గత నెల 26వ తేదీ నుండి మూడు ప్రాంతాలనుండి మూడు రథాలు ఎక్కి జగనన్న కటౌట్ పెట్టీ బస్ యాత్ర చేస్తేనే జన సంద్రంగా మారింది. సైకిల్ తుప్పు పట్టింది,గ్లాసు పగిలిపోయింది. పావలా కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడో తెలియదు. చంద్రబాబు జైల్ నుండి నేరుగా హైదరాబాద్ వెళ్ళిపోయాడు. సామాజిక న్యాయం గురించి చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ మాట్లాడలేదు. నలుగురు వెనుకబడిన వర్గాలకు చెందిన వారిని రాజ్యసభ సభ్యులను చేసింది జగనన్న స్పీకర్, చైర్మన్ స్థానాలలో వెనుకబడిన వారిని కూర్చోబెట్టిన ఘనత జగన్ మోహన్ రెడ్డిది. చంద్రబాబు పాలేరు పవన్ కళ్యాణ్ అయితే పవన్ కళ్యాణ్ చెంచా నాదెళ్ల మనోహర్ ప్రెస్మీట్ పెట్టీ విద్యా కానుక కిట్ ఇవ్వడం తప్పు అంటాడు. తప్పో కాదో ప్రజలే చెప్పాలి. పేదవారిపై వీరంతా కక్ష కట్టారు.
Andhra Pradesh News
ఏపీలో విద్యార్థుల సామగ్రి కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఇచ్చే వస్తువుల నాణ్యత సరిగా లేదని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది రూ.1,050 కోట్లతో విద్యార్థులకు బ్యాగులు, షూస్ కొనుగోలు చేశారన్నారు. 42 లక్షల మంది పేద విద్యార్థుల కోసం కొనుగోలు ఆర్డర్లు ఇచ్చారన్నారు. ఈ పథకం కింద మూడేళ్లలో సామగ్రికి 2400 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని వెల్లడించారు. టెండర్ ప్రక్రియలో ఐదు కంపెనీలు సిండికేట్గా ఏర్పడ్డాయని తెలిపారు. నిధులు దారి మళ్లినట్లు ఎన్ఫోర్స్మెంట్ విచారణలో తేలిందని వెల్లడించారు. గతేడాది ఫ్లాట్ ప్యానెల్స్ కు సంబంధించి నేటికీ డబ్బులు ఇవ్వలేదన్నారు. నాలుగు వందల కోట్ల రూపాయలతో ఫ్లాట్ ప్యానెల్స్ కొనుగోలు పేరిట మరో కుంభకోణం జరిగిందన్నారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పల్లకీపై మోహినీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఐదో రోజు మంగళవారం ఉదయం అమ్మవారు మోహినీ అలంకారంలో పల్లకీలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. అమ్మవారి మోహినీ అవతారం భౌతికంగా జగన్మోహకత్వాన్నీ, ఆధ్యాత్మికంగా మాయాతీతశుద్ధ సాక్షాత్కారాన్ని ఏక సమయంలోనే సిద్ధింపజేస్తోంది. ఉదయం 11.30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీ కృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు.
టీటీడీ ధర్మకర్తల మండలి నేడు తిరుమలలో సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీలోని అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. అలిపిరి గోశాల వద్ద ఈ నెల 23 నుంచి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిర్వహించనున్నారు. టీటీడీ పర్మినెంటు ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానంగా 14 వేల రూపాయలు, కాంట్రాక్టు ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానంగా 6850 రూపాయలు ఇవ్వనున్నారు. పప్పు దినుసులు, చక్కెర, నెయ్యి నిల్వ చేసేందుకు అలిపిరి వద్ద మరో గోదాం నిర్మించాలని నిర్ణయించారు. కరీంనగర్ లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి 15.54 కోట్ల రూపాయలను మంజూరు చేసేందుకు టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో గంజాయి తరలిస్తున్న ఇద్దరు అరెస్టు, 23 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న తాడేపల్లిగూడెం పట్టణ పోలీసులు. గంజాయి తరలిస్తున్న ఇరువురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 23 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తాడేపల్లి గూడెం పట్టణ ఎస్సై కె.సుధాకర్ రెడ్డి తెలిపారు. జిల్లా ఎస్పీ యు రవి ప్రకాష్ , డీఎస్పీ శరత్ రాజ్ కుమార్ ఆదేశాలతో తాడేపల్లిగూడెం పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ SSV నాగరాజు కి వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు నిర్వహించినట్లు తెలిపారు. ఎస్సై సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నిన్నటిరోజున ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ శివారు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో ఇరువురు యువకులు గంజాయి కలిగి ఉన్నారన్న సమాచారం మేరకు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. గంజాయి తరలిస్తున్న షేక్ అక్బర్, ఓరుగంటి షాలేం రాజు అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 23 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని, కోర్టులో హాజరు పరచనున్నట్లు వివరించారు. మత్తు, మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, తమ జీవితాలను సన్మార్గంలో తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. ఆయన వెంట ఎస్సై జీజే ప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ జి.శ్రీను, కానిస్టేబుల్స్ సి.శ్రీనివాసరావు, కె.రాజు,కె.మహేష్ ఉన్నారు.
మట్టి దొంగలను అరెస్ట్ చేయాలి అని మైలవరం పోలీసుస్టేషన్ లో ఎస్.ఐ హరి ప్రసాద్ కి పిర్యాదు చేశారు. మండలంలోని పుల్లురు గ్రామంలో రూ.3 కోట్లు విలువైన నిలువ చేసిన మట్టిని తరలిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆయన అనుచరులు ఏ ఎం సి చైర్మన్ అప్పిడి సత్యనారాయణ రెడ్డిని అరెస్ట్ చేయాలి. పుల్లూరు గ్రామస్తులు మట్టి తోలకాలను అడ్డుకొని పోలీసులకు పట్టిస్తే కేసు నమోదు చేయకపోగా ఫిర్యాదు ఇస్తే విచారణ చేస్తామని పోలీసులు అనడం విడ్డూరంగా ఉందన్నారు. వైసిపి నాయకులకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చెరువు మట్టి ప్రజల అస్తి అలాంటి సంపదను వైసిపి నాయకులు దోచుకుంటున్నారు. వైసిపి నాయకులు మట్టి దోపిడీ రఘురాం రెడ్డి కి కనిపించటం లేదా అని ప్రశ్నించారు.
ఎంత వరకు చంద్రబాబు నాయుడు పై ఏ కేసులు పెడదాం అని చూస్తున్నారు అని విమర్శించారు. ఒక ఛాన్స్ పేరు తో ఎమ్మెల్యే అయ్యిన వసంత కృష్ణ ప్రసాద్ మట్టి దొంగలను, ఇసుక దొంగలను కాపాడుతున్నారని.., వైసీపీ పార్టీ కార్యాలయం లో ఉన్న అనుచరుల ద్వారా ఎమ్మెల్యే గంజాయి అమ్మిస్తున్నారని ఆరోపించారు. పేర్లు మార్చుకొని దుర్మార్గులు అంత మైలవరం ని చెర పట్టేందుకు గ్రామాల్లోకి వస్తున్నారని వీళ్ళందర్నీ తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుల ఉన్నత పాఠశాలలో దీపావళి పండుగ సందర్భంగా 10-11-23 నుండి 12-11-23 వరకు 19 షాపులకు పర్మిషన్ ఇవ్వగా పర్మిషన్ టైం అయిపోయినా కానీ మమ్మల్ని ఎవరేం చేస్తారు అంటూ ఈరోజు కూడా వారి దుకాణాలను కొనసాగించుకోవడం ప్రశ్నార్థకంగా ఉన్నది అధికారులకు కావాల్సిన అంత మామూలు అందిన వేమోకానీ వారి చూపు మాత్రం అటువైపు లేవు. కంటికి కనపడటం లేదు ఫైర్ స్టేషన్ అధికారులకు వారికి కేటాయించిన స్థలంలో ఎవరు లేకపోవటం ఇంకా ఆశ్చర్యం కలిగిస్తుంది. దీపావళి దుకాణాలు ఈరోజు నడుపుకోవటానికి ఏ అధికారి పర్మిషన్ ఇచ్చారో తెలియదు. ఇప్పటికైనా అధికారులు ఇటువంటి వాటిలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.
ఇందుకూరుపేట మండలంలో లేబూరు గ్రామంలో వాలంటీర్, స్థానిక మైనర్ అమ్మాయిని ఎత్తుకెళ్లిన ఘటన. లేబూరు గ్రామంలో వాలంటీర్ గా పని చేస్తున్న ఓ వ్యక్తి సుమారు 15 సంవత్సరాలు వయసు కలిగిన అమ్మాయిని తీసుకెళ్లారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. మైనర్ అమ్మాయి ఉర్దూ పాఠశాలలో విద్యార్థి అనేది సమాచారం ఈనెల ఎనిమిదో తారీకు స్థానిక శాసనసభ్యులు కార్యక్రమం నిమిత్తం ఫ్లెక్సీలు ఏర్పాటు సమయంలో అమ్మాయిని బైక్ పై తీసుకెళ్లారనేది తల్లిదండ్రులు అనుమానం తీసుకెళ్లిన వ్యక్తి స్థానికంగా లేబూరులో వాలంటీర్ గా పనిచేస్తున్నారనేది సమాచారం ఈ విషయమై స్థానిక ఇందుకూరుపేట పోలీస్స్టేషన్ లో కేసు విచారిస్తున్నారని పోలీసులు తెలిపారు ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గుంటూరు జిల్లాల్లో టిడిపి, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ మరి కొద్దిసేపట్లో తొలిసారి సమావేశం కానుంది. టిడిపి తరపున యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, పట్టాభి హాజరు అవుతున్నారు. జనసేన నుంచి వరప్రసాద్, శశి కుమార్, శరత్ బాబు హాజరు అవుతున్నారు.రాష్ట్రంలో సంక్షేమం ,అభివృద్ధి, ఎజెండా గా రూపకల్పన చేసే విధంగా ప్రణాళిక ని సిద్దం చేస్తున్నారు. టిడిపి తయారు చేసిన కొన్ని అంశాలకు భవన నిర్మాణ కార్మికులు, ఇసుక పాలసీ, విద్యుత్ చార్జీలు వసూలు లో ప్రజలు ఇబ్బందులు దృష్టి లో ఉంచుకొని మ్యానిఫెస్టోలో పొందుపరిచే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా రైతు ,యువత కార్మికులు సమస్యలను మ్యానిఫెస్టోలో రూపకల్పన చేయనున్నారు. దీంతో పాటు మరో రెండు పర్యాయాలు ఇలాంటి సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
తిరుపతి జిల్లా సత్యవేడు మండలం కన్నవరం ఎస్సీ కాలనీకి చెందిన యువకుడు అభిషేక్(20) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు సత్యవేడు పట్టణం సదవాలమ్మ దేవాలయం సమీపంలో తెలుగు గంగ కాల్వ ప్రాంతంలో అభిషేక్ మృతదేహం ఆదివారం రాత్రి బయట పడ్డట్టు సమాచారం, నాగలాపురం మండలం బీర కుప్పం గ్రామంలో ఓ వివాహిత మహిళతో పరిచయం, వివాదాల నేపథ్యంలో మనస్థాపనికి గురైన కన్నవరం ఈశ్వరన్ కుమారుడు అభిషేక్ ఐదు రోజులు క్రితమే ఆత్మహత్యకు పూనుకున్నట్టు మృతదేహం ఆనవాళ్లు బట్టి తెలుస్తున్నట్టు స్థానిక ఎస్సై శ్రీకాంత్ రెడ్డి చెప్పారు అభిషేక మృతిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపుతున్నామన్నారు. పోలీస్ విచారణ అనంతరం సమాచారం పూర్తిస్థాయిలో తెలియాల్సి ఉంది మృతి చెందిన అభిషేక్ హీరో మోటారు కంపెనీలో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది
.





Total views : 194411