50
తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన కేకే కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని తెలంగాణ ఉద్యమ విద్యార్థి జేఏసీ డిమాండ్ చేసింది. ఓయూ ఆర్ట్స్ కళాశాల వేదికగా విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన కీలక సమావేశంలో ప్రముఖ ఉద్యమ నాయకులు డాక్టర్ వేల్పుల కుమార్ సహా పలువురు జేఏసీ నాయకులు పాల్గొన్నారు. కేకే కమిటీకి ప్రభుత్వం ఇచ్చిన మూడు నెలల గడువు ముగుస్తున్న తరుణంలో, నివేదికను కాలపరిమితి లోపు వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. కమిటీని ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తమకు గౌరవం, ప్రేమ ఉన్నప్పటికీ… నివేదిక వెల్లడిలో ఆలస్యం జరిగితే ప్రభుత్వంపై పోరాటానికైనా వెనకాడబోమని విద్యార్థి ఉద్యమకారులు స్పష్టం చేశారు.




Total views : 221094