46
కాకినాడ జిల్లా జగ్గంపేటలో రోజురోజుకూ ట్రాఫిక్ సమస్య తీవ్రరూపం దాల్చుతోంది. పరిసర గ్రామాల నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో ప్రజలు వివిధ పనుల కోసం జగ్గంపేటకు రావడంతో ప్రధాన రహదారులు రద్దీగా మారుతున్నాయి. అయితే ట్రాఫిక్ నియంత్రణలో సంబంధిత అధికారులు పూర్తిగా విఫలమయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. క్రమబద్ధమైన ట్రాఫిక్ వ్యవస్థ లేకపోవడంతో వాహనాలు ఇష్టానుసారంగా సంచరిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వన్‌వే విధానం అమలు చేయడంతో పాటు రోడ్ల విస్తరణ చేపట్టాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జనాభా పెరుగుదలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయకపోవడమే సమస్యకు ప్రధాన కారణమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.



Total views : 221432