మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికుల సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో మంగళవారం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్, సిఐటియు అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె చేపట్టారు. యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు సూరి, రామాంజనేయులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను కార్మికులకు వర్తింపజేయాలని, కరోనా కష్టకాలంలో పని చేసిన కార్మికులకు పని భద్రత కల్పించాలని, పారిశుద్ధ్య కార్మికులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని, ట్రెజరీ ద్వారా 010 ప్రకారంగా వేతనాలు అమలు చేయాలని, రెగ్యులర్ కార్మికులకు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్ పద్ధతి ప్రకారం ఓ పి ఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో రాబోవు కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని వారు డిమాండ్ చేశారు. కార్మికుల సమ్మె చేయడంతో మున్సిపాలిటీలో ఎక్కడ చెత్త అక్కడే నిలబడిపోయింది.
అనంతపురం జిల్లా
అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని అంగన్వాడీ టీచర్లు, ఆయాల సమ్మె పదవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వీరు ప్లేట్లను శబ్దం చేస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, సిఐటియు నాయకులు మాట్లాడుతూ తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేని పక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. అంతేకాకుండా తమ సమస్యల్ని పరిష్కరించకుంటే రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని గద్దె దించుతామని సిఐటియు నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం మీరు అంగన్వాడి టీచర్ల, ఆయాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి గారికి వినతిపత్రం సమర్పించారు.
అనంతపురం జిల్లా గుత్తిలో మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని భార్యపై గొడ్డలితో విచక్షణ రహితంగా దాడి చేసిన భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు. అనంతపురం జిల్లా గుత్తి ఆర్ ఎస్ లో నివాసముంటున్న దంపతులు రవి దేవీలు చిన్నపాటి విషయంపై తరచూ గొడవ పడేవారు. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున మద్యం తాగినందుకు డబ్బులు ఇవ్వలేదు అంటూ భార్య దేవి పై భర్త రవి గొడ్డలితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. దాడిలో భార్య తలకు బలమైన గాయమైంది. స్థానికులు కుటుంబ సభ్యులు హుటాహుటిన గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం అనంతపురం రెఫర్ చేశారు. విషయం తెలుసుకున్న గుత్తి సీఐ వెంకటరామిరెడ్డి సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని దాడికి ఉపయోగించిన గొడ్డలిని దాడికి పాల్పడిన భర్త రవిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై పోలీసులు బాధితురాలు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.





Total views : 78566