ప్రజాప్రతినిధులపై ఛార్జిషీట్ దాఖలు చేసేముందు… అవినీతి నిరోధక సవరణ చట్టం సెక్షన్ 17ఏ ప్రకారం, కాంపిటెంట్ అథారిటీ నుంచి అనుమతి తీసుకోవాల్సిందేనని అవినీతి నిరోధకశాఖకు విజయవాడ ఏసీబీ కోర్టు తేల్చిచెప్పింది. అనుమతి తీసుకున్న తరవాతే అభియోగపత్రం దాఖలు చేయడం ఎప్పటి నుంచో అనుసరిస్తున్న విధానమని స్పష్టం చేసింది. ఈఎస్ఐ ఆసుపత్రుల్లో మందులు, వైద్యపరికరాల కొనుగోలుకు సంబంధించి మాజీ మంత్రి అచ్చెన్నాయుడిపై నమోదు చేసిన కేసులో, అభియోగపత్రం దాఖలు చేయడానికి ముందు గవర్నర్ నుంచి 17ఏ ప్రకారం అనుమతి తీసుకోలేదని ఏసీబీ కోర్టు అభ్యంతరం లేవనెత్తింది. అచ్చెన్నాయుడిపై దాఖలు చేసిన అభియోగపత్రాన్ని విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకునేందుకు నిరాకరించింది. సంబంధిత అథారిటీ నుంచి ముందస్తు అనుమతి ఉండాల్సిందేనని తేల్చిచెప్పింది.
achennaidu
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ‘బీసీల వెన్ను విరుస్తున్న జగన్ రెడ్డి’ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ పుస్తకాన్ని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, బుద్దా వెంకన్న, ఇతర టీడీపీ నేతలు పాల్గొన్నారు. పుస్తకావిష్కరణ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుత టీడీపీ హయాంలో బీసీల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. జిల్లాల్లో బీసీ భవన్ లు నిర్మించామని చెప్పారు. భవిష్యత్తులోనూ టీడీపీ బీసీలకు ప్రాధాన్యతనిస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం పదవుల్లో బీసీలు ఉన్నప్పటికీ ఒక సామాజిక వర్గానిదే అసలైన అధికారం అని అచ్చెన్నాయుడు విమర్శించారు. కోర్టు వద్దని చెప్పినా కూడా వినకుండా సలహాదారులను నియమిస్తున్నారని ఆరోపించారు. సలహాదారుల్లో బీసీలు ఎంతమంది ఉన్నారు? సలహాదారులుగా బీసీలు పనికిరారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం పట్ల బీసీలు భ్రమలు వీడాలని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.





Total views : 79449