Tuesday, July 21, 2026
News Navigation
Tuesday, July 21, 2026
News Navigation

Breaking

Tuesday, July 21, 2026
Home Crime అహ్మదాబాద్‌లోని బాణాసంచా తయారీ కేంద్రంలో ప్రమాదం.

అహ్మదాబాద్‌లోని బాణాసంచా తయారీ కేంద్రంలో ప్రమాదం.

by CVR NEWS
అహ్మదాబాద్‌లోని బాణాసంచా తయారీ కేంద్రంలో ప్రమాదం

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బాణాసంచా యూనిట్‌లో భారీ పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా..పలువురికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

రామోల్ ప్రాంతంలోని మెహమూద్‌పురాలో ఓ ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన బాణసంచా తయారీ కేంద్రంలో ఈ దుర్ఘటన జరిగింది. పేలుడు జరిగిన వెంటనే 9 మందిని ఎల్.జి. ఆసుపత్రికి తరలించగా, వారిలో నలుగురు అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్ర గాయాలతో చేరిన ఐదుగురిలో చికిత్స పొందుతూ మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. 95 శాతం కాలిన గాయాలతో వీరు మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మరో ఆరుగురిని అసర్వా సివిల్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ ఒకరు మరణించారు.

పేలుడు శబ్దం వినిపించిన వెంటనే సమీపంలోని రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సమాచారమందుకొని అక్కడికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

042040
Total views : 221438

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: