తెలంగాణ కాంగ్రెస్ లో చేరికలు కొనసాగుతున్నాయి. మరో ప్రముఖ నటి దివ్యవాణి కాంగ్రెస్ లో చేరారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోరు కొనసాగుతోంది. ఈ సమయంలో చేరికల విషయంలో పార్టీ నాయకత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. అందులో భాగంగా బీజేపీలోకి వెళ్లిన నేతలను తిరిగి రప్పించటంలో సక్సెస్ అవ్వటంతో మరి కొందరు ముఖ్యులతోనూ టచ్ లో వెళ్లింది. ఇక, దివ్యవాణికి ప్రచార బాధ్యతలు అప్పగించింది.
Brs
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అన్నివర్గాల ప్రజల అభ్యున్నతికి పాటుపడుతు సింగరేణి కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి కార్మికులు అండగా నిలవాలని రామగుండం ఎమ్మెల్యే ,బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోరుకంటి చందర్ కోరారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియా గోదావరిఖని 2ఏ బొగ్గుగని పై తెలంగాణ కార్మిక సంఘం నాయకులతో కలిసి ప్రజా ఆశీర్వాద యాత్ర చేపట్టారు. గత ప్రభుత్వాలు సింగరేణిలో పోగొట్టిన వారసత్వ ఉద్యోగాలను రాష్టం ఏర్పడిన తరువాత కారుణ్య నియామకాల ద్వారా తిరిగి తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కె దక్కుతుందన్నారు. అలాగే కార్మికుల కు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. సింగరేణి ప్రైవేటీకరణ పై అసత్యం ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కోరారు.
Read Also..
ఈ రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి. నియోజకవర్గం దిక్కు చూడనోళ్లు కూడా ఈ ఎన్నికల్లో తమకు ఓటు వేయాలని అడగడం దారుణమన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని అన్నారు సబితా ఇంద్రారెడ్డి. గతంలో అధికారంలో ఉన్న ఏమి చేయని కాంగ్రెస్ పార్టీ ఈరోజు 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నియోజకవర్గంలోని పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలలో ఇల్లు నిర్మించుకోవచ్చు అని, ఎవరో చెప్పే తప్పుడు మాటలు నమ్మొద్దు అంటున్న బీ ఆర్ ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి.
యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గం లో ఎన్నికల ప్రచారంలో భాగంగా హెలికాప్టర్ లో ఉదయం 11 గంటలకు చౌటుప్పల్ చేరుకొనున్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ అనంతరం బి ఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తరపున చౌటుప్పల్ మండల కేంద్రంలో రోడ్ షో ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న మంత్రి కేటీఆర్. అనంతరం కోదాడ బయలుదేరుతున్న మంత్రి కేటీఆర్.
గత కాంగ్రెస్, ఎర్రజెండాల పాలనలో కనీసం బుక్కెడు తాగు నీళ్లకు హుస్నాబాద్ నోచుకోలేదని, కానీ నేడు తాగునీటితో పాటు సాగునీరు సమృద్ధిగా అందుతూ బంగారంలా రెండు పంటలు పండుతున్నాయని మంత్రి హరీష్ రావు అన్నారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం, రోడ్ షోలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కోతల రాయుుడు పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ కు వచ్చాడని, కరీంనగర్ లో మూడు సార్లు చిత్తుగా ఓడిపోయి అక్కడ చేతకాక హుస్నాబాద్ కు వచ్చాడని ఎద్దేవా చేశారు.
తెలంగాణాలో కేసీఆర్ మీటర్లు పెట్టలేదని అందుకే రాష్ట్రానికి 35,000 కోట్లు ఆపామని, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారని, 35 వేల కోట్లు ముఖ్యం కాదని రైతుల సంక్షేమమే ముఖ్యమని కేసీఆర్ మీటర్లు పెట్టడానికి ఒప్పుకోలేదన్నారు.
కరెంట్ కావాలో కాంగ్రెస్ కావాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు.
కర్ణాటకలో 5 గ్యారంటీ లని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో గతంలో 9 గంటల వచ్చే కరెంట్ ఇప్పుడు 3 గంటలు కూడా రావట్లేదని, అన్నింటిలో కోతలు విధిస్తున్నారని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో కంటే బిఆర్ఎస్ మేనిఫెస్టో నూరు పాల్లు నయ్యమని, ఎగపెట్టిన చరిత్ర కాంగ్రెస్ ది అయితే అమలు చేసిన చరిత్ర బిఆర్ఎస్ దన్నారు. మూడు గంటల కరంటోడు కాంగ్రెస్ ఓ దిక్కు, మీటర్ల బిజెపోడు ఓ దిక్కు, 24 గంటల ఉచిత కరెంటు కేసిఆర్ ఓ దిక్కు ఉన్నారని, ఏ దిక్కుకు, ఎటుండాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు.
ప్రజలే హై కమాండ్ గా పనిచేసే పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని, హుస్నాబాద్ అభివృద్ధికి తానే స్వయంగా బాధ్యత తీసుకుంటానన్నారు.
50 వేలకు పైగా మెజారిటీతో సతీష్ కుమార్ గెలవడం పక్క అని జోస్యం చెప్పారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం మీనాజిపేట గ్రామ సమీపంలో బక్కన్న పై మరియు వారి భార్య పై జరిగిన దాడినీ ఖడిoచిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు స్పందిస్తూ ఎన్నికల ముందే మొదలు పెట్టిన గుండా రాజకీయం రౌడీ రాజకీయం, ఎలక్షన్ తర్వాత ఎలా ఉంటాదో, ఎలాంటి పరిస్తుతులు ఉంటాయో మనం అర్దం చేసుకోవాలి అని మాట్లాడారు.
దౌర్జన్యాలు ,గుండా రాజకీయాలు ,హత్య రాజకీయలు ,రౌడీ రాజకీయలు మొదలు పెట్టిన BRS నాయకత్వాన్ని ఆ నాయకత్వాన్ని బలపరుస్తున్న కెసిఆర్ గారిని ఖoడిస్తున్నను. దాడీ చేసిన వారిపై కటిన చర్యలు తీసుకోవాలనీ డిమాండ్ చేసిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు.
కత్తిపోట్లతో విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని, ఓటు పోటుతో సమాధానం చెప్పాలని మంత్రి కేటీఆర్ అన్నారు. దుబ్బాకలో కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి తరపున మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కేసీఆర్ ను హ్యాట్రిక్ సీఎం చేయాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ 3 తర్వాత అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామన్నారు. రైతు బంధు వద్దు, ధరణి వద్దు అనే పార్టీలు కావాలా? అని ప్రశ్నించారు. రైతుబంధు పెంచుతామంటున్న బీఆర్ఎస్ కావాలో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. ప్రతిపక్షాలు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అడుగడం సిగ్గుచేటని మండిపడ్డారు. జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. దుబ్బాకలో ఇంకా అభివృద్ధి జరగాల్సి ఉన్నదన్నారు. దుబ్బాకను అభివృద్ధి చేసే బాధ్యత మాది, ఓట్లు వేయండి పనులు చేసుకోండని కేటీఆర్ కోరారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మంత్రి కేటీఆర్ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా.. ప్రభుత్వ భవనాల్లో, ఇంటర్వ్యూలలో, న్యూస్ పేపర్లలో తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారని తమ ఫిర్యాదులో పేర్కొంది. మూడు రోజుల పాటు కేటీఆర్‌ను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వ భవనమైన టీ హబ్‌లో విద్యార్థులు, యువతతో మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. టీ హబ్‌లో సమావేశంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఎన్నికల ప్రచారం చేయడం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిసిన కాంగ్రెస్ బృందం పేర్కొంది.
నిరుద్యోగ చైతన్య యాత్ర చెన్నూర్ నియోజకవర్గ కేంద్రానికి చేరుకున్నది.నిరుద్యోగ చైతన్య యాత్ర సభ్యులకు ఘన స్వాగతం పలికారు చెన్నూర్ ప్రజలు. ప్రొఫెసర్ రియాజ్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా మోసం చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి వెంటనే గద్దె దించాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్‌కు అధికారమిచ్చి కర్ణాటక ప్రజల్లా తెలంగాణ ప్రజలు ఆగం కావొద్దని మంత్రి హరీశ్‌రావు కోరారు. హుస్నాబాద్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో హరీష్ రావుమాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో ఆరు గ్యారంటీలు ఏమో కానీ ఆరు నెలలకో ముఖ్యమంత్రి పక్కాగా మారతారన్నారు. మూడు గంటల కరెంట్‌తోనే మూడు ఎకరాలు పారుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అంటున్నారని.. రైతుబంధు ఖర్చు దుబారా అని ఉత్తమ్‌కుమారెడ్డి చెబుతున్నారన్నారు. అలాంటి వారి మాటలు నమ్మి ఓటేస్తే మోసపోవడం ఖాయమని చెప్పారు. కాంగ్రెస్ మేనిఫెస్టో కంటే BRS మేనిఫెస్టో వందరెట్లు నయమని, పింఛను, గ్యాస్ సిలిండర్, రైతుబంధు.. ఇలా BRS ఇస్తున్న వాటినే పేర్లు మార్చి కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చారన్నారు. వంద అబద్ధాలాడైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ నేతలు చూస్తున్నారని, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కర్ణాటకలో ఉపన్యాసాలతో ఊదరగొట్టారని.. అధికారంలోకి వచ్చిన తరువాత అటు చూడటమే మానేశారన్నరు. వారు ఇక్కడ కూడా మళ్లీ ఆరు గ్యారంటీలను ప్రచారం చేస్తున్నారు.