గిరిజన నేత, కేంద్ర మాజీ మంత్రి విష్ణు దేవ్ సాయిని ఛత్తీస్‌గఢ్ కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రకటించింది. రాష్ట్రంలో ఇంతవరకూ అతిపెద్ద నాయకుడిగా ఉన్న మాజీ సీఎం రమణ్ సింగ్‌కు అత్యంత సన్నిహతుడుగా విష్ణు దేవ్ సాయికి పేరుంది. 59 ఏళ్ల విష్ణు దేవ్ 2006లో పార్టీ ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర అధ్యక్షుడుగా పని చేశారు. బీజేపీ జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యుడుగా కూడా ఉన్నారు. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేంద్ర ఉక్కు శాఖ జూనియర్ మినిస్టర్‌గా పని చేశారు. కాగా, సీఎం ఎంపిక కోసం రాయపూర్‌లో ఆదివారం నాడు బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశమై విష్ణుదేవ్ సాయి పేరును ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, సర్బానంద్ సోనోవాల్, పార్టీ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ హాజర్యయారు. ఇటీవల జరిగిన ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికార కాంగ్రెస్‌ను ఓడించి 54 సీట్లతో సంపూర్ణ మెజారిటీని సాధించింది. నార్త్ ఛత్తీస్‌గఢ్‌లోని కుంకూరి నియోజకవర్గం నుంచి విష్ణుదేవ్ సాయి పోటీ చేసి గెలుపొందారు.
Bjp
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి విమానాశ్రయ నూతన టర్మినల్ విస్తరణ పనులకు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శంకుస్థాపన చేశారు. వేద మంత్రోత్సారణ మద్య కార్యక్రమం వైభవోపేతంగా కొనసాగిది. రూ.347.15 కోట్లతో టెర్మినల్ బిల్డింగ్ తదితర అభివృద్ధి పనులును ప్రారంభిచారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు గారు కేంద్ర మంత్రి ఎంపీ మార్గాన్ని భరత్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొన్నారు. రాజమహేంద్రవరం ఎయిర్ పోర్ట్ లో కేంద్ర మంత్రి జ్యోతి రాధిత్య సింధియా కు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి ఘన స్వాగతం పలికారు.
Read Also..
Read Also..
కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. దానిలో భాగంగానే ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీని చేశారన్నారు. సీనియర్ ఎమ్మెల్యేలను కాదని ఏ ప్రాతిపదికన ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ను చేశారని ప్రశ్నించారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని ను ఆదరించరని ఒక్క స్థానం నుంచి 8 సీట్లకు పెరిగామని 6 నుంచి 14 శాతానికి బీజేపీ ఓటు బ్యాంకు పెరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ తన పాత అలవాటు ప్రకారం శాసనసభ గౌరవాన్ని కాల రాసిందని మండిపట్టారు. రెగ్యులర్ స్పీకర్ ఎన్నిక తరువాతే బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మినా దగ్గినా పడిపోతుంది అందుకే మజ్లిస్‌ను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు.
Read Also..
Read Also..
తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉందంటూ బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకే మజ్లిస్ పార్టీని మచ్చిక చేసుకుంటోందని ఆరోపించారు. అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెం స్పీకర్ గా ఎంపిక చేయడం వెనకున్న ఉద్దేశం ఇదేనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నంలో శాసన సభ సంప్రదాయాన్ని కాలరాసిందంటూ మండిపడ్డారు. సభలో సీనియర్లను పక్కన పెట్టి ఒవైసీని ప్రొటెం స్పీకర్ గా ఎంపిక చేయడం కాంగ్రెస్, మజ్లిస్ పార్టీ మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందాన్ని బయటపెడుతోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా తమ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రొటెం స్పీకర్ ఆధ్వర్యంలో స్పీకర్ ఎన్నిక జరగొద్దని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంపై గవర్నర్ ను కలుస్తామని చెప్పారు. రెగ్యులర్ స్పీకర్ ఎన్నికయ్యాకే బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణ రాజకీయాలపైన వైసీపీ సీనియర్ నేత కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ – జనసేన కూటమి కేవలం ఎనిమిది స్థానాల్లో గెలిచిందనీ,ఎనిమిది చోట్లా బీజేపీయే విజయం సాదించిందని అన్నారు. జనసేన పోటీ చేసిన ఎనిమిది చోట్ల ఒక్కసీటు గెలవలేదనీ ఎద్దెవా చేసారు. బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుందో తెలంగాణలో చూశామనీ, ఏపీలోనూ ఇదే పరిస్థితి ఉంటుందని జోస్యం చెప్పారు. ఎమ్మెల్యేగా గెలిచేందుకు పవన్ కల్యాణ్, ప్రతిపక్షం కోసం చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే టీడీపీ వాళ్లు ఏపీలో సంబరాలు చేసుకుంటున్నారని, గెలిస్తే తమ వారు అని, ఓడితే కాదని అనడం టీడీపీకి అలవాటే అన్నారు.
Read Also..
Read Also..
తెలంగాణను అభివృద్ధి చేయడం కేవలం బీజేపీకి మాత్రమే సాధ్యమని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాలను బీజేపీ గెల్చుకుందని చెప్పారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని, కేసీఆర్ చేసి వెళ్లిన అప్పులు తీర్చే క్రమంలో చతికిలపడుతుందని ఆయన జోస్యం చెప్పారు. ఏడాది లోపే ఆ పార్టీ కూడా చేతులెత్తేస్తుందని అన్నారు. ఆపై తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వమే వస్తుందని రాజా సింగ్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన డా బి ఆర్ అంబేద్కర్ వర్దంతి కార్యక్రమంలో రాజాసింగ్ పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని దళితులకు ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని మార్చేస్తానంటూ కేసీఆర్ వ్యాఖ్యానించడంతో ప్రజలు సీఎంనే మార్చేశారని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీకి 8 ఎమ్మెల్యే సీట్లను ఇచ్చినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
జనసేన పార్టీ, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై అవకాశం చిక్కినప్పుడల్లా విమర్శలు గుప్పించే సినీ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ జనసేన పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవడంపై సెటైర్లు వేశాడు. పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ టార్గెట్‌గా ఎక్స్ వేదికగా స్పందించాడు. ఆర్యభట్ట గణితశాస్ర్తంలో సున్నాని ఆవిష్కరించాడు. పవన్ కల్యాణ్ రాజకీయాల్లో సున్నాని కనిపెట్టాడు అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశాడు. తెలంగాణ ఎన్నికల్లో జనసేన విఫలమైన నేపథ్యంలో రామ్‌గోపాల్ వర్మ ఈ విధంగా వ్యాఖ్యానించాడు. బీజేపీతో పొత్తుపెట్టుకుని తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేసింది. మొత్తం 8 స్థానాల్లో పోటీ చేయగా అన్ని చోట్లా డిపాజిట్లు కోల్పోయింది. కూకట్పల్లి నుంచి పోటీ చేసిన ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్‌కు మాత్రమే చెప్పుకోదగ్గట్టుగా సుమారు 40 వేల ఓట్లు పడ్డాయి. మిగతా ఏడు చోట్ల అభ్యర్థులకు పెద్దగా ఓట్లు పడలేదు. కూకట్‌పల్లితోపాటు ఖమ్మం, నాగర్‌కర్నూలు, కోదాడ, కొత్తగూడెం, వైరా, తాండూరు, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో జనసేన తన అభ్యర్థులను బరిలోకి దింపింది. పవన్ కల్యాణ్‌తో పాటు బీజేపీ అగ్రనేతలు ప్రచారం చేసినా పెద్దగా ఓట్లు పడలేదు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యర్థి పార్టీ అయిన వైఎస్సార్సీపీ ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా రామ్‌గోపాల్ వర్మ కూడా ఇదే తరహాలో స్పందించాడు.
Read Also..
Read Also..
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో బీజేపీ నాయకుల సంబరాలు జరుపుకున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో పార్టీ గెలవడంతో ….కొల్లాపూర్ లో బీజేపీ నాయకులు బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకొన్నారు. నిన్న మూడు రాష్ట్రాల్లో వెల్లడైన ఫలితాల్లో బీజేపి గెలవడంతో సంబరాలు జరుపుకున్నామని బిజెపి సీనియర్ నాయకుడు సాయికృష్ణ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గల్లీలో తప్ప… ఎక్కడ కూడా లేదన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ దూసుకుపోతోందనడానికి నిన్నటి ఫలితాలే నిదర్శనమన్నారు. త్వరలోనే దేశమంతా కాషాయ మయంగా మారనుందని, కాంగ్రెస్ లేని దేశంగా త్వరలోనే చూడబోతున్నామని అన్నారు. కొల్లాపూర్ లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు గతంలో చేసిన మాదిరిగా కాకుండా …. ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచించాలని సూచించారు. అలాకాకుండా ఇష్టానుసారంగా కబ్జాలకు పాల్పడి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే ఆందోళనలు నిర్వహిస్తామని సాయి కృష్ణ హెచ్చరించారు.
శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో సభ్యులంతా ఫలప్రదమైన చర్చలు జరపాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మీ ఓటమి తాలూకు అసహనాన్ని పార్లమెంట్లో ప్రదర్శించొద్దు అని మోదీ కాంగ్రెస్‌కు హితవు పలికారు. శీతాకాల సమావేశాల నిమిత్తం పార్లమెంట్‌కు వచ్చిన ప్రధాని మీడియాతో మాట్లాడారు. గత 9 ఏళ్లుగా వారికి అలవాటుగా మారిన నెగెటివిటీని పక్కనబెట్టి ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సంతృప్తినిచ్చాయన్నారు. సుపరిపాలన, జనహితం కోసం పాటుపడిన వారికి ప్రజలు పట్టం కట్టారని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం నిబద్ధతతో పనిచేస్తే.. ప్రభుత్వ వ్యతిరేకత అనే పదం ఉండదని రుజువైందని ప్రధాని స్పష్టం చేశారు.
ప్రధాని మోడీ, సీఎం జగన్ ఇద్దరు ఒక్కటే అని ప్రజలు గమనించాలి. ప్రభుత్వం మైనారిటీల కార్పొరేషన్ రద్దు చేసి హక్కులను కాలరాసింది. ముస్లిం మైనారిటీల ఆత్మీయ సమావేశానికి టిడిపి నేతలు హాజరు అయ్యారు. చంద్ర బాబు హయాంలో ముస్లిం ల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టింది. జగన్ హయాంలో అన్ని వర్గాల కు అన్యాయం చేశారు. సమాజంలో ముస్లిం ల పాత్ర కి ఒక గుర్తింపు ఉంది. రానున్న ఎన్నికల్లో టిడిపి విజయ కేతనం కి ముస్లింలు సహకారం అందించాలి.