జనగామ జిల్లా కలెక్టరేట్‌లో భారీ ఆర్థిక అక్రమాలు వెలుగుచూశాయి. కలెక్టరేట్ ఖాతా నుండి 37 లక్షల 85 వేల రూపాయల ప్రజాధనం పక్కదారి పట్టినట్లు అంతర్గత తనిఖీల్లో నిర్ధారణ కావడంతో అధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఈ నేరానికి పాల్పడిన ముగ్గురు కలెక్టరేట్ ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ, వారిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. ట్రెజరీ వెలుపల ఉన్న ఒక ప్రైవేటు బ్యాంకులోని కలెక్టరేట్ ఖాతా నుండి ఈ అక్రమాలు జరిగాయి. ఆఫీస్ ఫర్నిచర్, కంప్యూటర్లు కొనుగోలు చేసినట్లు నకిలీ బిల్లులు సృష్టించి, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒకే రోజున 37.85 లక్షల సొమ్మును దారి మళ్లించారు. అయితే, ఉన్నతాధికారులు భౌతికంగా తనిఖీ చేయగా కలెక్టరేట్‌లో ఒక్క కొత్త వస్తువు కూడా లభించకపోవడంతో అసలు రంగు బయటపడింది. ఈ వ్యవహారంపై జనగామ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు ఈ ఆర్థిక నేరంపై లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. ఇదే తరహాలో దిక్సూచి పుస్తకాల ముద్రణ పేరిట కూడా మరో 46 లక్షల 50 వేల దుర్వినియోగమైనట్లు జిల్లా యంత్రాంగం ఇప్పటికే గుర్తించింది. కలెక్టరేట్ నిధుల నుండి మొత్తంగా కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయినట్లు అనుమానాలు వ్యక్తమవుతుండటంతో, అధికారులు పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నారు. దుర్వినియోగమైన ప్రజాధనంలో ప్రతి పైసాను బాధ్యుల నుండి తిరిగి రాబడతామని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది.
జనగామ జిల్లా కలెక్టరేట్‌లో భారీగా ఆర్థిక అక్రమాలు.
37
previous post




Total views : 221094