కుప్పంలో అంగన్వాడి వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కుప్పం ఐసిడిఏస్ కార్యాలయం వద్ద నుండి పట్టణంలోని ఎమ్మెల్సీ భరత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీ భరత్ పీఏ కు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ, అంగన్వాడి వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని గత 15 రోజులుగా సమ్మె చేపడుతున్న ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని వారు పేర్కొన్నారు. అంగన్వాడిలకు కనీస వేతనం అమలు చేసి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు కోరారు.అంగన్వాడిల సమస్యలను పరిష్కరించేంతవరకు సమ్మె కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు. ఇప్పటికీ 4 సార్లు ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్ యూనియన్లతో చర్చించినా అంగన్వాడిల డిమాండ్లను పరిష్కరించలేదన్నారు.
anganwadis protest
గత తొమ్మిది రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలని నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీలను ప్రభుత్వం పట్టించుకోకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, సమ్మె పైన దుష్ప్రచారం చేయడాన్ని నిరసిస్తూ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పై ఏపీ అంగన్వాడి వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో ఉలవపాడు ఐసిడిఎస్ ఆఫీస్ వద్ద లింగసముద్రం, ఉలవపాడు, గుడ్లూరు మండలాలకు చెందిన అంగనవాడి వర్కర్లు, హెల్పర్లు సుమారు 250 మంది ఈరోజు నిరసన తెలుపుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని నిరసించారు. అంగన్వాడీలు నిరవధిక సమ్మె తొమ్మిది రోజుల నుండి చేస్తున్న పట్టించుకోకపోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. అంగన్వాడీ కార్యకర్తలను ఉద్దేశించి సిఐటియు జిల్లా నాయకులు జీవిబి కుమార్, వాకా. లతా రెడ్డి, ప్రభావతి తదితరులు మాట్లాడారు. సమ్మెపై ప్రభుత్వం దుష్ప్రచారం చేయటాన్ని ఖండించారు. ప్రభుత్వం అనాగరికంగా అంగన్వాడి సెంటర్ల తాళాలు పగల గొట్టటం సిగ్గుచేటు అన్నారు. మహిళలకు అన్యాయం చేసిన ఏ ప్రభుత్వానికైనా తగిన శాస్తి జరుగుతుందన్నారు. ఇప్పటికైనా పట్టుదలకు పోకుండా, ప్రభుత్వం దిగివచ్చి అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయాలని కోరారు. అనంతరం ఉలవపాడు మండల కేంద్రంలో అంగన్వాడి సమ్మెకు మద్దతు ఇవ్వమని అంగన్వాడీల భిక్షాటన,ధర్నా. అనంతరం ఉలవపాడు మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ బొమ్మ సెంటర్ లో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఉలవపాడు మండల అధ్యక్షురాలు వాకాలాతారెడ్డి. ఉలవపాడు ప్రాజెక్టు లీడర్ సిహెచ్ ఇందిరావతి, అన్ని మండలాల నాయకులు ఎస్ కే పద్మజ, బీ మార్తమ్మ,కత్తి. బుజ్జమ్మ,మంచాలి సిహెచ్ పద్మజ, ఎం పద్మ, సిహెచ్ రమాదేవి, కాకర్లపూడి శైలజ, డి వరలక్ష్మి, డి రమాదేవి, సురేఖ, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే ద్వేషాన్ని ప్రదర్శిస్తున్నాయని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఆ పార్టీల బోగస్ మాటలు విని రాష్ట్ర ప్రజలు ఆగం కావొద్దని చెప్పారు. తెలంగాణపై వివక్ష చూపడంలో కాంగ్రెస్ ఏ1, బీజేపీ ఏ2 అని అన్నారు. మనం వెనుకబడటానికి కారణం కూడా ఈ రెండు పార్టీలేనని చెప్పారు. రానున్న ఎన్నికల్లో కేసీఆర్ ను గద్దె దించాలనే కుట్రలు జరుగుతున్నాయని, బీఆర్ఎస్ ప్రభుత్వంపై అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కర్ణాటకలో కరెంట్ కూడా ఇవ్వలేని స్థితిలో అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందనే విషయాన్ని ప్రజలు గుర్తించాని చెప్పారు. తెలంగాణలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరుగుతోందని అన్నారు.
రాజకీయ లబ్ధి కోసం అంగన్ వాడీ కార్యకర్తలను విపక్షాలు రెచ్చగొడుతున్నాయని హరీశ్ మండిపడ్డారు. బీజేపీ లేదా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లేని విధంగా అంగన్ వాడీలకు కేసీఆర్ ప్రభుత్వం ఎక్కువ వేతనాలను చెల్లిస్తోందని చెప్పారు. త్వరలోనే పే రివిజన్ కమిషన్ ఏర్పాటు చేసి… ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అంగన్ వాడీ, ఆశా వర్కర్ల జీతాలను పెంచుతామని హామీ ఇచ్చారు. తెలంగాణపై వివక్ష చూపుతున్న ప్రధాని మోదీ ఇక్కడకు ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణకు కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు.




Total views : 79127