మెదక్ నియోజకవర్గంలోని ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ సభలో కాంగ్రెస్ ను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టన పార్టీ కాంగ్రెస్ అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణను ఆంధ్రలో కలిపిందే కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. 50ఏళ్లు కాంగ్రెస్ పాలించినా నీళ్లు రాలేదన్నారు. కాంగ్రెస్ వస్తే మళ్లీ భయంకరమైన పరిస్థితులు వస్తాయని తెలిపారు. రైతుబంధును పుట్టించిందే బీఆర్ఎస్ అని రైతుబంధు దుబారా అని కాంగ్రెస్ నేతలంటున్నారన్నారు. ఇక రైతుబంధు ఉండాలా? వాద్దా ? అనేది ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తారని ధరణి పోతే దళారులు, పైరవీకారులు వస్తారని మండిపడ్డారు. ఎన్నికలు రాగానే ఆగమాగం కావోద్దని గత ప్రభుత్వ వైఖరి, ఈ ప్రభుత్వ వైఖరేంటో ఆలోచించి ఓటేయండని సూచించారు.
Brs
సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బౌద్దనగర్ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ కంది శైలజతో కలిసి పద్మారావు గౌడ్ విస్తృతంగా పర్యటించారు. జామే ఉస్మానియా, ఈశ్వరీబాయి నగర్, ఎల్ నారాయణ నగర్, అంబర్ నగర్, బౌద్ధనగర్, సంజయ్ గాంధీ నగర్ తదితర ప్రాంతాల్లో పద్మారావు గౌడ్ పర్యటనకు
ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. కార్యకర్తలతో పాటు స్థానిక ప్రజలు కూడా ఆయనను అడుగడుగునా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా
పద్మారావు గౌడ్ మాట్లాడుతూ గతంలో తాము చేపట్టిన వివిధ శాశ్వత చర్యల వల్ల ప్రజలు భారీ వర్షాల వల్ల ఇబ్బంది పడే పరిస్థితులు తప్పాయని, సికింద్రాబాద్ పరిధిలో పలు ప్రధాన నాలా ల వెడల్పు, కల్వర్టుల పునర్నిర్మాణం వంటి పనులను చేపట్టామని తెలిపారు. సికింద్రాబాద్ పరిధిలో కరోనా నివారణ చర్యలను నిరంతరం తీసుకొని ప్రజలకు అండగా నిలిచామని తెలిపారు. నిరంతరం ప్రజల సమస్యలను తీర్చేందుకు సితాఫలమండీ లో తమ కార్యాలయం ఏర్పాటు చేసుకొని నిజాయితీగా ప్రజలకు సేవలను అందించే సిబ్బందిని ఈ కార్యాలయంలో నియమించుకున్నామని తెలిపారు. ప్రజలకు అందుబాటులో నిలిచిన తమకే ప్రజలను ఓటు అడిగే హక్కు ఉందని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు.
ఉమ్మడి వరంగల్ లోని 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో బరిలో నిలిచిన 216 మంది అభ్యర్థులు వరంగల్ తూర్పులో పోటీ నుంచి తప్పుకున్న బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి రాజనాల శ్రీహరి. వరంగల్ తూర్పు సెగ్మెంట్లో పోటీలో నిలిచిన 29 మంది అభ్యర్థులు. పరకాల బరిలో 28 మంది అభ్యర్థులు. వర్ధన్నపేట బరిలో 14 మంది అభ్యర్థులు. నర్సంపేట బరిలో 19 మంది అభ్యర్థులు. జనగామ బరిలో 19 మంది అభ్యర్థులు. పాలకుర్తి బరిలో 15 మంది అభ్యర్థులు. స్టేషన్ ఘనపూర్ బరిలో 19 మంది అభ్యర్థులు. ములుగు బరిలో 9మంది అభ్యర్థులు. భూపాలపల్లి సెగ్మెంట్ బరిలో 23 మంది అభ్యర్థులు. మహబూబాబాద్ సెగ్మెంట్ బరిలో 12మంది అభ్యర్థులు. డోర్నకల్ సెగ్మెంట్ బరిలో 14మంది అభ్యర్థులు. వరంగల్ పశ్చిమ బరిలో 15మంది అభ్యర్థులు. వరంగల్ పశ్చిమ నుండి నామినేషన్ ఉపసంహరించుకున్న ఏఐఎఫ్ బీ అభ్యర్థి జంగా రాఘవరెడ్డి.
రాష్టంలో సీఎం కేసీఆర్ ను మ్యాచ్ చేసే లీడర్ లేడని, దక్షిణ భారతదేశంలో హ్యాట్రిక్ సీఎం గా కేసీఆర్ రికార్డ్ కొట్టబోతున్నారన్నారు హరీష్ రావ్. మంత్రి హరీశ్ రావు మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ విద్య అంటే చాలా మంది స్కూళ్లు, విద్యా శాఖ బడ్జెట్ మాత్రమే చూస్తారు కానీ.. వైద్య శాఖ ద్వారా మెడికల్ కాలేజీలు, ఫారెస్ట్ యూనివర్సిటీ, హర్టికల్ యూనివర్సిటీ, ఫిషరీస్ యూనివర్సిటీ వంటివి కూడా విద్య కు చేసే ఖర్చుగా చూడాలి అన్నారు. వైద్య రంగాన్ని బలోపేతం చేశామని, అన్నిస్థాయిల దవాఖానాల్లో సదుపాయాలు కల్పించామన్నారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ తెచ్చామని, మళ్ళీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్య,విద్యా రంగాలను మరింత బలోపేతం చేయడంతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వసతుల కల్పనపై దృష్టి పెట్టాలని భావిస్తున్నామన్నారు మంత్రి హరీష్ రావ్.
Read Also..
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గల్లో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని పార్టీల నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రజలు ప్రస్తుత సర్కారును మళ్లీ అధికారంలో తెస్తారా లేక కొత్త ప్రభుత్వానికి పట్టం కడతార అన్నది తెలియాల్సి ఉంది. ఈ నెల 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.
ప్రజలు గర్వపడేలా ఎల్లారెడ్డి, కామారెడ్డిలను అభివృద్ధి చేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఎల్లారెడ్డి అభ్యర్థి జాజుల సురేందర్‌ను ఎన్నికల్లో ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మన దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిపోయినా ప్రజాస్వామ్యంలో రావాల్సినటువంటి పరిణితి ఇంకా రాలేదన్నారు. ఏ దేశాల్లో అయితే వచ్చిందో ఆ దేశాలు బ్రహ్మాండంగా దూసుకుపోతున్నాయన్నారు. ఎలక్షన్లు చాలా వచ్చాయి. పోయాయని ఇది మామూలుగా జరిగే విషయమేనన్నారు. అది కాకుండా రెండు విషయాలపై ప్రజలు గట్టిగా నిర్ణయిస్తే. చాలా మంచి జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. ఎన్నికల్లో అభ్యర్థి గుణం, గణం మంచీ చెడు, వ్యక్తిత్వంపై ప్రజలు ఆలోచన చేయాలని సూచించారు.
రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలదే హవా ఉంటుంది.. ఈ జాతీయ పార్టీల హవా ఉండదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. 2024 తర్వాత దేశంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని.. ఏక పార్టీ ప్రభుత్వం రాదని తెలిపారు. అన్ని ఎంపీలు మనం గెలుచుకుంటే బీఆర్ఎస్ తడాఖా అప్పుడు ఢిల్లీలో చూపెడుదామని కేసీఆర్ చెప్పారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నామని… హిందూ, ముస్లిం, క్రైస్తవులు అనే తేడా లేకుండా అన్ని మతాల ప్రజలను కలుపుకొని పోతున్నామని ఈ నేపథ్యంలో ఆయన తెలిపారు. ప్రతి స్కీంలో అందరం భాగస్వామ్యం అవుతున్నామని అందరం సోదరుల్లా కలిసి ఉండి మొత్తం ప్రపంచానికి ఉదాహరణగా ఉంటున్నామన్నారు. పదేళ్లలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా కర్ఫ్యూ లేదు, కల్లోలం లేదన్నారు కేసీఆర్. లా అండ్ ఆర్డర్ పటిష్టంగా మెయింటెన్ చేస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ముమ్మాటికి సెక్యులర్ పార్టీ అని కేసీఆర్ స్పష్టం చేశారు.
Read Also..
Read Also..
మెదక్ జిల్లా లో ఈనెల 16 న నర్సాపూర్ లో నిర్వహించే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లు మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. హెలిప్యాడ్, సభ వేదిక, సభా ప్రాంగణం ఏర్పాటు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, పెద్ద సంఖ్యలో తరలి వచ్చే పార్టీ శ్రేణులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించిన మంత్రి హరీశ్ రావు సూచించారు.
ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలో సండ్ర వెంకట వీరయ్య,రాజ్యసభ సభ్యులు బండి పార్దసారధిరెడ్డి కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా బిఆరెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర మాట్లాడుతూ బిఆరెస్ పార్టీ గెలిచిన తరువాత సత్తుపల్లి నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేసే విషాయాలను మండలాల వారిగా వెల్లడించారు.. కేసిఆర్ ప్రమాణ స్వీకారం చేసిన వేంటనే క్రిష్టమస్ లోపు సత్తుపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా దళితబందు అమలు చేస్తాం అని అలా చేయ్యకపోతే పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు అడగాం అని తెలిపారు. పది జిల్లాలను 30 జిల్లాలు చేసిన ఘనత కేసిఆర్ దే అలానే కేసిఆర్ సారధ్యంలో సత్తుపల్లి, అశ్వారావుపేట రెండు కలుపుతూ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తాం అని హామి ఇచ్చారు.. ప్రత్యర్దులు బెట్టింగ్ లు ఉసి కలుపుతున్నారని, విష ప్రయోగాలు చేస్తూ కాంగ్రెస్ కు ఇంత మెజారిటీ వస్తుందని అప్పుడే బుకీలను ఏర్పాటు చేసి కుట్ర రాజకీయాలు చేస్తూరని కుట్ర రాజకీయాలకు ప్రత్యర్ధులు తెరలేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు… సామాజిక వర్గాలను రెచ్చగొడ్డి ఊసిగొల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు…నేను ప్రచారానికి వెళితే కావాలని కొంతమందిని పంపి అడ్డుకునేలా చేసి సోషల్ మీడియా పోస్ట్ లు పెట్టి ఆనందం పడుతున్నారు…నేను ఇలాంటి పని చెయ్యాల్సి వస్తే ఒక్కరు కూడా ప్రచారానికి వెళ్ళాలేరు. ఇలాంటి సంకృతి దూరంగా ఉండి ప్రజల మనల్నిపొంది గెలవాలి కానీ కుట్ర రాజకీయాలు తప్పుడు పద్దతిలో చిల్లర వ్యహరంలో రాజకీయాలు చేయ్యోద్దని ప్రత్యర్ధులు హెచ్చారించారు.. అలానే గత ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని నన్ను గెలిపించలేదు సైనికుడిగా పని చేశా కాబట్టే గెలిపించారని తెలుగుదేశం పార్టీ లో చివర వరకు ఉన్న నాయకుడిన్ని నేను అని వెల్లడించారు. తెలుగుదేశం జెండా కట్టాని వాళ్ళు చంద్రబాబు జైల్ కి వెళితే మాట్లాడని వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తల వెంట పడుతున్నారని ప్రత్యర్ధి పార్టీ పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
Read Also..
రాష్ట్రమంతా పింక్ వేవ్ కనిపిస్తోందని, మూడో సారి సీఎం కేసీఆర్ అధికారంలోకి పచ్చి దక్షిణాదిన తొలిసారి హాట్రిక్ సాధించి రికార్డు సృష్టిస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు స్పష్టం చేశారు. ప్రజలు గర్వంగా కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ ను గెలిపించాలన్న ఆశతో ఉన్నారని చెప్పారు. “సీఎం కేసీఆర్ అంటే అభివృద్ధికి గుర్తు. కేసీఆర్ అంటే ప్రేమకు పరాకాష్ట. ” అని వ్యాఖ్యానించారు. గులాబీ జెండా ఎత్తి తెలంగాణ ఉద్యమానికి బయలుదేరినప్పుడు ఇదే కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎక్కడున్నారని ప్రశ్నించారు. అందరూ పిడికిలి ఎత్తి ఉద్యమం చేస్తున్నప్పుడు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బందూక్ పట్టుకొని ప్రజల మీదకి పచ్చిన విషయాన్ని మరిచిపోతారా అని అడిగారు. రైతుబంధును రైతులకు బిచ్చమేస్తున్నామని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని, పెన్షన్లు, బీమా వృధాగా ఇస్తున్నామని కూడా అంటున్నారని, అధికారంలో లేనప్పుడే ఇంత అహంకారంతో మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ రేపు పొరపాటున అధికారంలోకి వస్తే కనీసం ప్రజలను పట్టించుకుంటారా అన్నది ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ అంటే ఆత్మీయత అని, కాంగ్రెస్ పార్టీ అంటే అహంకారం అని తెలిపారు. గ్రామల్లో తెలంగాణ అభివృద్ధిపై చర్చించాలని కోరారు. ఉమ్మడి పాలనలో ఒక్క ప్రభుత్వమైనా రైతుల గురించి ఆలోచించి ఒక్క పైసా అయినా ఇచ్చిందా అని అడిగారు. లక్షలాది పేద ఇంటి ఆడబిడ్డల కోసం కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నామని, గతంలో ఎవరైనా ఈ ఆలోచన చేశారా అని అడిగారు. మరి ఏమీ చేయని ఎందుకూ పనికిరాని వాళ్లు, ఒక్క నీటి బొట్టును కూడా ఇవ్వనివాళ్లు ఇవాళ సీఎం కేసీఆర్ మీద తొడగొడుతాం, మెడ కోసుకుంటామని మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తొడగొడితేనో, మెడ కోసుకుంటేనో సీఎం కేసీఆర్ మీద గెలవడం అయ్యే పనికాదని తేల్చిచెప్పారు. సీఎం కేసీఆర్ మీద గెలవాలంటే నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల గుండెల్లో చోటు సంపాదిస్తేనే అది సాధ్యమవుతుంది తప్పా ఉట్టిగా అయ్యే పనికాదని స్పష్టం చేశారు. బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గతంలో సాగునీటి శాఖ మంత్రిగా పనిచేసినా కూడా ఒక్క చెరువును మరమ్మత్తు చేయలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ నిజాం సాగర్ కాలువల ఆధునీకరణకు కృషి చేశారని, ఎన్నో చెరువులను బాగు చేసుకున్నామని, చివరి ఆయకట్టుకు కూడా నీళ్లు పచ్చేలా పని చేసుకున్నామని తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ సు భారీ మెజారిటీతో గెలిపించి సీఎం కేసీఆర్ కు బోధన్ ను బహుమానంగా ఇద్దామని పిలుపునిచ్చారు.