అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గుంతకల్లు శాసనసభ్యులువై వెంకట్రామిరెడ్డిగారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్ అండ్ బి బంగ్లా ఆవరణంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ భూమి పట్టాల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు. అనంతరం పట్టణంలోని 23వ వార్డుకు చెందిన సచివాలయం వద్ద ఏర్పాటుచేసిన సభలో ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని కార్డులు పంపిణీ చేశారు. స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినిలకు ట్యాబులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని అలాగే గుంతకల్లు నుంచి తనను కూడా రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలను కోరారు.
Tag:
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఏ ఐ ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉదయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నాలుగున్నర సంవత్సరాలు గడుస్తున్న ఇంతవరకు విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టల్ విద్యార్థుల సమస్యలను పరిష్కారం చేసి, విద్యార్థులకు అన్ని రకాల ఫీజులను రద్దు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న మెస్ బిల్లులను, కాస్మోటిక్ చార్జీలను వెంటనే విడుదల చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నవీన్ కుమార్, విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.





Total views : 78342