ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ ఏపీ కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం నింపుతున్న వైయస్ షర్మిల చేరిక. రాష్ట్ర కాంగ్రెస్ లో దశాబ్దం తర్వాత కనబడుతున్న నూతన ఉత్సాహం. కానూరు వద్ద ఏపీ పీసీసీ అధ్యక్షరాలిగా చేపట్టనున్న బాధ్యతలు, ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణుల భారీ ఏర్పాట్లు. గన్నవరం నుండి విజయవాడ వరకు ఎటు చూసినా షర్మిల ఫ్లెక్సీలు. షర్మిల రాక రెండు గంటలు ఆలస్యం అయిన కానూరు సభాస్థలి వద్ద కార్యకర్తల్లో తగ్గని ఉత్సాహం.
ap congress
ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అప్పగించడంపై వైఎస్ షర్మిల స్పందించారు. తనపై నమ్మకం ఉంచిన ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానంటూ ట్వీట్ చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం అందించేలా పూర్తి నిబద్ధతతో, చిత్తశుద్ధితో, విధేయతతో పనిచేస్తానని హామీ ఇస్తున్నానన్నారు. ఈ సందర్భంగా తాను మాణిక్యం ఠాగూర్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు. ప్రతి ఒక్క కాంగ్రెస్ సైనికుడితో కలిసి చేయి చేయి కలిపి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాని తెలిపారు. అంతేకాదు, మాజీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు గారు, రాష్ట్రంలోని ఇతర కాంగ్రెస్ నేతలందరి మద్దతును తాను కోరుకుంటున్నానని… వారందరి సహకారంతో నిర్దేశిత లక్ష్యాలను అందుకునేలా పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానంటూ షర్మిల ట్వీట్ చేశారు. ఏపి పీసీసీ అధ్యక్షురాలిగా నియమితులైన వైఎస్ షర్మిలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీసీసీ అధ్యక్షురాలిగా నియమితులైన షర్మిల కు శుభాకాంక్షలు.. ఆల్ ది వెరీ బెస్ట్’ అంటూ ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది. షర్మిల నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని అధిష్టానం ప్రకటించింది. నిన్న సోమవారం ఏపీ పీసీసీ గిడుగు రుద్రరాజు రాజీనామా చేసిన 24 గంటల్లోనే షర్మిలను నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. కాంగ్రెస్లో చేరిన 15 రోజుల్లోనే ఏపీకాంగ్రెస్ పగ్గాలు షర్మిలకు దక్కాయి. తండ్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి రెండుసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన కూతురు వైఎస్ షర్మిలకు అవకాశం రావడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు, మూడు నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా షర్మిల ప్రభావం అధికార, విపక్ష పార్టీలపై పడే అవకాశముందని భావిస్తున్నారు.
సోనియాగాంధీని గతంలో రేవంత్ రెడ్డి బలిదేవత అన్నారని కేటీఆర్ గుర్తు చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ కుప్పకూలిందని.. తెలంగాణలోనైనా నాలుగు సీట్లు వస్తాయని కాంగ్రెస్ పార్టీ ఆరాటపడుతోందన్నారు.మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో భాగంగా శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రాజకీయ స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్న ఆరోపణలు సరికాదని కేటీఆర్ అన్నారు. రుణాలు తెచ్చి ఉత్పత్తి రంగాల్లో పెట్టుబడులు పెట్టామన్నారు. రుణాల మొత్తాన్ని సాగునీటి రంగం, మిషన్ భగీరథకు వినియోగించామన్నారు. విద్యుత్ రంగంలో సంస్కరణల కోసం రుణాలు తెచ్చామన్నారు. 9 ఏళ్ల క్రితంతో పోలిస్తే తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందన్నారు. తెలంగాణది సమ్మిళిత, సమగ్ర, సమీకృత మోడల్ అన్నారు. 9 ఏళ్లలో కరువు లేదు, కర్ఫ్యూ లేదన్నారు. రాష్ట్రంలో ఎలాంటి వివక్ష లేదన్నారు. పేదరికంలో దేశం నైజీరియాను దాటిపోయింది. కాంగ్రెస్ 6 గ్యారంటీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు యత్నిస్తోందన్నారు. పర్యావరణాన్ని కాపాడుతూనే పారిశ్రామికీకరణలో దూసుకుపోతున్నామన్నారు. కాంగ్రెస్ చేసిన పాపానికి తెలంగాణ 58 ఏళ్లు బాధపడిందన్నారు. 2004 నుంచి 2014 మధ్య కాంగ్రెస్ 24 వేలు ప్రభుత్వ ఉద్యోగాలను మాత్రమే ఇచ్చిందన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు లక్షా 30 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. 9 ఏళ్ల అభివృద్ధి ఇప్పుడు ప్రజలకు కనిపిస్తోందన్నారు. తాము ప్రజలకు ప్రగతి నివేదికలు సమర్పిస్తున్నామన్నారు. ఐటీలో హైదరాబాద్, బెంగళూరును మించిపోయిందన్నారు.



Total views : 78799