శంషాబాద్ మండలం బహదూర్‌గూడలో ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం భూసేకరణ అంశం రాజకీయంగా చర్చనీయాంశమైంది. తమ భూములు కోల్పోతామనే ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులను పరామర్శించారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ . రైతులతో మాట్లాడిన ఆయన వారి సమస్యలను తెలుసుకున్నారు . భూసేకరణలో రైతుల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతుల హక్కులను పరిరక్షించేలా న్యాయమైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా రైతులు తమ ఆందోళనలు, భూసేకరణపై ఉన్న సందేహాలను ఈటల రాజేందర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం రైతులతో చర్చించి పారదర్శకంగా ముందుకు సాగాలని, రైతుల ప్రయోజనాలు కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
Tag:




Total views : 221446