Tuesday, July 21, 2026
News Navigation
Tuesday, July 21, 2026
News Navigation

Breaking

Tuesday, July 21, 2026
Home Latest News బహదూర్‌గూడ రైతులను పరామర్శించిన ఈటల రాజేందర్.

బహదూర్‌గూడ రైతులను పరామర్శించిన ఈటల రాజేందర్.

by CVR NEWS
బహదూర్‌గూడ రైతులను పరామర్శించిన ఈటల రాజేందర్

శంషాబాద్ మండలం బహదూర్‌గూడలో ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం భూసేకరణ అంశం రాజకీయంగా చర్చనీయాంశమైంది. తమ భూములు కోల్పోతామనే ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులను పరామర్శించారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ . రైతులతో మాట్లాడిన ఆయన వారి సమస్యలను తెలుసుకున్నారు . భూసేకరణలో రైతుల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతుల హక్కులను పరిరక్షించేలా న్యాయమైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా రైతులు తమ ఆందోళనలు, భూసేకరణపై ఉన్న సందేహాలను ఈటల రాజేందర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం రైతులతో చర్చించి పారదర్శకంగా ముందుకు సాగాలని, రైతుల ప్రయోజనాలు కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

041940
Total views : 221094

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: