పి గన్నవరం నియోజకవర్గ వైయస్సార్సీపి ఇన్చార్జి గా నియమించిన మూడు రోజుల తర్వాత విప్పర్తి వేణుగోపాలరావు పి గన్నవరం నియోజకవర్గంలో అడుగుపెట్టారు. అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి సాక్షిగా వైసీపీ వర్గ విభేదాలు బయటపడ్డాయి. సిటింగ్ ఎమ్మెల్యేని కాదని జిల్లా పరిషత్ చైర్మన్ కి నియోజకవర్గ బాధ్యతలు అప్ప చెప్పడంపై ద్వితీయ శ్రేణి నాయకులు మండిపడుతున్నారు. అయినవిల్లి విఘ్నేశ్వర స్వామిని దర్శించుకుని పి గన్నవరం వైఎస్ఆర్సిపి ఇన్చార్జిగా విప్పర్తి వేణుగోపాలరావు బాధ్యతలు చేపట్టారు. ఇన్చార్జిగా నియమితులై మొదటిసారి అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకున్న విప్పర్తికి చేదు అనుభవం ఎదురైంది. ఈ కార్యక్రమానికి పి.గన్నవరం నియోజకవర్గం నాలుగు మండలాల వైసీపీ ప్రెసిడెంట్ లు గైర్హాజరు కావడంపై మరోసారి వైసీపీలో గ్రూపు రాజకీయాలు బయటపడ్డాయి. నియోజకవర్గంలో మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఉన్న వైఎస్ఆర్సిపి నేతలు ఎవరు ఈ కార్యక్రమానికి హాజరు కాకుండా వేణుగోపాలరావు కు జలక్ ఇచ్చారు. కొండేటి చిట్టిబాబుని కాదని మరి ఎవరికైనా సీట్ ఇస్తే సహకరించేది లేదని కొండేటి చిట్టిబాబు వర్గీయులు ముందే తెలియజేశారు. దీనితో పి గన్నవరం నియోజకవర్గంలో వైసిపి వర్గ పోరు ఆరంభమైందని నియోజకవర్గం అంతట గుసగుసలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గ వైసిపి ముఖ్య నేతలు గైర్హాజరు పై స్పందిస్తూ అలాంటిదేమీ లేదు అని కొత్త ఇంచార్జ్ విప్పర్తి వేణుగోపాల్ కవర్ చెయ్యడానికి ప్రయత్నించారు.
పి గన్నవరం నియోజకవర్గం
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం శ్రీరాముని అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట జనవరి 22వ తేదీన జరగనున్న నేపథ్యంలో విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు దేశమంతటా అయోధ్య రామ మందిరం నుండి తీసుకొచ్చిన అక్షింతలు, అయోధ్య రామ మందిరం యొక్క రాముడు చిత్రపటం, కరపత్రం మొదలగునవి దేశమంతటా ప్రతి గ్రామ గ్రామాన ప్రతి ఇంటికి చేరే విధంగా పంచనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కోనసీమ జిల్లా విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు అక్కిరెడ్డి సుబ్రమణ్యం ఆధ్వర్యంలో ఈరోజు పి గన్నవరం వైనతేయ గోదావరి నది ఒడ్డున వెలసిన శ్రీ పట్టాభి రామచంద్రస్వామి ఆలయం వద్ద విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు సమావేశమై కోనసీమ జిల్లా అంతా శ్రీరామ చంద్ర స్వామి వారి అక్షింతలు, చిత్రపటం మొదలుగునవి జనవరి ఒకటి నుండి ప్రతి ఇంటికి చేరవేసే కార్యక్రమం చేపట్టామని అన్నారు. జనవరి 22వ తేదీన స్వామివారి ప్రాణ ప్రతిష్ట జరిగే సమయంలో దేశమంతటా ఉన్న దేవాలయాలలో భజనలు, కళ్యాణాలు, హోమాలు, క్రతువులు చేయమని చెప్పడం జరుగుతుందని అదేవిధంగా ఆరోజు సాయంత్రం దేశంలో ఉన్న ప్రతి ఇంటి వద్ద తక్కువలో తక్కువగా కనీసం ఐదు దీపాలు వెలిగించాలని ప్రతి ఇంటికి చెప్పడం జరుగుతుందని అన్నారు. ఆ విధంగా జనవరి 22వ తేదీన ప్రతి ఇంటి వద్ద దీపాలను వెలిగించి 500 ఏళ్ల తర్వాత ప్రతి ఇంటి వద్ద ఆనందం వెళ్లి విరిసి మన హిందువుల కలలను సహకారం చేసుకోవాలని అన్నారు.
పి గన్నవరం నియోజకవర్గ నాలుగు మండలాలకు సంబంధించిన అంగన్వాడి టీచర్స్ మరియు హెల్పర్స్ 13వ రోజు సమ్మెలో భాగంగా పి గన్నవరం తహసిల్దార్ కార్యాలయం నుండి త్రీ రోడ్ జంక్షన్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీని నిర్వహించారు. అంగన్వాడీలకు ఫోన్ లు ఇచ్చాము. చీరలు పెట్టాము. సెల్ ఫోన్ లకు చార్జీలు ఇచ్చాము అని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి చెప్తున్నారు. ఫోన్లు మేము సొంతంగా వాడుకోవడానికి కాదని మా డ్యూటీ నిమిత్తం ఇచ్చారని అవి కూడా పనిచేయడం లేదని మా సొంత సెల్ ఫోన్లతో మా బాధ్యతలను నిర్వర్తిస్తున్నామని వాపోతున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు తమ నిరసనను ఆపబోమని తమ న్యాయపరమైన కోరికలు ప్రభుత్వం వెంటనే తీర్చాలని అంగన్వాడీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. తమ న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చకపోతే సమ్మె ఇంకా ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.





Total views : 78139