తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. ఫలితాల అనంతరం కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజల పక్షాన బీజేపీ పోరాడితే కాంగ్రెస్ లబ్ధి పొందిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఓడించాలన్న లక్ష్యంతో ముస్లింల ఇళ్లను కూల్చినోళ్లకు, వక్ఫ్ ఆస్తులను కబ్జా చేసినోళ్లకే ముస్లింలు ఓటు వేయడం తనను ఆశ్చర్యపరిచిందన్నారు. ఏది ఏమైనా కేసీఆర్ మూర్ఖత్వపు పాలన విరగడైనందుకు సంతోషంగా ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల గోసపడుతున్న ప్రజలను చైతన్యం చేసింది బీజేపీ అని, కానీ అంతిమంగా కాంగ్రెస్ ఆ లబ్ధి పొందిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన నిలిచిన తమపై కేసులు పెట్టారని, జైలుకు కూడా పంపారని గుర్తు చేసుకున్నారు. దురదృష్టవశాత్తు ప్రజలు తమను ఆదరించలేదని, అయినప్పటికీ కేసీఆర్ మూర్ఖత్వపు పాలన విరగడైనందుకు సంతోషంగా ఉందన్నారు. గెలుపోటముల ఆధారంగా తాను పనిచేయనని, తన లక్ష్యం తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమేనని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు తాను, రేవంత్‌రెడ్డి లక్ష్యంగా మారామన్నారు. బీజేపీ కోసం కష్టపడి పనిచేసిన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రూ. 200 కోట్లు ఖర్చు చేసి తిరిగి తాను డబ్బులు పంచుతున్నానని అభాండాలు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ గ్రాఫ్ తగ్గించేందుకు కుట్ర చేసి, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చి లాభపడాలని చూసిన బీఆర్ఎస్ చివరికి ఓటమి మూటగట్టుకుందని బండి సంజయ్ పేర్కొన్నారు.
Bjp
తెలంగాణ ఎన్నికల ఫలితాల ఉత్కంఠకు తెరదిగింది. త్రిముఖ పోటీలో మెరుపు వేగంతో ప్రత్యేక తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సొంతం చేసుకుంది. 119 స్థానాల్లో పోటీ చేసి 64 స్థానాలను సొంతం చేసుకుంది. అధికారాన్ని హస్తగతం చేసుకునే మేజిక్ ఫిగర్ ను దాటేసింది. రేపు ప్రమాణస్వీకారానికి సిద్ధమైంది. ఆ పార్టీకి చెందిన సీనియర్లు కూడా ఈసారి గెలిచారు. ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచింది. సీఎం కేసీఆర్ కామారెడ్డిలో ఓటమి పాలయ్యారు. పలువురు మంత్రులు సైతం ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో 88 స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్ ఈసారి 39 స్థానాలకు పరిమితమైంది. సీఎం కేసీఆర్ సహా, పలువురు మంత్రులకు ఈసారి చేదు అనుభవం ఎదురైంది. ఇక బీజేపీ ఈసారి ఎన్నికల్లో పుంజుకుంది. సింగిల్ డిజిట్ కే పరిమితమైనప్పటికీ గతంలో కంటే ఈ సారి ఓట్లు, సీట్ల సంఖ్యను పెంచుకుంది. పలు చోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు గట్టి పోటీ ఇచ్చింది. మొత్తం 111 స్థానాల్లో పోటీ చేసి 8 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. బీజేపీ మిత్రపక్షం జనసేన పోటీ చేసిన 8 స్థానాల్లో కనీసం పోటీని ఇవ్వలేకపోయింది. ఎంఐఎం ఏడు స్థానాల్లోనూ, సీపీఐ ఒక స్థానంలోనూ విజయం సాధించాయి.
నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ స్పందించారు. నాలుగు రాష్ట్రాల్లో మూడింటిలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోయింది. ఈ తీర్పుపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. పార్టీ విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలకు కృతజ్ఙతలు తెలిపారు. బీజేపీ పై నమ్మకం ఉంచిన తల్లులు, సోదరీమణులు, కుమార్తెలు, యువ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. దేశ ప్రజలు, సుపరిపాలన, అభివృద్ధిపైన విశ్వాసం ఉంచారనేదానికి ఈ ఫలితాలు నిదర్శనమన్నారు. తెలంగాణతో మా బంధం విడదీయరానిదన్నారు. తెలంగాణలో గత కొన్నేళ్లుగా మా మద్దతు పెరుగుతూనే ఉందని తెలిపారు. ప్రజల కోసం మేము పని చేస్తూనే ఉంటామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
శ్రీకాకుళం జిల్లాకేంద్రంలోని ఏడు రోడ్ల జంక్షన్ లో బిజేపి శ్రేణులు సంభరాలు జరుపుకున్నారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో మూడు రాష్ట్రాల్లో విజయం
సాదించడంతో పాటు తెలంగాణాలో మెరుగైన ఫలితాలు సాదించామన్నారు. జిల్లా అద్యక్షుడు బిర్లంగి ఉమామహేశ్వరరావు .. ఈ ఏన్నికల ఫలితాలతో మరో సారి మోడి ప్రదాని కావడం తద్యమన్నారు. తెలంగాణాలో అసేంబ్లీ స్థానాలను పెంచుకోవడంతో పాటు ఇద్దరు ముఖ్యమంత్రి అబ్యర్దులను సైతం
ఓడించామన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో విజయం తథ్యం అని పేర్కొన్నారు…
తెలంగాణ ఓట్ల లెక్కింపు ఆసక్తి రేపుతోంది. పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో సాగుతోంది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. బీఆర్ఎస్ రెండో స్థానంలో ఉంది. ఇక మజ్లిస్ ఒక స్థానంలో ముందంజలో ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లో ఆధిక్యంలో ఉన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్ లో ముందంజలో ఉన్నారు. ఇక కేసీఆర్, రేవంత్ రెడ్డిలు పోటీలో ఉన్న కామారెడ్డి నియోజకవర్గంలో ఇద్దరు అగ్రనేతలు పోస్టల్ బ్యాలెట్లలో వెనకంజలో ఉన్నారు. కామారెడ్డిలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఈవీఎంల ఓట్ల లెక్కింపు మొదలయ్యాక రేవంత్ ఆధిక్యంలోకి వచ్చారు. హైదరాబాద్ లోని చాంద్రాయణ్ గుట్టలో అక్బరుద్దీన్ ఒవైసీ ఆధిక్యం కనబరుస్తున్నారు. ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు, మధిరలో భట్టి విక్రమార్క లీడ్ లో ఉన్నారు. మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులే ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో మొత్తం 546577 ఓటర్లు ఉండగా ప్రధాన పార్టీలు తమ తమ లెక్కలు ఎంత అని లెక్కలు చూసుకుంటున్నారు. కానీ ఎన్నికల కమిషనర్ ఇప్పటివరకు లెక్కలు చూపలేకపోతున్నారు. దీన్ని చూస్తే ప్రజల్లో అనుమానం వ్యక్తం అవుతుంది. అదేవిధంగా ప్రధాన పార్టీల్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తొమ్మిది సంవత్సరాల పాలనలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గెలిస్తాయా లేక బీసీలను ముఖ్యమంత్రి చేస్తాం అన్న బిజెపి గెలుస్తుందా లేదా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామంటున్నా కాంగ్రెస్ గెలుస్తుందా అని ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. దీనిబట్టి చూస్తే మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తల ఉత్సవం చూస్తుంటే అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే అన్నట్టుగా ప్రజల్లో వినబడుతున్న మాట ఎన్నికలు పూర్తయి 15 గంటలు గడుస్తున్న ఎన్నికల కమిషనర్ మహేశ్వరం నియోజకవర్గం లో ఓటింగ్ లో పోల్ అయిన లెక్కలు తేల్చలేకపోవడం పై ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Read Also..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకు… మిగిలిన ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ కు తెరపడింది. 5 గంటల లోపు పోలింగ్ బూత్ ల వద్ద క్యూ లైన్లలో ఉన్నవారికి మాత్రం ఓటు వేసే అవకాశం ఇచ్చారు అధికారులు. పోలింగ్ ప్రక్రియ ముగియడంతో అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమయింది. ఇక డిసెంబర్ 3న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఎన్నికల్లో నిలబడ్డ 2,290 మంది అభ్యర్థుల భవితవ్యం 3న తేలనుంది. తదుపరి ప్రభుత్వం ఎవరిదో తేలిపోనుంది. ఈ ఎన్నికలు అక్కడక్కడ చిన్నిచిన్న ఘర్షణలు మినహా ప్రశాంతంగా జరిగాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గడం నిరాశాజనకమైన విషయంగా చెప్పుకోవచ్చుతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం ఎగ్జిట్ పోల్స్ తెరపైకి వచ్చాయి. అధికార బీఆర్ఎస్ పార్టీకి రెండో స్థానమేనని, కాంగ్రెస్ పార్టీకే ఓటర్ల ఆదరణ లభించిందని ఆయా సర్వేలు వెల్లడించాయి.
ఏపీ ఆర్థిక పరిస్థితిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పీఎఫ్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్రం ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం బీజేపీ కార్యాలయంలో పురంధేశ్వరి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిందని ఆరోపించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ సుపరిపాలన అందిస్తుంటే రాష్ట్రంలో మాత్రం జగన్ ప్రభుత్వం అవినీతిమయంగా మారిందని విమర్శించారు. వైసీపీ చేపట్టిన సామాజిక సాధికారితపై పురంధేశ్వరి విమర్శలు కురిపించారు. అసలు ఏం అర్హత ఉందని, వైసీపీ నాయకులు సాధికారిత యాత్ర చేస్తున్నారని పురంధేశ్వరి ప్రశ్నించారు. ఇసుక, మైనింగ్, మద్యం అన్ని విషయాల్లోనూ వైసీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని మండిపడ్డారు. రాష్ట్ర విభజన అన్ని అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహకరిస్తోందని చెప్పారు. సీఎం జగన్ సొంత పాలనను కొనసాగిస్తూ అన్ని వర్గాలను, రంగాలను నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేవారు. కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యం పథకంపైనా సీఎం జగన్ స్టిక్టర్లు వేసుకుంటున్నారని ధ్వజమెత్తారు.
తెలంగాణలో మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జహీరాబాద్‌లో నిర్వహించిన రోడ్‌షోలో ఆమె పాల్గొన్నారు. ఉద్యోగాల కోసం తెలంగాణ తెచ్చుకుంటే అదీ నెరవేరలేదన్నారు. ఉద్యోగ పరీక్షల పేపర్లను లీక్ చేసి అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందన్నారు. రూ. 400 గ్యాస్ సిలిండర్ ధరను రూ. వెయ్యికి పైగా పెంచారని విమర్శించారు. ధరణి పోర్టల్ తో భూములను లాగేసుకున్నారని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం సహకరించుకుంటున్నాయని ప్రియాంక గాంధీ విమర్శించారు.
Read Also..
Read Also..
గుంటూరు పట్టణం వ్యవసాయ కార్యాలయం వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. వ్యవసాయ కమిషనర్ కార్యాలయం ముట్టడికి బిజెపి కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 400కరువు మండలాలకు 130 ప్రకటించడంతో రైతులు ఆగ్రహం వక్తం చేశారు. ప్రభుత్వం రైతులను చిన్న చూపు చూస్తుందని ఆవేదన చెందారు. ఇది వ్యతిరేక ప్రభుత్వం అంటూ వ్యవసాయ కార్యలయం వద్ద బిజెపి కిసాన్ మోర్చా నాయకుల నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళనలు చేశారు. న్యాయం చేసే వరకూ తమ పోరాటం ఆగదన్నారు. రైతుల కోసం కిసాన్ మోర్చా అండగా ఉంటుందని తెలిపారు. దీంతో ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు.