ఈ నెల 25న ఏసీబీ కోర్టు జడ్జికి రాసిన మూడు పేజీల లేఖలో చంద్రబాబు పలు అంశాలు ప్రస్తావించారు. రాజమండ్రి జైల్లో ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్న పలు లోపాలు. జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న తన ప్రాణాలకు ముప్పుగా పరిణమించినట్లు చంద్రబాబు తెలిపారు. సెప్టంబర్ 10న తనను అరెస్టు చేసి 11న రాజమండ్రి జైలుకు రిమాండ్ కు పంపారని, జైల్లోకి తాను ప్రవేశిస్తున్న సమయంలో తనను ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని ఆరోపించారు. తద్వారా తన ప్రతిష్టను మంటగలిపారని, అలాగే తన భద్రతకు ముప్పు కలిగించారని చంద్రబాబు తెలిపారు. అలాగే తనను హతమార్చేందుకు ఓ వామపక్ష తీవ్రవాద సంస్ధ కుట్ర పన్నిందని, ఇందుకోసం భారీగా డబ్బు కూడా చేతులు మారినట్లు, ఈ మేరకు జైలు సూపరింటెండెంట్ కు ఓ లేఖ కూడా అందినట్లు తనకు తెలిసిందని చంద్రబాబు వెల్లడించారు. దీనిపై పోలీసులు అధికారులు ఇప్పటివరకూ స్పందించలేదని, ఆ లేఖపై ఎలాంటి విచారణ కూడా జరపలేదన్నారు. అలాగే ఎన్డీపీఎస్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఓ వ్యక్తి పెన్ కెమెరాతో జైల్లో సంచరిస్తూ తోటి ఖైదీల ఫొటోలు తీస్తున్నాడనని తనకు తెలిసిందన్నారు. అలాగే రాజమండ్రి జైలుపై ఓ డ్రోన్ కెమెరా సంచరిస్తూ తమ ఫొటోలు, వీడియోలు తీస్తోందని, అయినా జైలు అధికారులు కానీ, పోలీసులు కానీ దాన్ని అడ్డుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. జైల్లో గంజాయి ప్యాకెట్లు వస్తున్నాయని, అక్కడ మొత్తం 2200 మంది ఖైదీలుంటే అందులో 750 మంది తీవ్ర ఆరోపణలు ఉన్నవారు ఉన్నారని, ఇవన్నీ తన భద్రతకు ముప్పుగా మారాయన్నారు. ఈ నెల ఆరో తేదీన తనను కలిసి వెళ్తున్న కుటుంబ సభ్యుల్ని మరో డ్రోన్ కెమెరా షూట్ చేసిందని, దీన్ని బట్టి చూస్తుంటే తనతో పాటు కుటుంబానికి కూడా ముప్పు ఉందన్నారు. రాష్ట్రంలో గత నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో పలు చోట్ల తిరిగిన తనపై అధికార పార్టీ ప్రోద్భలంలో దాడులు జరిగాయన్నారు. జగన్ అధికారంలోకి రాగానే తన భద్రతను తగ్గించారని, హైకోర్టు జోక్యంతో తిరిగి పునరుద్ధరించారన్నారు. 2019 ఆగస్టులో అమరావతిలో బస్సు యాత్ర చేపడితే వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడులకు పాల్పడ్డారన్నారు. అలాగే ఈ ఏడాది ప్రాజెక్టుల వద్దకు తాను వెళ్లినప్పుడు కూడా వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారన్నారు. ఈ పరిణామాల్ని అన్నింటిని దృష్టిలో ఉంచుకుని రాజమండ్రి జైల్లో తనకు పూర్తిస్దాయిలో భద్రత కల్పించాలని చంద్రబాబు జడ్జిని కోరారు.
Andhra Pradesh News
కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టులో బన్నీ ఉత్సవం ఘనంగా జరిగింది. దసరా పర్వదినాన గ్రామగుట్టపై అర్ధరాత్రి 12 గంటలకు మాళమ్మ, మల్లేశ్వరాస్వామి కల్యాణం కన్నులపండువగా నిర్వహించారు. అనతరం ఉత్సవ విగ్రహాలను ఆలయ పరిసరాల్లో ఊరేగించారు. ఈ విగ్రహాలను దక్కించుకోవడానికి 3 గ్రామాల ప్రజలు ఒక వర్గంగా, 5 గ్రామాల ప్రజలు మరో వర్గంగా ఏర్పడి కర్రలతో తలబడ్డారు. తరతరాలు వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ జరిగిన ఈ కర్రల సమరంలో పెద్దఎత్తున్న ప్రజలు పాల్గొన్నారు. ఓ చేతిలో కర్ర.. మరో చేతిలో దివిటీలు.. మది నిండా భక్తిభావంతో దేవరగట్టు మారుమోగింది. దేవతా మూర్తుల కోసం నెరణికి, కొత్తపేట, నెరణికితండా, బిలేహాల్, ఆలూరు, ఎల్లార్తి, సుళువాయి గ్రామాల మధ్య కర్రల సమరం సాగింది. పలువురు విచక్షణారహితంగా కొట్టుకుకోవడంతో సుమారు 100 మందికిపైగా గాయపడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులకు ఆలూరు ప్రభుత్వ దవాఖానలో చికిత్స అందిస్తున్నారు. కాగా, బన్నీ ఉత్సవంలో ప్రమాదం చోటుచేసుకున్నది. కర్రల సమరాన్ని చూసేందుకు కొందరు సమీపంలోని చెట్టుపైకి ఎక్కారు. ప్రమాదవశాత్తూ అది విరిగిపడటంతో గణేశ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మరికొదరు గాయపడ్డారు.
విజయదశమి రోజు తాము సమావేశం కావడం ఏపీకి మేలు చేస్తుందని నారా లోకేశ్ అన్నారు. ఈ రెండు పార్టీలు కలిసి వెళ్లాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నామన్నారు. వైసీపీ పాలనలో బీసీ వర్గాలను వేధిస్తున్నారని ఆరోపించారు. బీసీలకు వాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారని విమర్శించారు. ఎస్సీలకు రావాల్సిన 26 సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారన్న లోకేష్… వైసీపీ నేతల వేధింపులతో ముస్లింలు ఆత్మహత్య చేసుకున్నారని దుయ్యబట్టారు. ఉద్యోగాలు లేక యువత పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారని లోకేశ్ అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని పలురకాలుగా వేధిస్తున్నారని మండిపడ్డారు
తిరుపతి బహిరంగసభ ( Public Meeting ) :
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) తిరుపతి చేరుకున్నారు. ఆమె నేడు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం తమ స్వగ్రామం నారావారిపల్లెకు వెళ్లనున్నారు. నారావారిపల్లెలో తమ కులదేవతకు పూజలు చేయనున్నారు. నారా భువనేశ్వరి రేపటి నుంచి ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తారు..
Follow us on : Facebook, Instagram & YouTube.
చంద్రబాబు అరెస్ట్ వార్త విని ఆవేదనతో చనిపోయిన వారి కుటుంబాలను ఆమె పరామర్శిస్తారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. ఇక, రేపు నారావారిపల్లి నుంచి నిజం గెలవాలి బస్సు యాత్ర స్టార్ట్ కానుంది. ఐతేపల్లి మండలంలోని ఎస్సీ కాలనీలో పల్లె ప్రజలతో నారా భువనేశ్వరి సహపంక్తి భోజనం చేయనున్నారు. చంద్రగిరి మండలంలోని అగరాల బహిరంగసభలో చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఆమె మాట్లాడనున్నారు. అనంతరం తిరుపతిలోను భువనేశ్వరి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు అక్రమ అరెస్టుపై నిరసన వ్యక్తం చేస్తున్న జనసేన-టీడీపీ కార్యకర్తలపై పెట్టిన కేసులకు సంబంధించి ఈనెల 26న తిరుపతిలో వారిని పరామర్శించనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై తిరుపతిలో జరిగే బహిరంగసభలోను ఆమె ప్రసంగిస్తారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 194054