అన్నమయ్య జిల్లా రాజంపేట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుల్లంపేట మండలం పుత్తనవారిపల్లె వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు మోటార్‌సైకిళ్లు ఢీకొనడంతో తీవ్ర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే బైక్‌పై ప్రయాణిస్తున్న సోంబత్తిన నారాయణ, లక్ష్మీదేవి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు.మృతులు రాజంపేట మండలం గాలివారిపల్లె గ్రామానికి చెందిన దంపతులుగా పోలీసులు గుర్తించారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకొని పంచనామా అనంతరం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
Tag:





Total views : 212189