విశాఖలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. కీలక నేతలు, కార్పొరేటర్లు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. వారికి పవన్ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. తనకు ఎంతో ఇష్టమైన విశాఖలో చేరికలు మొదలవ్వడం సంతోషంగా ఉందని అన్నారు. వైసీపీ తనకు వ్యక్తిగతంగా శత్రువు కాదని చెప్పారు. అందరం కలిసిగట్టుగా రాష్ట్ర, పార్టీ అభివృద్ధికి పనిచేయాలని పిలుపునిచ్చారు. త్వరలో విశాఖలో పర్యావరణ ఆడిట్ ఉంటుందని అన్నారు. విశాఖ రియల్ ఎస్టేట్ సమస్యలపై కలిసిగట్టుగా పోరాటం చేస్తామని తెలిపారు. మరోవైపు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం క్యాంప్ రాజకీయాలకు కూడా కూటమి నేతలు సిద్ధమయ్యారు. ఎలాగైనా శాసనమండలిలో బొత్సా అడుగు పెట్టకూడదని పట్టుదలగా వ్యవహరిస్తున్నారు. ఈ తరుణంలో వైసీపీని ఖాళీ చేసేందుకు చేరికలను ఆహ్వానిస్తున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ గాయంతో బాధపడుతున్న ఆయన..భుజాలకు సంబంధించిన చికిత్స చేయించుకోనున్నారు. రెండు భుజాల కండరాలు దెబ్బతినడంతో ఇబ్బంది పడుతున్న పవన్ కల్యాణ్..ముంబై హాస్పిటల్లో ఇప్పటికే వైద్య పరీక్షలు…
- నేడు ఉదయం 10.30 కి ఏపీ కేబినెట్ భేటీ.ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ ఉదయం 10.30 కి వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో అమరావతి రాజధాని ప్రాంత ల్యాండ్ పూలింగ్ రైతులకు సంబంధించి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నట్లు…
- రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ గాయంతో బాధపడుతున్న ఆయన..భుజాలకు సంబంధించిన చికిత్స చేయించుకోనున్నారు. రెండు భుజాల కండరాలు దెబ్బతినడంతో ఇబ్బంది పడుతున్న పవన్ కల్యాణ్..ముంబై హాస్పిటల్లో ఇప్పటికే వైద్య పరీక్షలు…
- హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.అమెరికాలో హెచ్-1బీ, పర్మ్ వర్క్ వీసాల జారీలో జరుగుతున్న అక్రమాలపై ట్రంప్ ప్రభుత్వం భారీ దర్యాప్తు చేపట్టింది. అమెరికా కార్మిక శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి’ఎస్పోసిటో వెల్లడించిన వివరాల ప్రకారం.. వీసా మోసాలపై ఇప్పటికే డజన్ల కొద్దీ సమ్మన్లు, సబ్పోనాలు…
- అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే కేంద్ర కార్యాలయాలు, బ్యాంకులు, హోటల్స్, విద్యా సంస్థలతో రూపుదిద్దుకుంటున్న రాజధాని ప్రాంతానికి ఇప్పుడు హైటెక్ స్కై కనెక్టివిటీ కూడా అందుబాటులోకి రానుంది. ఉండవల్లి సమీపంలో ఆధునిక సదుపాయాలతో హెలిపోర్ట్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 196659