ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతపురం జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది కూలీలు మరణించారు. అరటితోటలో పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న కూలీల ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8మంది మరణించగా..5గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఏపీలోని అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం దగ్గర 44వ జాతీయ రహదారిపై జరిగిన ఘోరరోడ్డు ప్రమాదం పుట్లూరు మండలం ఎల్లుట్లో విషాదాన్ని నింపింది. ఎల్లుట్ల నుంచి 60కిలోమీటర్ల దూరంలోని తలగాసుపల్లిలో అరటితోటలో పని చేసేందుకు 12 మంది కూలీలు ఆటోలో వెళ్లారు. తోటలో పని ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వస్తున్న క్రమంలో ఆర్టీసీ బస్సు కబళించింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో ఆటోను వేగంగా ఢీకొట్టింది. ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మరణించారు. అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యలో మరో ఐదుగురు మరణించారు. ప్రమాదంలోమరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్ధితి విషమంగా ఉంది. వీరంతా ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరంతా ఒకే వీధికి చెందినవారు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరణించినవారి కుటుంబాలకు ప్రభుత్వం రూ. 5లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ఆరోపణలు.అమెరికా ఎన్నికల వ్యవస్థలో చైనా భారీగా జోక్యం చేసుకుందని, ఏకంగా 22 కోట్ల మంది ఓటర్ల డేటాను దొంగిలించిందని సంచలన ఆరోపణలు చేశారు US ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. అమెరికా చరిత్రలోనే ఇది అతిపెద్ద ఎన్నికల డేటా చౌర్యం అని ఆరోపించారు.…
- అన్నమయ్య జిల్లాలో ఘనంగా విరుపాక్షమ్మ తల్లి పుష్కరోత్సవాలు.అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లిలోని శ్రీ విరుపాక్షమ్మ తల్లి ఆలయంలో పుష్కరోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ నిర్మాణానికి 12 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.మూడు…
- దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.భారత రైల్వే చరిత్రలో నూతన శకం ఆరంభమైంది. రైల్వే రంగంలో పర్యావరణహిత విధానాలను ప్రవేశపెట్టే దిశగా కీలక ముందడుగు పడింది. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్‌తో నడిచే రైలు పట్టాలెక్కింది. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు.…
- పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం.పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో విషాదం నెలకొంది. స్కూల్ బస్సును రైలు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో ఓ స్కూల్ బస్సు కర్ణసుబర్ణ రైల్వే క్రాసింగ్ దగ్గర పట్టాలు దాటుతుండగా…
- ఇరాన్‌పై మరోసారి అమెరికా దాడులు.పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత ఉధృతమయ్యాయి. ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ వంటి హర్మూజ్ జలసంధి కేంద్రంగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇరాన్‌లోని బ్రిడ్జిలు, రవాణా మార్గాలపై అమెరికా వైమానిక దాడులను మరింత తీవ్రతరం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 212529