శుక్రవారం పార్లమెంటులో ఎంపీల సస్పెన్షన్ ను నిరసిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇది ఒక చీకటి రోజు అని, పార్లమెంటు భద్రతా వైఫల్యాల చర్చకు తావివ్వకుండా సభ్యులను సస్పెన్షన్ చేసి, అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా బిజెపి ప్రభుత్వం ప్రవర్తిస్తుందన్నారు. పార్లమెంటులోకి చోచ్చుకొని వచ్చిన అగాంతకులు బిజెపి పార్టీకి సంబంధించిన వారేనని విమర్శించారు. ప్రతిపక్షాలన్నీ ఇండియా కూటమిగా ఏర్పడడంతోనే బిజెపి పీఠాలు కదులుతున్నాయని మండిపడ్డారు. సెంటిమెంటును అడ్డుపెట్టుకొని ఎన్నికలకు వచ్చి గెలవడం బిజెపికి ఆనవాయితీగా మారిందని ఎద్దేవా చేశారు. సభ్య సమాజం సిగ్గుపడేలా బిజెపి అనైతిక చర్యలకు పాల్పడుతుందని, సేవ్ డెమోక్రసీ సేవ్ ఇండియా అనే నినాదంతో ఇండియా కూటమి ప్రజల ముందుకు వెళుతుందని, విద్యార్థులు, మేధావులు, కార్మికులు, కర్షకులు ఆలోచించవలసిన అవసరం ఆసన్నమైందన్నారు. భారత రాజ్యాంగానికి విరుద్ధంగా బిజెపి చేస్తున్న చర్యను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందన్నారు. బిఆర్ఎస్, బిజెపి పార్టీలు రెండు ఒకటేనని, బిజెపి చేసిన చర్యను అందుకే బిఆర్ఎస్ ఖండించలేదన్నారు. ప్రజాస్వామ్య హక్కులను, పౌర హక్కులను, భారత రాజ్యాంగాన్ని కాలరాస్తున్న బిఆర్ఎస్, బిజెపి పార్టీలకు రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, మహిళా నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Bjp
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యపై బీజేపీ నేత రఘునందన్ రావు సంచలన కామెంట్స్ చేశారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ప్రచారం చేశారని ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఎన్నికలకు ముందు దుబ్బాక నియోజకవర్గానికి చెందిన వెంకటయ్యను గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా నియమించిందని, అతని భార్య సర్పంచ్‌గా కూడా వ్యవహరిస్తోందన్నారు.
తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయినా సింగరేణిలో ఏడో విడత గుర్తింపు సంఘం ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఎన్నికల వాయిదా వేయాలని ప్రభుత్వం తరఫున వేసిన పిటిషన్ హైకోర్టు కొట్టి వేసింది. దీంతో ఈనెల 27న గుర్తింపు సంఘం ఎన్నికలు యధావిధిగా జరగనున్నాయి. సింగరేణి వ్యాప్తంగా 12 డివిజన్లో ఉన్న 39,784 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ మేరకు సింగరేణి యాజమాన్యం ఎన్నికలకు ఏర్పాట్లు చేనుంది. సింగరేణి వ్యాప్తంగా గుర్తింపు కోసం 14 కార్మిక సంఘాలు బరిలో నిలిచాయి. అధికార కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐ ఎన్ టి యు సి, సిపిఐ అనుబంధ ఎఐటియుసి, బిఅర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం, బిజెపి అనుబంధ బిఎంఎస్ తో పాటు హెచ్ఎంఎస్ సంఘాలతో పాటు విప్లవ సంఘాలు బరిలో నిలిచాయి. అసెంబ్లీ ఎన్నికలలో సింగరేణి వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుపొందడంతో పోటీ రసవత్తరంగా మారనుంది. గత రెండు పర్యాయాలు గుర్తింపు సంఘం గా వ్యవహరించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ను కార్మికులు తిరిగి ఆదరిస్తారా లేక మరో సంఘానికి పట్టం కడతారా వేచి చూడాలి.
కేసీఆర్ సర్కారు తెలంగాణను అప్పుల కుప్పగా మార్చేసిందని బీజేపీ విమర్శించింది. అసెంబ్లీలో ఆర్థిక అంశాలపై చర్చలో మాట్లాడిన ఆ పార్టీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. కనిపించిన చోటల్లా అప్పులు చేశారని దుయ్యబట్టారు. కాళేశ్వరంలాంటి పెద్ద ప్రాజక్టు కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ వద్ద కాకుండా వాణిజ్య బ్యాంకుల్లో అప్పులు తెచ్చారని ఆరోపించారు. ఇలా అయితే ప్రజలపై ఆర్థికభారం పడదా అని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.
పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన గృహాల బిల్లులను త్వరగా ఇవ్వాలని బిజెపి ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బిజెపి ఆధ్వర్యంలో మహాధర్మా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బిజెపి నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు జిఎం శేఖర్, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా ఉందని వైసీపీ ప్రభుత్వం ఏర్పడి నాలుగు సంవత్సరాలు అవుతున్న సంవత్సరానికి ఒక మారు విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారని ఎమ్మెల్యేలు, ఎంపీలు పాలన వదిలేసి అమరావతి తిరుగుతున్నారని ఎమ్మెల్యేల పనితీరు బాగుంటే ప్రజలు వారికే పట్టం కడతారు కదా పాలన బాగాలేదని జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా ఒప్పుకున్నారని తెలిపారు. ఎమ్మెల్యేలకు సీట్లు లేవు, వైసిపి ప్రభుత్వానికి ప్రజల్లో ఓట్లు లేవని ఇక వైసిపి ప్రభుత్వం తుడిచిపెట్టుకుపోతుంది అని రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా విపక్ష పార్టీలు కూటమిగా ఏకమయ్యాయి. ఇండియా ప్రధాని అభ్యర్థిత్వంపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ కూటమి తరఫున ప్రధాని అభ్యర్థి ఎవరో 2024 ఎన్నికల తర్వాతే నిర్ణయించుకుంటామన్నారు. బీజేపీని ఓడించమే లక్ష్యంగా సీట్ల పంపకంతో పాటు పలు సమస్యల్ని తమ కూటమిలోనే పరిష్కరించుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. మూడోసారి కూడా నరేంద్ర మోదీయే ప్రధాని అవుతారంటూ బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలపై కూడా దీదీ స్పందిస్తూ అది అంత తేలిక కాదన్నారు. ముఖ్యంగా హిందీ బెల్ట్‌లో బీజేపీ ప్రభావం పెరుగుతోందంటూ విలేకర్లు ప్రస్తావించగా బీజేపీబలంగా లేదు అలాగే, మేం కూడా బలహీనంగా ఉన్నాం. దీన్ని అధిగమించేందుకు అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. హిందీ బెల్ట్, ఇతర ప్రాంతాల మధ్య వివక్షతో చూడటం నాకు ఇష్టంలేదు అన్నారు.
కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహును వెంటనే అరెస్టు చేసి సభ్యత్వాన్ని రద్దు చేయాలని నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో బీజీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జార్ఖండ్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహూ ఇంట్లో ఐటీ దాడి జరిగింది. ఈ దాడిలో వందలాది కోట్లు పట్టుబడడం కాంగ్రెస్ వారి అవినీతికే అద్దం పడుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతికి మారు పేరు అని ఎద్దేవా చేశారు. వెంటనే ధీరజ్ సాహూను అరెస్టు చేసి రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి విషయంలోనూ బీజేపీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఓసీ సామాజిక వర్గానికి చెందిన భజన్‌లాల్ శర్మను సీఎంగా ప్రకటించింది. బీజేపీ శాసనసభాపక్ష నేతగా భజన్‌లాల్ శర్మను సీఎల్పీ భేటీలో బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. భజన్‌లాల్ తొలిసారి సీఎంగా ఎన్నికయ్యారు. డిప్యూటీ సీఎంలుగా దియాకుమారి, ప్రేమచంద్ భైరవను బీజేపీ ప్రకటించింది. అదే విధంగా స్పీకర్ వాసుదేవ్ దేవ్ నాని ఎంపిక చేసింది. కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్, బీజేపీ పరిశీలకులు రాజస్థాన్ సీఎం ఎంపిక ప్రక్రియను నిర్వహించారు. బీజేపీ ఎల్పీ ముగిసిన అనంతరం భజన్‌లాల్ శర్మ పేరును రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అధికారికంగా ప్రకటించారు. ఇక రాజస్థాన్ ముఖ్యమంత్రి రేసులో వసుంధర రాజే, దియాకుమారి, అర్జున్‌రామ్, గజేంద్ర షెకావత్, అశ్విని వైష్ణవ్ లాంటి సీనియర్ల పేర్లు వినిపించాయి. తీవ్ర సస్పెన్స్ కొనసాగించిన అనంతరం బీజేపీ అధిష్టానం.. చివరి నిమిషంలో భజన్‌లాల్ పేరును తెరపైకి తెచ్చింది. చివరకు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ తరహాలోనే రాజస్థాన్ విషయంలోనూ కొత్త ముఖాన్ని ఎంచుకుంది. 56 ఏళ్ల భజన్ లాల్ శర్మ.. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివారు. భజన్ లాల్ రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో సంగనేర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సమీప కాంగ్రెస్ అభ్యర్థి పుష్పేంద్ర భరద్వాజ్‌పై 48,081 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
తెలంగాణ ఏర్పడి పది సంవత్సరాలు కావొస్తుంది. రెండు పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలన చేసింది. ఈ పర్యాయం ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మ్యాండేట్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయగా, సీనియర్ నాయకులు మంత్రి పదవులను అలంకరించారు. తనదైన శైలిలో రేవంత్ ముందుకు వెళుతున్నారు. అధికారం అనుభవించి ఒకేసారి కోల్పోయిన ప్రతిపక్షానికి మింగుడు పడడం లేదా..? ప్రభుత్వం ఏర్పడి వారం రోజులైనా కాలేదు. అప్పుడే ప్రతిపక్షాల నుంచి విమర్శలు మొదలయ్యాయి. బీఆర్ఎస్, బీజేపీ విమర్శలు చేస్తున్నాయి. దీనిలో ఉన్న అంతర్గత మర్మమేంటో…? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడపగలదా..? బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటవుతున్నాయా …? ముందేమైనా ప్రమాదం ముంచుకొస్తుందా…? వీటన్నింటిని రేవంత్ సమర్థవంతంగా ఎదుర్కోగలరా….?
ఛత్తీస్‌గఢ్‌లోని ప్రముఖ గిరిజన నేత విష్ణు దియో సాయిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ ఎంపిక చేసింది. 54 మంది ఎమ్మెల్యేలతో జరిగిన పార్టీ శాసనసభా పక్ష నేతలసమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రానికి ఓ గిరిజన నేతను సీఎం చేయాలన్న మోదీ సంకల్పం ప్రకారం సీఎం ఎంపిక జరిగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వివాదరహితుడిగా పేరున్న విష్ణుదియో సాయి, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2020-22 మధ్యకాలంలో రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్‌గా సేవలందించారు. పార్టీ నిర్వహణపై మంచి పట్టున్న వ్యక్తిగా పేరుపొందారు. బీజేపీ నేషనల్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్‌గా కూడా పనిచేసిన ఆయనను ప్రధాని నరేంద్ర మోదీ 2014లో జూనియర్ మినిస్టర్‌గా నియమించారు. విష్ణు దియో సాయిను సీఎం చేసే అవకాశం ఉందని ఎన్నికల సమయంలోనే హోం మంత్రి అమిత్ షా సంకేతాలిచ్చారు. కుంకురి నియోజకవర్గంలో ప్రచారం సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ మీరు సాయిని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే మేము ఆయనను ఇంకా పెద్ద వ్యక్తిని చేస్తాం అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గిరిజనులకు బీజేపీ ఫేవరెట్‌గా మారింది. మునుపెన్నడూ చూడని రీతిలో గిరిజన ప్రాబల్యం అధికంగా ఉన్న సుర్గుజా ప్రాంతంలో ఉన్న 14 సీట్లు, బస్తర్ ప్రాంతంలోని 12 సీట్లు గెలుచుకుంది. దీంతో, విష్ణు దియో సాయికి సీఎం కుర్చీ దక్కింది.