కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలవుతాయో లేదో కానీ.. 6 నెలలకు ఓ ముఖ్యమంత్రి మారడం మాత్రం ఖాయమన్నారు తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైదరాబాద్ తాజ్ దక్కన్లో నిర్వహించిన తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. తెలంగాణ అభివృద్ధికి స్టేబుల్ గవర్నమెంట్, ఏబుల్ లీడర్షిప్ అవసరమన్నారు కేటీఆర్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిత్యం పదవుల కొట్లాటలు తప్పవన్నారు. సంపద సృష్టించాలంటే శాంతిభద్రతలు ఉండాలన్నారు. కానీ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అక్కడి పరిస్థితులు దారుణంగా తయారయ్యాయన్నారు. ఇక్కడ కూడా అధికారంలోకి వస్తే శాంతిభద్రతల ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. కర్ణాటక ప్రజల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టుగా మారిందన్నారు. 40 శాతం కమిషన్ అని బీజేపీ ప్రభుత్వాన్ని పక్కన పెడితే, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ వాళ్లు చదరపు అడుగుకు 500రూపాయల వరకు బిల్డర్స్ నుంచి వసూలు చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ గొప్పదనం, తెలంగాణ గొప్పతనం ఇక్కడున్న వారికి అర్థం కాదన్నారు. తెలంగాణలో మౌలిక సదుపాయాలను చూసి మహారాష్ట్ర బిల్డర్స్ ఆశ్చర్యపోతున్నారన్నారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడంతో నగరంలో సంపద పెరుగుతోందన్నారు.
Brs
కొమురంభీం జిల్లా దహేగం మండలం తెనుగుపల్లె లో బి.ఆర్.ఎస్ అభ్యర్థి కోనేరు. కొనప్పకు గ్రామస్థుల నుంచి చేదు అనుభవం ఏదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ గ్రామానికి వెళ్లిన కొనప్పను గ్రామస్థులు అడ్డుకోవడంతో ప్రచారం చేయకుండానే వెనుదిరిగారు. గత ఎన్నికల సమయంలో గ్రామానికి వచ్చిన కొనప్ప తాను గెలిస్తే రోడ్డు వెయిస్తా అని చెప్పి నేటికి కూడా రోడ్డు వెయ్యక పోవడంతో గ్రామస్థులు ఆగ్రహానికి లోనయ్యారు. తమ గ్రామనికి రోడ్డు వేయకుండా ఏ మొహం పెట్టుకొని మళ్ళీ ఓట్లు వేయమని వచ్చావు అంటూ నిలదీశారు.
నల్లగొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం నెల్లికల్ లిఫ్ట్ శిలాఫలకం వద్ద నల్గొండ జిల్లా బిజెపి అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇక్కడ 40 సంవత్సరాలుగా లిఫ్ట్ పేరు చెప్తూ ఇక్కడ ఉన్న గిరిజనులు మభ్యపెట్టి మోసం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 ఎలక్షన్స్ లో నెల్లికలు లిస్టు నీళ్లు పారియకపోతే మేము ఓట్లు అడగం అన్నారు. నోముల నరసింహయ్య మరణానంతరం వచ్చిన ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి నిల్లికలు ప్రాంతంలో శిలాఫలకం వేసి కుర్చీ వేసుకొని ఇక్కడ నీళ్లు పారిస్తానని హామీ ఇచ్చారు నీళ్లు పారించకుంటే ఓట్లు అడగం నా మంత్రులు మా ఎమ్మెల్యేలు ఎవరు కూడా మీ వద్దకు రారు అని మోసపూరితమైన మాటలు చెప్పి ఇప్పటివరకు ఎలాంటి పనులు మొదలు పెట్టలేదు ఉప ఎన్నికల సమయంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి 18 నెల లో నెల్లికల్ లిఫ్టు పూర్తికాకపోతే నా మంత్రి పదవికి రాజీనామా చేసి ఓట్లు అడగం అని చెప్పారు ఎక్కడ పోయాడు మంత్రి జగదీశ్వర్ రెడ్డి . అలాగే ముఖ్యమంత్రి గారికి కుర్చీ దొరకక ఇక్కడ రావడం లేదు అని మేమే కుర్చీ వేసి పెట్టినాము ఈరోజు హాలియాకి ప్రజా ఆశీర్వాద సభకు వస్తున్న ముఖ్యమంత్రి గారు ఇక్కడ కుర్చీలో కూర్చొని నీళ్లు పారించవలసిందిగా మా విజ్ఞప్తి.
Read Also..
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే దౌల్తాబాద్ అభివృద్ధి, సంక్షేమం జరిగిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్ జిల్లా దౌలతాబాద్‌లో నిర్వహించిన విజయభేరి యాత్రలో మాట్లాడారు. డబుల్ బెడ్రూం, దళితులకు మూడెకరాలు, కాలేజీలు తెస్తామని బీఆరేస్ నేతలు చెప్పారు. కానీ పదేళ్లలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని తెలిపారు. మహిళలకు ప్రతీ నెలా రూ.2500 అందిస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన పాల్గోన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…చంద్రబాబుకు మరో పది పదిహేనేళ్లు రాజకీయం చేసే సామర్థ్యం ఉందన్నారు. ఆయనకు వయస్సేమీ అయిపోలేదని, మోదీ కంటే ఆయన చిన్నవారే అన్నారు. చంద్రబాబు అరెస్ట్ విషయంలో తను చేసిన వ్యాఖ్యలు జనంలోకి తఫ్పుగా వెళ్లాయన్నారు. శాంతిభద్రతల విషయంలో తప్పక బాబు అరెస్ట్ నిరసనలు హైదరాబాద్ లో చేయవద్దని…అది పక్క రాష్ట్రం వ్యవహారం అని చెప్పానన్నారు. చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, ఏపీ సీఎం జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో తరుచూ టచ్‌లో ఉంటానన్నారు. చంద్రబాబు విషయంలో లోకేశ్ ఆవేదనను తాను అర్థం చేసుకున్నానని తమ మధ్య సోదర భావమే ఉందన్నారు.
వికారాబాద్ జిల్లాలోని కుల్కచర్లలో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా ఓట్లు అడిగే ముందు గతంలో ఏం చేశారో, గెలిస్తే ఏం చేస్తారో చెప్పాలన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ కు పట్టం కడితే నాలుగు కొత్త కార్యక్రమాలు తెస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.కేసీఆర్ బీమా పేరుతో రూ.5 లక్షలు అందిస్తామన్నారు.సౌభాగ్యలక్ష్మి కింద 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలకు నెలకు రూ.3 వేలు అందించడంతో పాటు తెల్ల రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఇంటికి సన్నబియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. అలాగే అసైన్డ్ భూములపై సంపూర్ణ హక్కులు కల్పిస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా భవిష్యత్ లో కేసీఆర్ భరోసా కింద మరిన్ని కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు.హనుమంతుని గుడి లేని ఊరు లేదన్న కేటీఆర్ బీఆర్ఎస్ సంక్షేమం అందని ఊరు కూడా లేదన్నారు
జనగామ జిల్లా పాలకుర్తి ఎన్నికల ప్రచారంలో BRS పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి దయాకరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలు నాకు ఓట్లేసిన వారికే ఉద్యోగాలు ఇప్పిస్తానన్నారు.ఎన్నికల ప్రచారంలో మంత్రి ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘వర్ధన్నపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఊరూరా ఉద్యోగాలు ఇప్పించానని,జనరల్ లో ఇప్పించానని ఇప్పుడు అలా కాదని ఓటేసిన వాళ్లకే ఉద్యోగాలు ఇప్పిస్తానన్నారు.
BRS అభ్యర్థి పువ్వాడ ఆఫిడవిట్ సరైన ఫార్మాట్ లో లేదని తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల సంఘం కు ఫిర్యాదు చేశారు. ఖమ్మం మీడియా సమావేశం లో తుమ్మల మాట్లాడారు. ఫార్మాట్ మార్చడం పై రిటర్నింగ్ అధికారికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశానని , రిటర్నింగ్ అధికారి తీరుపై ఎన్నికల సంఘంకు , న్యాయస్థానం లో పిర్యాదు చేస్తానని ఎన్నికల సంఘం ఇచ్చిన ఫార్మెట్ లో కాకుండా BRS అభ్యర్థి పువ్వాడ ఫార్మాట్ మార్చి ఇచ్చారున్నారు.
అఫిడవిట్ లో డిపెండెంట్ కాలమ్ లో ఎవ్వరు లేకపోతే నిల్ అని రాయకుండా మార్చారన్నారు. నాలుగు సెట్స్ నామినేషన్లలో తప్పులు ఉన్నాయని, ప్రిస్క్రైబ్ ఫార్మాట్ లో లేకపోతే నామినేషన్ రిజెక్ట్ చేయాలని రిటర్నింగ్ అధికారిని అడిగానని ఆర్ ఓ ఎన్నికల నిబంధనలు పాటించడంలేదని, ఆర్ ఓ పై న్యాయ పోరాటం చేస్తానని తుమ్మల తెలిపారు.
ఎమ్మెల్యే సీతక్క ములుగు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మంత్రి హరీశ్ రావుపై సీతక్క మండిపడ్డారు. అగ్గిపెట్టె దొరకని హరీశ్ రావు ఇప్పుడు కారుకూతలు కూస్తున్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘సీతక్క మంత్రి అవుతుందట’ అంటూ ఎద్దేవా చేస్తున్నాడని విమర్శించారు. ‘ఏ.. నేను మంత్రిని కావొద్దా? నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవద్దా’ అని మంత్రిని నిలదీశారు. బీఆర్ఎస్ నేతలకు బడుగుబలహీన వర్గాలంటే గిట్టదని సీతక్క ఆరోపించారు. ములుగులో తనను ఓడించేందుకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు, కేటీఆర్ లు నియోజకవర్గంలో డబ్బులు వెదజల్లుతున్నారని ఆరోపించారు. నోట్ల కట్టలతో ప్రజలను కొనాలని చూస్తున్నారు కానీ ములుగు ప్రజలు అమ్ముడుపోరనే విషయం వారికి తెలియదన్నారు. బీఆర్ఎస్ నేతలు ఇచ్చే డబ్బులు తీసుకోవాలని ఓటర్లకు ఆమె సూచించారు. వాళ్లు పంచే డబ్బంతా గత పదేళ్లలో ప్రజల నుంచి దోచుకున్నదేనని చెప్పారు. వారిచ్చే డబ్బులు తీసుకుని ఓటు మాత్రం తనకే వేయాలని విజ్ఞప్తి చేశారు.