జాబిల్లిపై మరోసారి మానవ పాదముద్రలు పడనున్నాయి. అపోలో యాత్రలు ముగిసిన అర్ధ శతాబ్దం అనంతరం మళ్లీ ప్రయత్నాలు మొదలయ్యాయి. మనిషిని తిరిగి చంద్రుడి మీదికి పంపటానికి మార్గం సుగమం చేయగల అర్టెమిస్-2 ప్రయోగానికి అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సంసిద్ధమైంది. ఇందులో నలుగురు వ్యోమగాములు చందమామను చుట్టి రానున్నారు. వీళ్లు చందమామపై కాలు మోపరు గానీ సుదూరం నుంచే జాబిల్లిని చుట్టి వస్తారు. ఈ క్రమంలో రోదసిలో ఇప్పటివరకూ మనుషులెవ్వరూ వెళ్లనంత దూరానికి వెళ్లటం గమనార్హం. ఆ తర్వాత చేపట్టే యాత్రల్లో మానవులు మలిసారి చంద్రుడిపై దిగే ఘట్టం సాకారం కానుంది.
Tag:





Total views : 141532