జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కామెంట్స్గత సంవత్సరం నవంబర్ 2 వ తరికున పత్రిక సమావేశం ఏర్పాటు చేసి చెప్పాము మహిళ సాధికారత కోసం ఈ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది అని చెప్పింది అది మోసం అని ఆనాడే చెప్పడం జరిగింది. జగనన్న పాల వెల్లువ కార్యక్రమంలో పెద్ద మోసం జరిగింది ఆనాడే చెప్పాము అది జగనన్న పాల వెల్లువ కాదు పాపాల వెల్లువ అని 2,955 కోట్లు కోట్లు ఈ కార్యక్రమానికి ఖర్చు చేశామని చెప్తున్నారు ఎన్ని పశువులు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. 8 వేలు మాత్రమే మీరు కొనుగోలు చేసింది ఈ స్కీం అంత సెర్ఫ్ ద్వారానే అమలు అవుతుంది ఇప్పటి వరకు ఏ బ్యాంక్ ఎంత అప్పు ఇచ్చింది అంటే లెక్కలు చూపించరు 15 లక్ష ల 76 వేలు లీటర్ల పాలు రావాలి మీరు కొనుగోలు చేసిన పాడి పశువులు ప్రకారం ఐతే 2 లక్షల లీటర్ లు వచ్చినవి అని ప్రభుత్వం చెబుత్వం సరైన లబ్దిదారులు లేకుండా బ్యాంకులు ఏ విధం గా రుణాలు ఇచ్చాయి దీనిపై బ్యాంక్ కూడా ఋణాలు ఇచ్చారు. కాబట్టి సీబీఐ ఏంక్విరీ వెయ్యాలి జనసేన పార్టీ ఛాలెంజ్ చేస్తుంది ఏ జిల్లా ఐనా మంత్రి గారినే ఎంపిక చెయ్యమనండి వారి తో మేము వస్తాం ఎన్ని పశువులు ఉన్నాయో చూపించండి నవంబర్ 14 తరువాత ఏ శాఖ లో ఎంత అవినీతి జరిగింది ప్రతి ఒక్కరికి వివరించే విధంగా రోజుకు ఒక స్కామ్ గురించి చెపుతాము. 2216 కోట్లు బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్నారు లబ్ధిదారులను ఏ ప్రతిపాదికన ఎంపిక చేసారు. 737 కోట్లు సబ్సిడీ అన్నారు ఎంత మందికి సబ్సిడీ ఇచ్చారు. ప్రభుత్వమే ఒప్పుకుంది పశువుల రీసైక్లింగ్ చేసాము అని స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ లో ఇంత పెద్ద స్కామ్ జరిగింది ఈ ప్రోగ్రాం లో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ప్రజా సమస్యల పై మాట్లాడతారు
Andhra Pradesh News
వైద్యం కోసం మధ్యంతర బెయిల్ తీసుకుని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు. ఇదే పనిలో ఉన్నారని దుయ్యబట్టారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. రాజకీయ కార్యకలాపాలను చక్కబెట్టే పనిలో చంద్రబాబు బిజీగా ఉన్నారంటూ విమర్శించింది. వైద్యం కోసం మధ్యంతర బెయిల్ తీసుకుని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు… ఇదే పనిలో ఉన్నారని దుయ్యబట్టింది.జైల్లో చంద్రబాబు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ టీడీపీ అండ్ కో పెద్ద కలరింగ్ ఇచ్చిందని తెలిపింది. రాజమండ్రి నుంచి ఉండవల్లిలోని నివాసానికి 14 గంటలు కారులో ప్రయాణించిన బాబు… హైదరాబాద్ లో జనసేనాని పవన్ కల్యాణ్ తో దాదాపు 2 నుంచి 3 గంటల సేపు రాజకీయ చర్చలు జరిపారని విమర్శించింది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఇవన్నీ చేయగలరా? అని ప్రశ్నించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించింది.చంద్రబాబు బెయిల్ తీసుకుంది వైద్యం కోసమా? లేక రాజకీయాలు చేసేందుకా? అని వైసీపీ ప్రశ్నించింది. బెయిల్ కోసం చెప్పిన ఆరోగ్య సమస్యలు ఇప్పుడు నయమైపోయాయా? అని ఎద్దేవా చేసింది. వైద్యం కోసమే అయితే జైలు నుంచి విడుదల రోజున రాజకీయ ర్యాలీలు ఎందుకని ప్రశ్నించింది. హైదరాబాద్ లో రాజకీయ మంతనాల కోసమే బెయిల్ తీసుకున్నారా? అని నిలదీసింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఏపీ మంత్రి అంబటి రాంబాబు క్రమం తప్పకుండా టార్గెట్ చేస్తున్నారు. తాజాగా జనసేన పొత్తులకు సంబంధించి ఆయన సెటైర్లు వేశారు. ఏపీలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న పవన్ కల్యాణ్, తెలంగాణలో బీజేపీతో చేతులు కలిపారని విమర్శించారు. విలువలు లేని మీకే ఇది సాధ్యమని ఎద్దేవా చేశారు.
తెలంగాణలో 11 స్థానాల్లో పోటీ చేయాలని జనసేన భావించినప్పటికీ… 8 స్థానాలను ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించింది. అయితే, హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి స్థానం కూడా కావాలని జనసేన పట్టుబడుతోంది. బీజేపీలో సైతం ఈ స్థానంపై తీవ్ర పోటీ నెలకొంది. ప్రస్తుతం చంద్రబాబు హైదరాబాద్ లోని తన నివాసంలో ఉంటూ వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ ఆయనను పరామర్శించారు. ఆయన వెంట పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు.
విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బ్రేకులు ఫెయిల్ కావడంతో ఓ బస్సు ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. దీంతో పది నెలల చిన్నారి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బస్టాండ్ లోని పన్నెండో నెంబర్ ప్లాట్ ఫాంపై బస్సు కోసం ఎదురుచూస్తున్న ఓ మహిళ, చిన్నారితో పాటు గుంటూరు 2 డిపోకు చెందిన కండక్టర్ వీరయ్య చనిపోయారు. మరికొందరు ప్రయాణికులకు గాయాలయినట్లు సమాచారం.
విజయవాడలోని ఆటోనగర్ డిపోకు చెందిన బస్సు గుంటూరుకు వెళ్లాల్సి ఉండగా.. ఫ్లాట్ ఫాంపైకి తీసుకువచ్చే క్రమంలో బ్రేకులు ఫెయిలయ్యాయి. రివర్స్ గేర్ బదులుగా డ్రైవర్ ఫస్ట్ గేర్ వేయడంతో బస్సు ప్లాట్ ఫాంపై ఎదురుచూస్తున్న ప్రయాణికులపైకి వెళ్లింది. దీంతో బస్సు చక్రాల కింద నలిగి ముగ్గురు చనిపోయారని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ వెల్లడించారు. కాగా, ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడని, కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం గార్లదిన్నె గ్రామంలో కరువు ప్రాంతం పర్యటనకు వచ్చిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వ్యవసాయ స్టీరింగ్ కమిటీ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు,జ్యోతి నెహ్రూ,మా రెడ్డి శ్రీనివాసరెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, కూన రవికుమార్, డోన్ టిడిపి అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి, టిడిపి జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్. పలు పొలాలలో కరువుల గురించి రైతులతో అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ వర్షములు సమయానికి పడలేదు రైతు చాలా ఇబ్బందుల పాలవుతున్నాడని రైతులు వాళ్లతో వారి బాధల గురించి చెప్పుకున్నారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో మైనింగ్, విజిలెన్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. సరైన పత్రాలు లేకుండా పల్స్ పర్, క్వాడ్జ్ లాంటి ఖనిజ సంపదను తరలిస్తున్న 16 లారీలు సీజ్ చేశారు. 16వ నెంబర్ జాతీయ రహదారిపై సీజ్ చేసిన లారీలను చిలుకూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకొని.. పట్టుబడిన లారీల పత్రాలను పోలీస్ స్టేషన్లో తనిఖీ చేస్తున్నారు అధికారులు.
కోర్టు నిబంధనల మేరకు రాజమహేంద్రవరం నుంచి విజయవాడ వరకూ చంద్రబాబు కాన్వాయ్ సాగిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. బాబుకు మద్దతుగా ప్రజలు ర్యాలీలు చేస్తే ప్రభుత్వ సలహాదారు రామకృష్ణా రెడ్డి, వైసీపీ నేతలకు వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. ప్రజలు ఛీకొడుతున్నా వైసీపీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. రాజమహేంద్రవరం నుంచి విజయవాడ రావటానికి చంద్రబాబుకు 16 గంటల సమయం పట్టింది. కోర్టు నిబంధనలు లేకపోతే ఇప్పుడు వచ్చినదానికంటే నాలుగు రెట్లు అధికంగా జనం వచ్చేవారు. చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘించకుండా కారులోనే ఉండి ప్రజలకు, కార్యకర్తలకు అభివాదం చేశారు. లోకేశ్ ఢిల్లీ వెళితే వైసీపీ వాళ్లకెందుకు ఉలికిపాటు. అక్రమ కేసులో చంద్రబాబును 52 రోజులు నిర్బంధించారు. ఆయన అవినీతికి పాల్పడ్డట్టు ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీ అవకతవకలు జరిగాయంటూర మరో కొత్త కేసు పెట్టారు. వైసీపీ వాళ్లు ఎన్ని కుట్రలు చేసినా టీడీపీని ఏమీ చేయలేరు’’ అని పేర్కొన్నారు.
ఆంద్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు విశాఖలోని రుషికొండ చుట్టూ తిరుగుతున్నాయి. జగన్ ప్రభుత్వం విశాఖని పరిపాలనా రాజధానిగా ప్రకటించినప్పటినుంచి రుషికొండ వివాదాలకొండగా మారిపోయింది. ప్రభుత్వం రుషికొండ చుట్టూ అక్రమ తవ్వకాలు చేపడుతుందని విపక్షాలు హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై అప్పట్లో విచారణ చేపట్టిన న్యాయస్థానం పరిశీలన కోసంఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ రుషికొండపై జరుగుతున్న నిర్మాణాలపై ఓ నివేదిక ఇచ్చింది. అనుమతికి మించి నిర్మాణాలు ఉన్నాయని ఆ కమిటీ పేర్కొంది. అయితే, సీఎం జగన్ తాను విశాఖకు మకాం మార్చుతున్నానంటూ, ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం ప్రత్యేక కమిటీ వేశారు. రుషికొండపై నూతనంగా చేపట్టిన నిర్మాణం బాగుందంటూ ఈ కమిటీ నివేదిక ఇచ్చేందుకు సన్నద్ధమైంది. దాంతో, రుషికొండ ఉల్లంఘనలపై మొదట్లో పిటిషన్లు వేసిన వారు హైకోర్టులో మరో పిటిషన్ వేశారు. తాజాగా, రుషికొండ నిర్మాణాలపై మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. తాము నియమించిన కమిటీ ఇచ్చిన నివేదికపై మరోసారి విచారణ చేపట్టాలని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శిని ఆదేశించింది. రుషికొండపై ఉన్న నిర్మాణాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అంతేకాదు, దీనిపై మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో తదుపరి విచారణను నవంబరు 28కి వాయిదా వేసింది. రుషికొండపై 9.88 ఎకరాలకు అనుమతి ఇస్తే, 20 ఎకరాల్లో తవ్వకాలు చేపట్టారని అప్పట్లో పిటిషన్లు వేశారు. విచారణ సందర్భంగా అనుమతికి మించి 3 ఎకరాలు ఎక్కువ తవ్వకాలు చేపట్టినట్టు ప్రభుత్వం అంగీకరించింది. అయితే, అంతకంటే ఎక్కువే తవ్వకాలు చేపట్టారని పిటిషనర్ ఆరోపించడంతో, కేంద్ర ప్రభుత్వం సర్వే చేపట్టింది. ఇప్పుడు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో, రుషికొండలో కేంద్రం మరోసారి సర్వే చేపట్టే అవకాశాలున్నాయి.
రైలు ప్రమాదం సహాయక చర్యలను మంత్రి బొత్స సత్యనారాయణ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అటు విశాఖ నుంచి రైల్వే రిలీఫ్ వ్యాన్ చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. బోగీలలో కొందరు ప్రయాణీకులు చిక్కుకుపోవడంతో వారిని బయటకు తీసేందుకు సహాయక సిబ్బంది శ్రమిస్తున్నారు. బాధితుల సహాయం కోసం విజయనగరం జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ తెలిపారు. బాధితులు 9493589157 నెంబర్ను ఫోన్ చేసి సహాయం పొందవచ్చని ఆమె మీడియాకు వెల్లడించారు. అలాగే రైల్వే ఫోన్ నెంబర్ 8978080006 నెంబర్కు ఫోన్ చేసి సమాచారం పొందవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నియామకాలు, పదోన్నతుల్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఏపీపీఎస్సీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ ఆర్డర్ నెం.77 మేరకు ఈ రిజర్వేషన్ను అమలు చేయనున్నట్టు పేర్కొంది. ప్రభుత్వ ప్రకటన ప్రకారం, చెవిటివారు, అంధులు, మెదడు పక్షవాతం, కుష్టు, మరుగుజ్జు, యాసిడ్ దాడి బాధితులు, కండరాల బలహీనత, ఆటిజం, మానసిక రోగాల వారు దివ్యాంగుల జాబితాలో చేర్చారు. అయితే, ఉద్యోగానికి సంబంధించి ఇతర నిబంధనలకు లోబడే రిజర్వేషన్ ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇతర ఉద్యోగార్హతలతో పాటుగా 100 శాతం దివ్యాంగులై ఉండాలని పేర్కొంది. దివ్యాంగుల కమిషన్ వెబ్సైట్లో లబ్ధిదారులు తమ పేరు రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది.





Total views : 196457