రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలం పెద్దమ్మతండా, దావుద్ గూడతండా, పులిమామిడి, దన్నారం, చిప్పలపల్లి, మురలీనగర్ గ్రామాలలోఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న _తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. అడుగడుగున జననీరాజనంతో ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు. భారీగా హాజరైన గ్రామవాసులు.మేమంతా మీతోనే మీకు అండగా ఉంటామని ముక్తకంఠంతో పలికిన గ్రామాల ప్రజలు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందింది అంటే అది కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంతోనే అన్ని రంగాలను అభివృద్ధి పరచుకుంటూ ముందుకెళ్తున్నామన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ని మరొకసారి ఆశీర్వదించి ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి చేయాలని, అదే విధంగా మహేశ్వరం నియోజకవర్గం గడిచిన నాలుగున్నర సంవత్సరాల కిందట ఎట్లా ఉండే ప్రస్తుతం ఇప్పుడు ఎట్లా ఉందో ఆలోచించాలన్నారు. అభివృద్ధి చేశాను మరింత అభివృద్ధి కోసం మీ సబితమ్మను ఆశీర్వదించి మరొకసారి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు పరుస్తున్నామని మరింత అభివృద్ధి కోసం మరొకసారి బిఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేసి దీవించవలసిందిగా పేర్కొన్నారు.
Brs
తెలంగాణ అభివృద్ధి చెందాలంటే నరేంద్రమోదీ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల కోసం పని చేసే నాయకుడు ఎవరనేది గమనించి ఎన్నుకోవాలన్నారు. బీజేపీ విడుదల చేసే మేనిఫెస్టో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుందని వెల్లడించారు. బీఆర్ఎస్, మజ్లిస్, కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాయని ఆరోపించారు. అందుకే ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి, టీపీసీసీ చీఫ్ రేవంత్ స్టేషన్ ఘనపూర్ లో తనపై చేసిన విమర్శల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. జాఫర్గడ్లో జరిగిన పార్టీ సమావేశంలో కడియం మాట్లాడుతూ…2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఇందిర తమ పార్టీ ఎమ్మెల్యే రాజయ్య చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయిందని గుర్తుచేశారు. ఇందిర నియోజకవర్గంపై ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతోందని అన్నారు. ఇందిర ఒక్కరికి కూడా సాయం అందించలేదన్నారు. కానీ కడియం ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు చేయూతనిస్తున్నట్లు చెప్పారు. తనపై ఎలాంటి కేసులు లేవని, కానీ రేవంత్ రెడ్డి, ఇందిరలపై ఉన్నాయన్నారు. ఇందిరపై ఇక్కడ చీటింగ్ కేసు నమోదు అయిందని, ఆ కేసు సుప్రీంకోర్టులో ఉందన్నారు. నియోజకవర్గంలో ప్రజలకే అందుబాటులో ఉండని ఇందిరకు ఇక్కడి ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయి? అని ప్రశ్నించారు. నియోజకవర్గంలోని ప్రజలు, మాదిగలపై ఇందిరకు ప్రేమ ఉంటే ఆమె ఆస్తులు రాసివ్వాలని సవాల్ చేశారు. ఆమె తన ఆస్తులను రాసిస్తే మరుక్షణమే తానూ రాసిస్తానన్నారు. రేవంత్ రెడ్డి ఓ గజదొంగ అన్నారు.
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం చింతల్ డివిజన్ లో శివ నగర్, శ్రీ సాయి కాలనీ, రంగా నగర్, సాగర్ అపార్ట్మెంట్స్, సిరి టవర్స్ లలో బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ విస్తృత ప్రచారం చేశారు. బీజేపీ సీనియర్ నేత సదానంద్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ నగర్ కు చెందిన పలువురు యువకులు బీజేపీలో చేరారు. బీజేపీ కండువా కప్పి ఆహ్వానించారు. పలు కాలనీ సంక్షేమ సంఘాలు, అపార్ట్మెంట్స్ అసోసియేషన్ లు, కాలనీ పెద్దలతో సమావేశమయ్యారు. చింతల్ డివిజన్ ను టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అభివృద్ధి చేయడంలో విఫలమయ్యాడన్నారు. భగత్ సింగ్ నగర్ మల్టి పర్పస్ ఫంక్షన్ హల్ ను ఇప్పటికీ ప్రజలకు అందుబాటులోకి తేలేదని మండిపడ్డారు. 2018 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. బీజేపీ ని గెలిపిస్తే చింతల్ డివిజన్ లో మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కు సీఎం కేసీఆర్ రానున్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి సభా ఏర్పాట్లు పరిశీలించారు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం అభివృద్ధి కి ముఖ్యమంత్రి సహకరిస్తున్నారని , ఇబ్రహీంపట్నం లోని అనేక కంపెనీలు రావడం వలన ఎంతో అభివృద్ధి చెందుతుందని , సాగర్ రోడ్డు వైపు సాఫ్టువేరు కంపెనీలు రావడం తో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రానున్నాయని , ఫార్మాసిటీ , శివన్న గూడ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా ఇబ్రహీంపట్నం మరింత అభివృద్ధి చెందుతుందని మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు . ఇబ్రహీంపట్నం కేంద్రంలో భారీ బహిరంగ సభకు ప్రజలు భారీఎత్తున తరలిరావాలని , కేసీఆర్ ఇచ్చే ప్రసంగం వినాలని , ఇబ్రహీంపట్నం అభివృద్ధి కి చేయడం కోసం ముఖ్యమంత్రి వస్తున్నారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు.
రేవంత్ రెడ్డి స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయభేరి యాత్రలో పాల్గొన్నారు. కేసీఆర్ సీఎం, రాజయ్య ఎమ్మెల్యే అయ్యాక ఆడబిడ్డలకు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలేని పరిస్థితి ఏర్పడిందని రేవంత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే రాజయ్య, బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి మహిళలకు గౌరవం ఇవ్వాలని సూచించారు. వీరిద్దరి గురించి మనం పెద్దగా చెప్పవలసిన పని లేదన్నారు. శ్రీహరి గురించి రాజయ్య, రాజయ్య గురించి శ్రీహరి చెప్పారన్నారు. వీళ్లిద్దరికీ ఓ సారూప్యత ఉందని, వీరిద్దరూ ఉపముఖ్యమంత్రులుగా పని చేసి ఉద్యోగం ఊడగొట్టుకున్నారన్నారు. వీరి గురించి కేసీఆర్కు తెలుసు కాబట్టే ఉద్యోగం ఊడగొట్టారన్నారు. ఇలాంటి వారిని ఎమ్మెల్యేలుగా ఎన్నుకుందామా? అన్నారు. ఈ పదేళ్లలో వారు సరిగ్గా పాలన అందిస్తే, ఇచ్చిన హామీలు అమలు చేస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేదా? అన్నారు. కేసీఆర్ కేబినెట్లో మాదిగ సామాజిక వర్గానికి, మహిళలకు సరైన ప్రాధాన్యత లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నలుగురు మహిళా మంత్రులు ఉంటారన్నారు.
రానున్న ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానం హాట్ సీట్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బీఆర్ఎస్ పార్టీ నుండి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎన్నికల బరిలో నిలవడంతో అందరి దృష్టి ఖమ్మం మీదే ఉంది . ఖమ్మం లో తెలుగు తమ్ముళ్లు సైతం తుమ్మల కు జై కొడుతున్నారు . బెదిరింపులు, కబ్జాలు లేని ఖమ్మం కావాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యం అంటున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో మా ఖమ్మం జిల్లా ప్రతినిధి సంతోష్ ఫేస్ టూ ఫేస్ ..
ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం ఎదులాపురంలో ఎన్నికల ప్రచారంలో పాలేరు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు. వీరికి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఈ గ్రామంలో ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ నేను చేసేదే చెబుతా, చెప్పిందే చేస్తా, అబద్ధం చెప్పనని అన్నారు. నిన్నటి దాకా కేసీఆర్ దేవుడని, రాజకీయాల కోసం సీటు ఇవ్వలేదని ఇప్పుడు దెయ్యం అంటున్నారని అన్నారు. నేను కూడా 2018 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుండి అన్ని పార్టీల సహాయంతో గెలిచానని ఎన్నడూ ఏ మాత్రంని తిట్టలేదని అన్నారు. నేను లోకల్ వాడిని అని, వ్యాపార నిమిత్తం హైదరాబాద్ వెళ్లి వస్తుంటానని, నన్ను నాన్ లోకల్ అంటున్నారు. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి లోకల్ వాడు కాదని అన్నారు. కొందరు బయట వ్యక్తులు వచ్చి డబ్బులతో ఓటర్లని కొనాలని చూస్తున్నారు. ఈ ఎదులాపురం బొడ్డు రాయి దగ్గర కూర్చుందాం, ఎవరు ఎన్ని సార్లు వచ్చారు, ఎవరు ఏమీ అభివృధి చేశారో చూద్దామని అన్నారు. రాత్రికి రాత్రి పార్టీ మారి కాంగ్రెస్ వాళ్లు కమల్ హాసన్, నటరాజ్ లాగా యాక్షన్ చేస్తున్నారని అన్నారు. కావున ఈ గడ్డ బిడ్డనైనా నన్ను కారు గుర్తుపై ఓటు వేసే నన్ను గెలిపించాలని ఆయన అన్నారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలో బిఆరెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య ఎన్నికల ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు..ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ సంక్షేమ రాజ్యాన్ని తెలంగాణాని కేసిఆర్ అందించారు అది కొనసాగాలి అంటే బిఆరెస్ కు ఓటు వెయ్యాలని, గత మూడు సార్లు తెలుగుదేశం పార్టీ నుండి గెలుపోందాను, నాల్గోసారి బిఆరెస్ తరుపున బరిలో ఉన్నానని, తెలుగుదేశం పార్టీ లో చిట్ట చివరి వరకు పార్టీ లో కొనసాగను కొని అనివార్య కారణాలు సంక్షేమం కోసమే పార్టీ మారాను అని తెలిపారు. కిష్టారం గ్రామం సింగరేణి ప్రాభవిత ప్రాతం, సింగరేణి వలన ఇక్కడ ప్రజలు నష్టపోతున్నారని అని అధికారంలోకి వచ్చాక సింగరేణి యాజమాన్యం మేడలు వంచి అయిన సమస్య పరిష్కారిస్తా అని హామి ఇచ్చారు. బిఅరెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సంక్రాంతి లోపు దళిత బందువు ఇస్తాం అని కిష్టారం గ్రామం నుండే శ్రీకారం చూట్టి దళిత బందువు రాజకీయల అతీతంగా ఇస్తాం అని లేని యేడల పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు అడగాను అన్నారు. బిఆరెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పధకాలు దృష్టి లో పెట్టుకొని కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
బీఆర్ఎస్ అంటే కేసీఆర్ ఫ్యామిలీ వికాస్ అని.. కాంగ్రెస్ అంటే గాంధీ ఫ్యామిలీ వికాస్ అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శలు గుప్పించారు. కుటుంబ ప్రయోజనాల కోసం తప్పితే ఈ రెండు పార్టీలు ప్రజల మంచి కోరదన్నారు. కేసీఆర్కు సీఎంగా అవకాశం ఇస్తే అడుక్కునే పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారని మండిపడ్డారు. బై ఎలక్షన్ వస్తే కుర్చీ అక్కడే వేసుకున్న కేసీఆర్ ఆ తర్వాత ముఖం చాటేశారన్నారు. ఇప్పుడు హెలికాప్టర్ వేసుకుని వేట కుక్కల్లాగా ఓట్లు అడుక్కుంటున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ కార్డులు కూడా ఇవ్వలేని పరిస్థితిలో బీఆర్ఎస్ సర్కార్ ఉందన్నారు. అంటే ఆగడు.. పంటే లేవడు… అంటూ ఎద్దేవా చేశారు. 10 ఏంళ్లలో చేయని అభివృద్ధి 10 రోజుల్లో చేస్తారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఫక్తు రాజకీయాలతో తెలంగాణ ఆగమవుతోందన్నారు. కాంగ్రెస్ 70 ఏండ్లు అధికారంలో ఉండి గరీబ్ హఠావో.. ఇందిరమ్మ ఇండ్లు అని నినాదాకే పరిమితమైందన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై కోడి గుడ్డు మీద ఈకలు పీకినట్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ పరిస్థితి మారిందని వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు పార్టీల డీఎన్ఏ అవినీతి మాత్రమే అని అన్నారు. పూటకో అవినీతికి పాల్పడుతున్నాయని ఎంపీ ఆరోపించారు.