Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Andhra Pradesh బాపట్లజిల్లాలో ఘనంగా కిసాన్ మేళా.

బాపట్లజిల్లాలో ఘనంగా కిసాన్ మేళా.

by CVR NEWS
బాపట్లజిల్లాలో ఘనంగా కిసాన్ మేళా

బాపట్ల జిల్లాలో రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతికతను చేరువ చేసే లక్ష్యంతో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కిసాన్ మేళా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పాల్గొని వ్యవసాయ యంత్ర పరికరాల ప్రదర్శనను ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో రైతులు హాజరై ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన పొందారు. కిసాన్‌ మేళాలో వివిధ సంస్థలు ఏర్పాటు చేసిన ఆధునిక వ్యవసాయ యంత్రాలు, పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం రైతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వ్యవసాయంలో యాంత్రీకరణ వల్ల ఖర్చులు తగ్గడంతో పాటు ఉత్పాదకత పెరుగుతుందని నిపుణులు రైతులకు వివరించారు.ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు రైతులకు ఆధునిక సాగు విధానాలు, నూతన సాంకేతికత వినియోగంపై అవగాహన కల్పించారు.వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కొత్త సాంకేతికతను అందిపుచ్చుకుని, యాంత్రీకరణను విస్తృతంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ రైతులకు సూచించారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

040829
Total views : 212133

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: