ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాశీనాథ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రధానంగా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా పాదయాత్ర చేపడుతున్నట్లు తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం, మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయడం ఎజెండాగా పాదయాత్ర చేపడుతున్నట్లు తెలియజేశారు. ఈ నెల 28వ తేదీ నుండి పాదయాత్ర మొదలుపెట్టి నియోజకవర్గంలోని ప్రజలకు వెలుగొండ ప్రాజెక్టు ప్రాధాన్యత మరియు మార్కాపురం జిల్లా ఆవశ్యకత గురించి వివరిస్తూ ముందుకెళ్లడం జరుగుతుందన్నారు. ఈ పాదయాత్రలో కలిసి వచ్చే పార్టీలను అన్నింటిని కలుపుకొని ప్రజల్లోకి వెళ్లడం జరుగుతుందన్నారు. పాదయాత్ర రూట్ మ్యాప్ త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
andhra pradesh
అన్నమయ్య జిల్లా పీలేరు లో జరగబోయే చంద్రబాబు నాయుడు బహిరంగ సభకు త్వరగతిన పనులు పూర్తిచేయాలని ఆపార్టీ నాయకులతో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గ బాధ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయన పీలేరు పట్టణ పరిసరాల్లో జరిగే రా కదలిరా చంద్రబాబు బహిరంగ సభ ప్రాంగణం, హెలిఫ్యాడ్ స్థల పరిశీలన, వాహనాల కోసం పార్కింగ్, బహిరంగ సభా స్థలం పరిశీలించారు. నియోజకవర్గాల వారీగా వచ్చే వాహనాలు, నాయకులు, ప్రజలు, అభిమానులకు అసౌకర్యం కలగకుండా చూడాలని అన్నారు.
దొంగ ఓట్లతో గెలుపొందిన తిరుపతి వైకాపా ఎంపీ గురుమూర్తిపై కేంద్ర ఎన్నికల సంఘం అనర్హత వేటు వేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా చోటు చేసుకున్న అక్రమాల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఆలస్యంగానైనా కఠిన చర్యలు తీసుకోవడం స్వాగతిస్తున్నామన్నారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషా ఇతర కిందిస్థాయి అధికారులను సస్పెండ్ చేయడం ఇతర అధికారులకు హెచ్చరిక లాంటిదని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ దొంగ ఓటర్ కార్డులు సృష్టించి తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటు వేయడం జగన్ ఆటవిక పాలనకు నిదర్శనమన్నారు. దొంగ ఎపిక్ కార్డులు తయారు చేయడంలో భాగస్వామ్యులైన మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్, ఇతర వైకాపా ఎమ్మెల్యేలు భవిష్యత్ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎలక్షన్ కమిషన్ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీవారి భక్తుల ముసుగులో దొంగ ఓట్లు వేయడానికి వేలాది మందిని వాహనాల్లో తరలించి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేశారని పేర్కొన్నారు. తాము మొదటి నుంచి ఆరోపిస్తున్నా ఎలక్షన్ కమిషన్ ఎట్టకేలకు స్పందించి కఠిన చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. ఒకప్పుడు నిజాయితీ ఐఏఎస్ అధికారిగా పేరు తెచ్చుకున్న గిరీషా అధికార పార్టీ నేతల వత్తిల్లకు తలొగ్గడం వల్లే సస్పెండ్ అయ్యారని పేర్కొన్నారు. ఇప్పటికైనా జగన్ భజన చేస్తున్న పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను తూచా తప్పక పాటించి ఎన్నికలను నిస్వార్ధంగా జరిపించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, తమ పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో టిడిపి రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడు మల్లారపు రవి ప్రకాష్ నాయుడు ఇతర నేతలు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా, పామర్రు నియోజకవర్గం తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి మాట్లాడుతూ నాకు తిరువూరు సీటు ఇవ్వకపోవడం పట్ల నా మనసు గాయపడింది. ఒక ఎంపీ చెప్పిన మాట విని, ఒక ప్రణాళిక ప్రకారం, రెండుసార్లు గెలుపొందిన నాకు సీట్ లేకుండా చేశారు. నా నిర్ణయం రెండు రోజుల్లో ప్రకటిస్తా. నేను పోటీ చేయడం ఖాయం. ఎక్కడి నుంచి చేస్తాను అన్నది త్వరలో తెలియపరుస్తా. నేను ఈ పది సంవత్సరాల రాజకీయ చరిత్రలో చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ పవన్ కళ్యాణ్ ను కానీ దూషించిన సందర్భాలు లేవు. అది కూడా ఒక కారణం కావచ్చు అని నేను భావిస్తున్నాను. వారి ప్రణాళికలు ముందుగానే పసిగట్టి 20 రోజుల నుంచి నేను నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నాను.
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ కోడి కత్తి శ్రీను ను వెంటనే జైలు నుంచి విడుదల చేయాలంటూ టిడిపి ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఒకరోజు ఆమరణ నిరాహార దీక్ష. దీని పై టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ఎస్సీ అయిన దళిత బిడ్డ కోడి కత్తి శ్రీను ను జైల్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి పైసాచిక ఆనందం పొందుతున్నారు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్ల కాలంలో దళితులపై అనేక రకాల దాడులు చేసిన ప్రభుత్వ ఏదైనా ఉందంటే వైసీపీ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి కోర్టుకు సాక్ష్యం చెప్పడానికి వచ్చే సమయం కూడా కేటాయించక పోవడంతో న్యాయస్థానం కూడా ఆలోచన చేయాలి. కోడి కత్తి శ్రీనును జైలు నుంచి విడుదల చేసేంతవరకు మా పోరాటం కొనసాగిస్తాం. ఒక దళిత బిడ్డను ఐదు సంవత్సరాల నుంచి జైల్లో పెట్టడం పూర్తిగా ప్రభుత్వ కుట్ర పూరిత చర్య. న్యాయం కోసం కోడి కత్తి శీను, తల్లి సోదరుడు నిరవదిక దీక్ష చేయడంపై తెలుగుదేశం పార్టీగా మా మద్దతు తెలియజేశాం. జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్దకు తాడేపల్లి ప్యాలెస్ వద్దకు తన బాధను విన్నవించుకుందాం అని వెళ్తే లేడీ కానిస్టేబుల్ తో దుర్భాషలాడి బయటకు గెంటివేశారని విమర్శించారు. ఈరోజు అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణకు వస్తున్న జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ పేరు ఎత్తే అర్హత కూడా జగన్మోహన్ రెడ్డి కి లేదని తెలిపారు.
విజయవాడ బందర్ రోడ్డులో ఏర్పాటు చేసిన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. అంబేద్కర్ విగ్రహ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సుమారు 4000 మంది పైగా పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ చేయనున్నారు.
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం, కనులపండుగగా ఈ నెల 22న స్వామి వారి శాంతి కళ్యాణం. భారీ గా తరలి రానున్న భక్తులు. ఈ నెల 22న అయోధ్య రామప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో,అదే తరహాలో కోడూరు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కనులపండుగగా జరగనున్నాయి. విశ్వహిందూ పరిషత్, పాంచజన్యగీతాపారాయణ సత్సంగమ్ భక్తులు ఆధ్వర్యంలో శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. వందలాది మంది భక్తులు గీతాపారాయణం, సహస్రనామ పారాయణం గీతా పారాయణం అనంతరం కోడూరు గ్రామంలోని వేంచేసియున్న శ్రీ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నుండిశ్రీ సీతారాములశాంతి కళ్యాణ పాంగణం వరకు శ్రీ రామ శోభాయాత్ర జరగనున్నది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు తిలకించడానికి సుధీర ప్రాంతాల నుంచి సుమారు 20వేల మంది పైగా హిందూ భక్తులు పాల్గొంటారని తెలిపారు. అనంతరం భక్తులకు మహా అన్న సమారాధన ఏర్పాటు చేశామని నిర్వాహలు తెలిపారు.
విజయవాడ, ఆవిష్కరణకు సిద్ధమైన భారీ అంబేద్కర్ విగ్రహం. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ గా నామకరణ. స్వరాజ్య మైదానం లో 20 ఎకరాల్లో భారీ స్మృతివనం. ఎల్లుండి జగన్ చేతుల మీదగా ప్రారంభం. విగ్రహ ఎత్తు 125 అడుగులు , బేస్ పిల్లర్( బేస్ బిల్డింగ్ ) ఎత్తు 80 అడుగులతో కలిపి 205 అడుగుల అతి భారీ విగ్రహంగా రికార్డుకెక్కనున్న అంబేద్కర్ స్టాట్యూ. 2020 జులై 9 న విగ్రహ ఏర్పాటుకు శంకుస్దాపన. డిల్లి నుండి వచ్చిన డిజైనర్లతో సాంకేతిక పరిజ్ఞానంతో వేగంగా రూపుదిద్దుకున్న అంబేద్కర్ విగ్రహం. విగ్రహం క్రింద భాగంలో మూడు ఫ్లోర్లు ఏర్పాటు. ఒక్కో ఫ్లోర్ లో ఒక్కో భారీ హాల్స్ ఏర్పాటు. గ్రౌండ్ ఫ్లోర్ లో నాలుగు హాళ్లు నిర్మాణం. డిజిటల్ లైబ్రరీ, స్క్రీన్ హాల్ , మ్యూజియం ఏర్పాటు. స్కై లైటింగ్, ఫౌంటెన్ , గార్డెన్ తో ప్రత్యేక ఆకర్షణగా విగ్రహం. 404 కోట్ల భారీ వ్యయంతో నిర్మాణం. ఎల్లుండి సాయంత్రం 4 గంటలకు సీయం జగన్ చేతుల మీదగా విగ్రహావిష్కరణ. అనంతరం స్టేడియంలో భారీ బహిరంగ సభ. ఇప్పటికే విగ్రహావిష్కరణకు, సభకు భారిగా ఏర్పాట్లు చేసిన అధికారులు. లక్షన్నర మంది వీక్షించేలా ఏర్పాట్లు.
తెలుగుదేశం పార్టీ రా కదలిరా కార్యక్రమంలో భాగంగా నేడు వెంకటగిరి పట్టణానికి రానున్న టిడిపి అధినేత చంద్రబాబు. ఈ ఉదయం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా విజయవాడ నుంచి వెంకటగిరి కి రానున్న బాబు. చంద్రబాబు బహిరంగ సభకు సర్వం సిద్ధం చేసిన ఆ పార్టీ శ్రేణులు. తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి భారీగా తరలిరానున్న, టిడిపి, జనసేన పార్టీ శ్రేణులు.
పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం పట్టణంలోని బాగు జయరామ్ అనే వ్యక్తి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ వారి ఆక్షన్ లో ఎర్ర గోపు వెంకట సుశీల ఆస్తిని ఆగస్టు నెలలో ఆక్షన్ లో కొనగా బ్యాంకు వారు నవంబర్లో రిజిస్ట్రేషన్ చేశారు. రెండు నెలలుగా ఖాళీ చేయకపోవడంతో గురువారం ఉదయం పోలీసు వారు బ్యాంకు వారు సహకారంతో జయరామ్ స్వాధీనం చేసుకున్నారు. ఈ తరుణంలో సాయంత్రం ప్రహరీ గోడను ప్రోక్లైనర్ తో తొలగిస్తుండగా సుశీల భర్త బకెట్లతో పెట్రోల్ తీసుకొచ్చి జెసిబి పైన, వచ్చిన వారిపైన వెదజల్లగా భయానికి లోనై జయరాం అతని మిత్రులు పారిపోగా జెసిబి డ్రైవర్ పై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. దీంతో జెసిబి డ్రైవర్ కేకలు పెడుతూ రోడ్డు మీద పరుగులు పెడుతుండగా గమనించి మంటలు ఆర్పి హాస్పిటల్ కి తరలించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది అని బంధువులు తెలిపారు. సుశీల భర్తను వన్ టౌన్ పోలీసులు అదుపులో తీసుకొని స్టేషన్ కి తరలించారు.