Tuesday, July 21, 2026
News Navigation
Tuesday, July 21, 2026
News Navigation

Breaking

Tuesday, July 21, 2026
Home Andhra Pradesh డాక్యుమెంట్ రైటర్ల పెన్డౌన్పై సీఎం చంద్రబాబు సమీక్ష.

డాక్యుమెంట్ రైటర్ల పెన్డౌన్పై సీఎం చంద్రబాబు సమీక్ష.

by CVR NEWS

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రైవేటీకరిస్తున్నారంటూ కొందరు పని గట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని… దీనిపై వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్లో వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రైవేటీకరిస్తున్నారనే అంశం సమీక్షలో ప్రస్తావనకు వచ్చింది. ప్రజలకు మెరుగైన రిజిస్ట్రేషన్ సేవలందించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని సీఎం పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ సేవలను మరింత సులభతరం చేసేలా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రం… RSKలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఇది ప్రైవేటీకరణ ఎంత మాత్రం కాదని… పాస్ పోర్టు సేవా కేంద్రాల తరహాలోనే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పని చేస్తాయన్నారు. పాస్ పోర్టు సేవా కేంద్రాల పనితీరు ఏ విధంగా జరుగుతుందో… ఆ తర్వాత ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందో వివరించాలని సూచించారు. పాస్ పోర్టు సేవా కేంద్రాలు అందుబాటులోకి వచ్చాక పాస్ పోర్టు ప్రాసెసింగ్ అనేది చాలా సులువైందని చెప్పారు. ఇదే తరహాలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల పనితీరు ఉంటుందని సీఎం చంద్రబాబు వివరించారు. ప్రజలకు వాస్తవాలు వివరించే బాధ్యతను అధికారులు తీసుకోవాలన్నారాయన. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల వల్ల కలిగే లాభాలను వివరించాలని… అలాగే డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు సీఎం చంద్రబాబు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

042040
Total views : 221432

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: