బీఆర్ఎస్ కు ఓటు వేస్తే మళ్లీ దొరల ప్రభుత్వం వస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. నాంపల్లిలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దేశంలో బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. మన దేశ సంస్కృతి ఇది కాదన్నారు. కాంగ్రెస్ ను డ్యామేజ్ చేసేందుకు బీజేపీ యత్నిస్తుందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు అవినీతి జరిగిందన్నారు. కాంగ్రెస్‌ను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఎంఐఎం పోటీ చేస్తుందని ఆరోపించారు. అవినీతిపరుడైన కేసీఆర్‌పై ఒక్క కేసు కూడా లేదన్నారు. మోదీ సర్కార్ తెచ్చిన అన్ని బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని గుర్తుచేశారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ప్రజల సర్కార్ వస్తుందని రాహుల్ చెప్పారు.
Bjp
మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి చెంగిచేర్ల క్రాస్ వద్ద కారులో డబ్బులు తరలిస్తున్న వ్యక్తిని పట్టుకొని కాంగ్రెస్ నాయకులు చితకబాదారు.
కాంగ్రెస్ నాయకుల చేతిలో చితకబాదిన వ్యక్తి వద్ద తెలంగాణ పోలీసు శాఖలో వరంగల్ లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ గా అతని వద్ద ఐడి కార్డు లభించింది..
కారులో ఉన్న రెండు బ్యాగులను తీసుకొని మరికొందరు వ్యక్తులు పారిపోయినట్టు కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతున్నారు. స్థానిక పోలీసులు ప్లేయింగ్ స్క్వాడ్ వచ్చి తనిఖీలు చేయగా అందులో 500,200 రూపాయల నోట్ల కట్టలు లభించాయి. పోచారం మున్సిపాలిటీ, ఘట్ కేసర్ ప్రాంతాలకు తరలిస్తుంన్నారన్న సమాచారంతో కాంగ్రెస్ నాయకులు కారు అడ్డగించి పట్టుకున్నట్లు చెబుతున్నారు. అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ బిజెపి నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. డబ్బులు తరలింపు వ్యవహారం వెనకాల మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి పై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం చేస్తూ చెంగిచెర్ల క్రాస్ హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారి పై ఆందోళనకు దిగారు. కారు వద్దకి చేరుకున్న రిటర్నింగ్ అధికారి. డబ్బు స్వాదీనం చేసుకున్నారు.
మల్కాజీగిరిలో ఎంపీగా రేవంత్ రెడ్డిని గెలిపిస్తే పార్లమెంట్ నియోజకవర్గాన్ని పట్టించుకున్న పాపానపోలేదని అన్నారు. కూకట్ పల్లి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఈ ఉదయం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపీ బడ్జెట్ నుండి రేవంత్ రెడ్డి కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదు అన్నారు మాధవరం. రాష్ట్రానికి ప్రజలకు బీజేపీ ఏమీ చేసింది లేదు. ప్రజలకు పెన్షన్లు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, అభివృద్ధి కార్యక్రమాల చేపట్టన బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటు వేయాలని కోరారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం శ్రమించిన తనకు ఓటు వేసి గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు బీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ వల్లే తాను రాజకీయంగా ఎదిగానని, కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత లభించిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం తాను కాంగ్రెస్ వాదినని, తనకు మరే పార్టీతో ఇప్పుడు సంబంధం లేదని అన్నారు. కాంగ్రెస్ లో చేరిన తర్వాత కాంగ్రెస్ కార్యకర్తగా నిబద్ధతతో పని చేస్తున్నానని చెప్పారు. అవసరమైతే ఏపీలో కూడా కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తానని అన్నారు. ఎన్నికలకు ముందే బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య ఒప్పందం కుదిరిందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రధాని మోదీనే బాస్ అని వ్యాఖ్యానించారు. పార్లమెంటులో బీజేపీ బిల్లులకు బీఆర్ఎస్ మద్దతిచ్చిందనే విషయాన్ని గుర్తు చేశారు.
నువ్వు రాజకీయ విటుడివా లేక రాజకీయ బ్రోకరువా అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం చేస్తుండటంపై అంబటి మండిపడ్డారు. పదేళ్ల నుంచి రాజకీయాలు చేస్తున్నావు. నువ్వు రాజకీయ నాయకుడివా, లేక రాజకీయ నటుడివా, లేకపోతే రాజకీయ విటుడివా, లేక రాజకీయ బ్రోకరువా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘అసలు నీ వ్యక్తిత్వం ఏంటి? నీ వ్యవహారం ఏంటి? ఇవాళ తెలంగాణలో ఏం జరుగుతోంది? తెలంగాణ రాజకీయాల్లో నీ పాత్ర ఏంటి? తెలంగాణలో నువ్వు ఎవరికి మద్దతు ఇస్తున్నావ్? చంద్రబాబు ఎవరికి మద్దతు ఇస్తున్నాడు? అని మంత్రి అంబటి రాంబాబు నిలదీశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బీజేపీ, బీఆర్ఎస్ సవాల్ చేస్తుంటే నీ జెండా ఎక్కడ కట్టావ్, బీజేపీ పక్కన కట్టావ్. మరి చంద్రబాబు జెండా ఎక్కడ కట్టాడు, కాంగ్రెస్ పక్కన కట్టాడు. ఏం బతుకులయ్యా మీవి? చంద్రబాబేమో ఇంట్లో కూర్చుంటాడు. కాంగ్రెస్ మీటింగులు జరుగుతుంటే వాటిల్లో పచ్చ జెండాలు పైకి లేస్తుంటాయి. బీజేపీలో ఏమో నువ్వు డైరెక్టుగా వెళ్లి జెండాలు కట్టి కూర్చున్నావు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Read Also..
Read Also..
నువ్వు రాజకీయ విటుడివా… లేక రాజకీయ బ్రోకరువా అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం చేస్తుండటంపై అంబటి మండిపడ్డారు. పదేళ్ల నుంచి రాజకీయాలు చేస్తున్నావు… నువ్వు రాజకీయ నాయకుడివా, లేక రాజకీయ నటుడివా… లేకపోతే రాజకీయ విటుడివా… లేక రాజకీయ బ్రోకరువా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.‘అసలు నీ వ్యక్తిత్వం ఏంటి? నీ వ్యవహారం ఏంటి? ఇవాళ తెలంగాణలో ఏం జరుగుతోంది? తెలంగాణ రాజకీయాల్లో నీ పాత్ర ఏంటి? తెలంగాణలో నువ్వు ఎవరికి మద్దతు ఇస్తున్నావ్? చంద్రబాబు ఎవరికి మద్దతు ఇస్తున్నాడు? అని మంత్రి అంబటి రాంబాబు నిలదీశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బీజేపీ, బీఆర్ఎస్ సవాల్ చేస్తుంటే నీ జెండా ఎక్కడ కట్టావ్… బీజేపీ పక్కన కట్టావ్. మరి చంద్రబాబు జెండా ఎక్కడ కట్టాడు… కాంగ్రెస్ పక్కన కట్టాడు. ఏం బతుకులయ్యా మీవి? చంద్రబాబేమో ఇంట్లో కూర్చుంటాడు… కాంగ్రెస్ మీటింగులు జరుగుతుంటే వాటిల్లో పచ్చ జెండాలు పైకి లేస్తుంటాయి. బీజేపీలో ఏమో నువ్వు డైరెక్టుగా వెళ్లి జెండాలు కట్టి కూర్చున్నావు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బిజెపి సభకు భారత ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని డోర్నకల్ మహబూబాబాద్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులు భూక్యా సంగీత, జాటోత్ హుస్సేన్ నాయక్ ల ను గెలిపించాలని ప్రజలకు సూచించారు. కాగా ఈ వేదికపై ఆసక్తికర సన్నివేశం నెలకొన్నది.
ప్రధాని మోదికి డోర్నకల్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థిని భూక్యా సంగీత గిరిజన సాంప్రదాయ ఆభరణాలను అందించారు. తదుపరి ప్రధాని కాళ్లకు సంగీత నమస్కరించారు. ఇది సాధారణంగా ప్రతి వేదికలపై జరిగే విషయమే కానీ దేశ అత్యున్నత స్థానమైన ప్రధాని హోదాలో ఉన్న నరేంద్ర మోడీ అతి సాధారణ మారుమూల గిరిజన తండాలో పుట్టిన ఎమ్మెల్యే అభ్యర్థిని పాదాలకు తిరిగి నమస్కరించారు. కాగా ఈ సన్నివేశం సభలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దేశ ప్రథమ పౌరుడైన మహిళల పట్ల ఇచ్చే అత్యున్నత గౌరవం భాజపాకు మాత్రమే సాధ్యమవుతుందని జిల్లావాసులు చర్చించుకుంటున్నారు.
Read Also
తిరుపతి అభివృద్ధికి బీజేపీ ఎప్పుడు మద్దతిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్ తెలిపారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం తిరుమలను ఆదాయ వనరుగా చూస్తుందని ఆరోపించారు. హిందు అధ్యాత్మిక కార్యక్రమాలకు, టీటీడీ సంస్థలకు సేవ చేసే భాద్యత టీటీడీదే అని తెలిపారు. గడిచిన నాలుగు సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున టీటీడీ నిధులు తరలించారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు ఇచ్చే నిధులు, ఎక్కడికి పొతున్నాయంటూ ప్రశ్నించారు. తిరుపతి అభివృద్ది కోసం కేంద్రం 500కోట్లు విడుదల చేస్తే, కేవలం వందకోట్లు ఖర్చు పెట్టిందన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను సరిగ్గా ఖర్చు పెట్టకుండా టీటీడీ నిదులను కాజేస్తున్నారని తీవ్ర స్తాయిలో ఆరోపణలు చేసారు.
Read Also..
Read Also..
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, అవసరాలకు అనుగుణంగా చేయాల్సిన జిల్లాల పునర్విభజనను. అధికార పార్టీ నేతల స్వలాభం కోసం చేశారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల స్వప్రయోజనాల కోసం చిన్న జిల్లాలు ఏర్పాటు చేశారంటూ సీఎం కేసీఆర్ పై ఆరోపణలు గుప్పించారు. అసలు చిన్న జిల్లాలను ఏర్పాటు చేయాలని మిమ్మల్ని అడిగిందెవరంటూ కేసీఆర్ ను ఆయన నిలదీశారు. ఈమేరకు సీఎం కేసీఆర్ కు కిషన్ రెడ్డి తాజాగా మరో బహిరంగ లేఖ రాశారు. వరుసగా ఇది తన నాలుగవ లేఖ అని, దీనికి కూడా స్పందించరా అంటూ కేసీఆర్ ను ప్రశ్నించారు.
జిల్లాల విభజన జరుగుతుంటే ఒక ప్రజాప్రతినిధి పక్క జిల్లాలోని మండలాన్ని తన జిల్లాలో బలవంతంగా కలిపేసుకున్నాడని కిషన్ రెడ్డి చెప్పారు. దీనికి కారణమేంటని విచారిస్తే భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఆ మండలంలో స్థిరపడిన తన బావమరిదిని ఎమ్మెల్యేగా నిలబెట్టేందుకు అడ్డంకులు ఉండకూడదనే ఈ పని చేసినట్లు తేలిందన్నారు. పలువురు ప్రజాప్రతినిధులు బినామీ పేర్లతో భూములు కొని, వాటికి విలువ వచ్చేలా జిల్లాలను ఏర్పాటు చేయించుకున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు.
ఈ అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేవని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మక్తల్‌లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ పదేళ్ల పాలన పూర్తిగా అవినీతిమయమైందన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో ఎమ్మెల్యేలు, మంత్రులు భూకబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజాప్రతినిధులు ప్రజల పనులు చేయకుండా దందాలు చేయడమే ఆ పార్టీ ఎమ్మెల్యేల విధానంగా మారిందని మండిపడ్డారు. బీజేపీ గెలిస్తే మక్తల్, నారాయణపేటలలో టెక్స్ టైల్ పార్కును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ బీ టీమ్ అని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం అవినీతి వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని విమర్శించారు. కేసీఆర్‌ను ఇంటికి సాగనంపే సమయం వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినా బీఆర్ఎస్కు వేసినట్లే అవుతుందని, వారు కేసీఆర్‌కు అమ్ముడుపోతారని ఆరోపించారు.
Read Also..
Read Also..