హైదరాబాద్లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి అంతర్జాతీయ స్థాయిలో తన ప్రత్యేకతను చాటుకుంది. ప్రఖ్యాత స్కైట్రాక్స్ సంస్థ నుంచి ‘బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా, సౌత్ ఏషియా 2026’ అవార్డును గెలుచుకుంది. ఈ విమానాశ్రయానికి ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించడం ఇది ఐదోసారి. లండన్లో జరిగిన ప్యాసింజర్ టెర్మినల్ ఎక్స్పో 2026 కార్యక్రమంలో ఈ అవార్డును అధికారికంగా ప్రకటించారు. ఈ అవార్డుతో పాటు శంషాబాద్ విమానాశ్రయం మరికొన్ని ఘనతలను కూడా సాధించింది. భారత్, దక్షిణాసియాలో ‘రెండో ఉత్తమ ప్రాంతీయ విమానాశ్రయంగా, మూడో ఉత్తమ విమానాశ్రయంగా నిలిచింది.
award
ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అమెరికాలోని లాస్ ఏంజిలిస్లో ఘనంగా జరిగింది.
ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అమెరికాలోని లాస్ ఏంజిలిస్లో ఘనంగా జరిగింది. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ చిత్రం ఏకంగా ఆరు ఆస్కార్ పురస్కారాలను అందుకుంది. బ్లాక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన చిత్రంలో లియోనార్డో డికాప్రియో కీలక పాత్ర పోషించారు. మొత్తం 13 విభాగాల్లో ఈ సినిమా అవార్డులకు నామినేట్ కాగా…. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ప్లే, ఉత్తమ క్యాస్టింగ్, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో ఆరు పురస్కారాలు అందుకుంది. ఆ తర్వాత సిన్నర్స్ చిత్రం కూడా ఈ సారి సత్తా చాటింది. ఈ చిత్రం హీరో మైఖేల్ జోర్డాన్ ఉత్తమ నటుడిగా నిలవగా, ఒరిజినల్ స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో ఈ చిత్రం అవార్డులు గెలుచుకుంది. ఫ్రాంకెన్ స్టెయిన్ చిత్రం మూడు అవార్డులు, కేపాప్ డీమాన్ హంటర్స్ రెండు అవార్డులను సాధించింది.
మరోవైపు ఆస్కార్ అవార్డు ప్రదానోత్సవంలో… గత ఏడాది కన్నుమూసిన ప్రముఖ నటులను స్మరించుకోవడం ప్రత్యేకంగా నిలిచింది. అద్భుతమైన నటనతో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకొన్న నటీనటులకు ఆస్కార్ నివాళులర్పించింది. ఇందులో హాలీవుడ్ ప్రముఖులతో పాటు భారతీయ సినిమా నుంచి ధర్మేంద్ర, మనోజ్ కుమార్, బి.సరోజాదేవి, కోట శ్రీనివాసరావు వంటి దిగ్గజాలు కూడా ఉండడం విశేషం. వీరందరి పేర్లను అకాడమీ తన అధికారిక వెబ్సైట్లో ప్రత్యేకంగా పొందుపరిచింది.
తెలుగు సంస్కృతిని ప్రతిబింబిస్తూ విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ ప్రతీ ఏటా వివిధ రంగాలలో ప్రజ్ఞాపాటవాలు కనబరిచిన వారికి ఉగాది అవార్డులను అనవా యితీగా అందజేస్తూ వస్తోంది. హైదరాబాద్ లో సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ గా పనిచేస్తున్న యు. వినాయకరావు ఫిలిం జర్నలిజంలో చేసిన సేవలకు గుర్తింపుగా విశ్వ గురు ఉగాది అవార్డుకు ఎంపుకయ్యారు. తన సుదీర్ఘమైన కెరీర్ లో చిత్ర పరిశ్రమ వికాసానికి దోహదం చేసే వార్తలను రాయడమే కాదు పలువురు ప్రముఖ నటీనటులపై రచయితగా పలు పుస్తకాలు రాసిన ఆయన లోగడ అనేక అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. ఆదివారం హైదరాబాద్, బేగంపేట టూరిజం ప్లాజాలో నిర్వహించిన ప్రత్యేక వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ హైకోర్టు జడ్జి శ్రీమతి శ్రీసుధ చేతుల మీదుగా వినాయకరావు ఈ ఉగాది అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా వినాయకరావు స్పందిస్తూ, ఇలాంటి అవార్డులు ప్రోత్సహంతో పాటు బాధ్యతలను గుర్తు చేస్తుంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పలు రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.
- మెయిన్ వాపస్ ఆవుంగా’ విజయోత్సవం – ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన ఇమ్తియాజ్ అలీ.
- జులై 31న “అదే నీవు అదే నేను” గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ .
- నాకు, అఖిల్, చైతన్యకి పండగలా ఉంది. బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్లో అక్కినేని నాగార్జున.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కీర్తి కిరీటంలో మరో డైమండ్..
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 223760