్ లీగ్స్‌లో భాగంగా ఏటీకే మోహన్ బగన్కు, ఆర్పీఎస్జీ మేవరిక్స్ కు సేవలందించారు. కాగా, అయ్యర్ ఎంపికను ఐఓసీ మాజీ అధ్యక్షురాలు పీటీ ఉష కూడా స్వాగతించారు. అయ్యర్‌కు స్పోర్ట్స్ రంగంపై లోతైన అవగాహన ఉందని పేర్కొన్నారు. ప్రపంచ క్రీడా రంగంలో భారత్ విజయాల దిశగా అయ్యర్ ఎంపిక ఓ కీలక ముందడుగు అని అభిప్రాయపడ్డారు. కాగా, ఇప్పటివరకూ భారత్ ఒలింపిక్ అసోసియేషన్ సీఈఓ బాధ్యతలను ఆల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు, ఐఓఏ జాయింట్ సెక్రెటరీ నిర్వహించారు.
క్రికెట్ ప్రేమికులను అలరించేందుకు మరో మెగా టోర్నీకి రంగం సిద్ధమవుతోంది. వెస్టిండీస్, అమెరికా దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్న టీ20 వరల్డ్ కప్ కు షెడ్యూల్ విడుదల చేశారు. జూన్ 1 నుంచి 29వ తేదీ వరకు ఈ ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీ జరగనుంది. ఈసారి టీ20 వరల్డ్ కప్ కు ఓ విశిష్టత ఉంది. మునుపెన్నడూ లేని విధంగా ఏకంగా 20 జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీ లో క్వాలిఫయర్ టీమ్ లో సందడి చేయనున్నాయి. ఇక వరల్డ్ కప్ అంటే అందరూ ఆశించేది భారత్, పాకిస్థాన్ క్రికెట్ సమరాన్నే. ఈ టోర్నీలో దాయాది జట్లు రెండూ ఏ-గ్రూపు లో ఉన్నాయి. జూన్ 9న న్యూయార్క్ నగరంలో ఈ రెండు జట్ల మ్యాచ్ జరగనుంది. ఏ-గ్రూపు లో భారత్, పాక్ తో పాటు ఐర్లాండ్, అమెరికా, కెనడా జట్లు ఉన్నాయి.టీమిండియా తన గ్రూప్ మ్యాచ్‌లు అన్నింటినీ అమెరికా గడ్డపై ఆడనుంది.
ప్రతి క్రీడాకారుడికి క్రీడాస్ఫూర్తి ముఖ్యమని.. దీంతోనే భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, కలెక్టర్ గిరిషా పీఎస్ లు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆడుదాం ఆంధ్ర క్రీడలను అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రభుత్వ హై స్కూల్ మైదానం నందు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, కలెక్టర్ గిరిషా పీఎస్, జేసి ఫర్హాన్ అహమ్మద్, ఇండియన్ వాలి బాల్ క్రీడా కారిణి, ఆడుదాం ఆంధ్ర జిల్లా అంబాసిడర్ వసుమతిలు హాజరయ్యరు. సిఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఆడుదం ఆంధ్రా యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తెలియపరిచారు. అనంతరం జిల్లా అంబాసిడర్ వసుమతి కలెక్టర్ ఎమ్మెల్యేలకు క్రీడా జ్యోతిని అందజేశారు. అనంతరం జాతీయ జెండా ను ఆవిస్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించి బెలూన్లతో పాటు పావురాలను ఎగుర వేసి క్రీడలను ప్రారంబించారు. కబడ్డీ, కో-కో, వాలి బాల్ క్రీడలకు ఏర్పాటు చేసిన మైదానం ను వారు పరిశీలించారు. అనంతరం వాలి బాల్ క్రీడాకారులను పరిచయం చేసుకొని వారితో సరదాగా కాసేపు వాలి బాల్ ఆడారు. ఎమ్మెల్యే, కలెక్టర్, జేసి, జిల్లా అంబాసిడర్ లు కాసేపు వాలి బాల్ క్రీడలను ప్రత్యేక్షంగా చూసి క్రీడాకారులను ఉత్తేజపరిచారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు జిల్లా వ్యాప్తంగా ఒక లక్ష యాబై వేలకు పైగా ఆడుదాం ఆంధ్రా లలో ఆడేందుకు క్రీడాకారులు రిజిస్టర్ చేసుకోన్నారన్నారు. యువతలో ప్రతిభను వెలికి తీసేందుకే ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తిసుకువచ్చ్చారన్నారు. యువత మన రాయచోటి నుండి ఐపిఎల్ తో పాటు జాతీయ స్థాయిలో ఆడాలన్నదే తమ ఆకాంక్ష అన్నారు. రాయచోటి జిల్లా కేంద్రం అయిన తర్వాత క్రీడా మైదానం కు 27 ఎకరాలు స్థలాన్ని కేటాయించడమే కాకుండా త్వరితగతిన అన్ని రకాల వసతులతో క్రికెట్ స్టేడియాన్ని పూర్తీ చేసినందుకు కలెక్టర్ గిరిషా పీఎస్ కు ప్రత్యేక అభినందలు తెలియజేశారు. ఆ స్టేడియంలో జాతీయ స్థాయి టోర్నమెంట్ లు జరిగేందుకు తమవంతు కృషి చేస్తామన్నారు. ఆడుదాం ఆంధ్రా క్రీడలను యువత, విద్యార్థులు చక్కగా సద్వినియోగం చేసుకోవాలని మన జిల్లా కు మంచి పేరు ప్రఖ్యాతలు తేవలాని మనస్పూర్తిగా కోరుకొంటున్నట్లు ఈ సందర్బంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డివో రంగ స్వామి, మున్సిపల్ కమీషనర్ గంగ ప్రసాద్, రెవెన్యు అధికారులు, మున్సిపల్ చైర్మన్ షేక్ ఫయాజ్ బాష, వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ వండాడి వెంకటేశ్వర్లు, వైకాప నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్వహిస్తున్న “ఆడుదాం ఆంధ్ర” క్రీడా పోటీలను నేడు సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంబించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి గుంటూరు శివారు నల్లపాడుకు సిఎం చేరుకుంటారు. ఒక ప్రైవేట్ స్కూల్లో ఆడుదాం ఆంధ్రా పోటీలను సిఎం జగన్ ప్రారంభిస్తారు. అనంతరం 15 వేల 4 గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో పోటీలు మొదలవుతాయి. డిసెంబర్ 26 నుంచి 2024 ఫిబ్రవరి 10వ తేదీ వరకు మొత్తం 47 రోజులపాటు ఐదుదశల్లో ఈ పోటీలు జరుగుతాయి. సిఎం జగన్ పర్యటన దృష్ట్యా భారీగా పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు.
Read Also..





Total views : 197571