39
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మూఢనమ్మకాలపై అవగాహనా ర్యాలీ నిర్వహించారు అధికారులు. వరుస మరణాలతో తమ కాలనీవాసులకు కీడు సోకిందనే నమ్మకంతో కీడు వంటలకు వెళ్లారు. ఇలా చేస్తే తమకు కీడుపోయి మరణాలు తగ్గుతాయని భావించారు. దీనిపై తమకందిన సమాచారంతో ఆరోగ్యశాఖాధికారులు మూఢనమ్మకాలపై అవగాహన కల్పించారు. కాలనీవాసులకు రక్తపరీక్షలు నిర్వహించి మూఢనమ్మకాలను నమ్మొద్దని..ఏదైనా అనారోగ్య సమస్యలుంటే వైద్యులను సంప్రదించాలని కోరారు. స్థానిక ప్రజలకు మెగా హెల్త్ క్యాంపు నిర్వహించి ప్రజల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అవసరమైన వైద్య సూచనలు చేశారు. ప్రజల ఎటువంటి అపోహలు, మూఢనమ్మకాలను నమ్మవద్దని కోరారు.




Total views : 221094