2019 ముందు జగన్ మోహన్ రెడ్డి అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసాడని బోండా ఉమా అన్నారు. లక్ష పది వేల మంది అంగన్వాడీ ఉద్యోగులు రోడ్డున పడ్డారని ఆయన అన్నారు. జగన్ ఇచ్చిన హామీలు నిరవేర్చకుండా వాళ్ళ మీద ఎస్మా ప్రయోగం అమలు చేస్తున్నాడని అన్నారు. అలాగే ఈ రోజు మున్సిపల్ కార్మికులు నిరసన వల్ల విజయవాడ అంతా కంపు కొడుతా ఉందని అన్నారు. ఈ రోజు ఈ చిరు ఉద్యోగుల మీద నువ్వు ఎందుకు ఇంత కూరాత్మకంగా వ్యవహరిస్తున్నావని ఆయన జగన్ ను ప్రశ్నించారు. అంగన్వాడీ ఉద్యో్గులు ఉద్యోగాలకి వెళ్లకపోవడం వల్ల గర్భిణీలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. మున్సిపల్ కార్మికులు ఉద్యోగాలకు వెళ్ళాక పోవడం వలన సుమారు రోజుకు 600 టన్నుల చెత్త రోడ్డు ల పడి ఉన్నాడని అన్నారు. ఈ చలికాలం లో చెత్త పేరుకు పోవటం వలన దోమల బెడద ఎక్కువై ప్రజలు అనారోగ్యానికి గురై ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. హాస్పిటల్స్ లో ప్రజలు జాయిన్ అవుతుంటుంటే ఆరోగ్య శ్రీ పనిచేయడం లేదని అన్నారు. తెలుగుదేశం పార్టీ అంగన్వాడీ ఉద్యోగులకు, మున్సిపల్ కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతు తెలియజేస్తుందని అన్నారు. అన్ని నిత్యా అవసర సరుకుల ధరలు పెంచావు ఈ ప్రభుత్వం లో ప్రజలు ఎంతో నరకం అనుభవించారని అన్నారు. ఈ ప్రభుత్వం తో ప్రజలు విసిగి పోయారు ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉందని గుర్తు చేసారు. ఆ రోజు నువ్వు అధికారంలోకి రావడం కోసమే జనాలకు అమలు కానీ హామీలు ఇచ్చావని ఆయన అన్నారు.
జగన్ మోహన్ రెడ్డి
టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళగిరి టిడిపి కార్యాలయంలో జయహో బీసీ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి పలువురు టిడిపి బీసీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గడిచిన ఐదు సంవత్సరాలలో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం బీసీలకు ఎటువంటి అభివృద్ధి ఫలాలు అందించలేదని, విలువైన పదవులు అధికారాలు పూర్తిగా రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు తప్ప బీసీలను ఎక్కడ పట్టించుకోలేదని, కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఎవరికి ఎటువంటి ఉపయోగం లేదని, టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు పెద్దపీట వేసి బీసీలకు మరిన్ని రాజ్యాధికార పదవులు చంద్రబాబు నాయుడు ఇవ్వబోతున్నారని అన్నారు. వైఎస్ షర్మిల రాబోయే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి ని ఓడించబోతుందని టీడీపీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు అంటున్నారు.
అంగన్వాడీలు 24 రోజులుగా చేస్తున్న సమ్మె లో వరుస వినూత్న నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే గురువారం పిల్లలకు గాంధీ, అంభేద్కర్ వేషధారణ వేయించి వినూత్నంగా నిరసన తెలియచేసారు. జగన్ మోహన్ రెడ్డి తమ డిమాండ్లు నెరవేర్చాలని వారు కోరారు. తమ హామీలు నెరవేర్చే వరకూ అదరం, బెదరం అంటూహరి దాసు వేషధారణలో కీర్తనలు పాడుతూ నిరసన తెలిపారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం సరే కానీ ఆట స్థలాలు ఎక్కడ అంటూ గుంటూరు తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయి డిమాండ్ చేశారు. గుంటూరులో ఉన్న విద్యార్థి సంఘాలు కాసు బ్రహ్మానందరెడ్డి స్టేడియంను సందర్శన చేశారు. స్టేడియం అధ్వాన్నంగా తయారైంది అని ఆవేదన వ్యక్తం చేశారు. స్టేడియంలో మొలచిన పిచ్చి చెట్లను వారు తొలగించి విద్యార్థులకు మెరుగైన వసతులు, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లాలో ఆట స్థలాల పరిస్తితిని సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలుసుకోవాలని చెప్పారు. పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం చేపట్టడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ది కోసమే ప్రభుత్వం ఇలాంటి పనులు చేస్తుందని మండి పడ్డారు.
మంత్రి అంబటి రాంబాబు కి మాజీ మంత్రి ఆలపాటి రాజా కౌంటర్ ఇచ్చారు. శవాలను గుట్టలుగా వేసుకొని పోస్టు మార్టం మీరు చేసుకోవాలని ఎద్దేవా చేశారు. సకాలంలో కాల్వ తవ్వలేని, మురుగు కాల్వ బాగుచేయలేని మంత్రి అంబటి రాంబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోనే కాదు ఎక్కడ కూడా రాజకీయ మనుగడ లేని వ్యక్తి అంబటి రాంబాబు అని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అంటూ మండి పడ్డారు. సంక్షేమ ముసుగులో పెద్ద ఎత్తున అవినీతి చేస్తున్నారని ఆరోపణలు చేశారు. మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రి మద్యపానాన్ని నిషేదిస్తాను అన్న మాట తప్పారు అంటూ ఎద్దేవా చేశారు.
నెల్లూరు జిల్లా, కందుకూరు నియోజకవర్గం, ఉలవపాడు మండలం, కరేడు పంచాయతీలోని పెద్దపల్లెపాలెం గ్రామానికి చెందిన 12 కుటుంబాల వారు, ఈరోజు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. గ్రామానికి చెందిన తంబు శీను, వల్లభోని మల్లికార్జున, వల్లభోని వెంకటేశ్వర్లు, కొక్కిలిగడ్డ ప్రసాద్, కొక్కిలిగడ్డ వెంకట్రావు, కొక్కిలిగడ్డ కృష్ణారావు, నాయుడు రాజు, నాయుడు రాము, నాయుడు లక్ష్మణ్, నాయుడు సురేష్, పల్లెపాటి బాబులు, వల్లభోని నరసింహారావు లు పార్టీలో చేరగా… నియోజకవర్గ ఇన్చార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ, కొత్తగా వచ్చిన వారికి పార్టీలో తగిన గుర్తింపు, ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇస్తూ పాత, కొత్త నాయకులు అందరు కలిసి పనిచేసి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు. త్వరలోనే కందుకూరు నియోజకవర్గం నుంచి పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ మోహన్ రెడ్డి దుర్మార్గాలను చూడలేక, వైసీపీ నుంచి అనేకమంది బయటికి వస్తున్నారని నాగేశ్వరరావు తెలిపారు.