యాదాద్రి టెంపుల్ బోర్డు మెంబర్ ఈశ్వరమ్మ యాదవ్‌పై జరిగిన అనుచిత వ్యాఖ్యల ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ఆమెను పరామర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ నాయకుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ నేతలను తక్కువ చేసి మాట్లాడుతూ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. బీసీలకే పెద్ద దిక్కుగా ఉన్న ఈశ్వరమ్మ యాదవ్‌పై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరమని, దీనికి బాధ్యులు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ యూత్ విభాగం అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డిపై తక్షణమే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి, పీసీసీ అధ్యక్షునికి, కాంగ్రెస్ అధిష్ఠానానికి ఆర్.కృష్ణయ్య సూచించారు.
ఈశ్వరమ్మను పరామర్శించిన ఆర్.కృష్ణయ్య.
36
previous post




Total views : 221094