బాపట్ల జిల్లాలో రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతికతను చేరువ చేసే లక్ష్యంతో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కిసాన్ మేళా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పాల్గొని వ్యవసాయ యంత్ర పరికరాల ప్రదర్శనను ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో రైతులు హాజరై ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన పొందారు. కిసాన్ మేళాలో వివిధ సంస్థలు ఏర్పాటు చేసిన ఆధునిక వ్యవసాయ యంత్రాలు, పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం రైతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వ్యవసాయంలో యాంత్రీకరణ వల్ల ఖర్చులు తగ్గడంతో పాటు ఉత్పాదకత పెరుగుతుందని నిపుణులు రైతులకు వివరించారు.ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు రైతులకు ఆధునిక సాగు విధానాలు, నూతన సాంకేతికత వినియోగంపై అవగాహన కల్పించారు.వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కొత్త సాంకేతికతను అందిపుచ్చుకుని, యాంత్రీకరణను విస్తృతంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ రైతులకు సూచించారు.
Tag:





Total views : 212200