తెలంగాణలో పేదల పరిస్థితి దారుణంగా ఉందని, ఈ ధరలు, ఈ పాలనతో బతికే పరిస్థితి లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని జవహర్ నగర్లో ఆయన రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అందరినీ ఆదుకుంటామన్నారు. బీఆర్ఎస్ నేతలు మేడ్చల్‌కు ఐటీ పార్క్ తీసుకువస్తామని చెప్పారని, కానీ ఏమయిందో చెప్పాలన్నారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డు అంశంపై కోర్టుకు వెళ్లి ఆదేశాలు తీసుకువచ్చినా తరలించలేదన్నారు.
Brs
తాము మూడేళ్లు ఆలోచించి ధరణిని తీసుకువచ్చామని, అలాంటి ధరణిని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బంగాళాఖాతంలో వేస్తుందని, ఈ విషయం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీయే చెప్పారని ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. గురువారం అదిలాబాద్‌లో నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుబంధు కావాలా? రాబంధు కావాలా? ఏది కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. రైతుబంధుతో డబ్బులు దుబారా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారని మండిపడ్డారు. కానీ బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చాక రైతుబంధును విడతలవారీగా ఎకరాకు రూ.16 వేలకు పెంచుతామన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో ఈ నెల 19న తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు బీఆర్ఏస్ అధినేత కేసిఆర్ రానున్నట్లు ఎమ్మెల్యే అభ్యర్థి జైపాల్ యాదవ్ తెలిపారు.. ఈ రోజు బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించిన కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈనెల 19న ఆదివారం లక్ష మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని కల్వకుర్తి నియోజకవర్గం లోని ఎనిమిది మండలాలు, రెండు మున్సిపాలిటీ లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని కెసిఆర్ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరారు, ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ యడ్మ సత్యం, బిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Also..
ఆనాడు చెరువు ఎండిన నాడు టిఆర్ఎస్ పార్టీ మీతోనే ఉన్నది ఇవాళ చెరువు నిండిన నాడు కూడా బీఆర్ఎస్ పెట్టి మీతోనే ఉన్నదని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని బండాలింగాపూర్ గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సంజయ్ తో కలిసి ప్రచారం లో భాగంగా ఆమె మాట్లాడుతూ మరి ఎందుకు కేసీఆర్ కు ఓటు వేయాలి అని చాలామంది మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణ రాకముందు బండాలింగాపూర్ లోని పెద్ద చెరువు ఎలా ఉండేదని ఇవాళ ఎలా ఉందని , చెరువులు ఎండిపోయినప్పుడు కప్పలన్నీ చెరువును విడిచిపెట్టి కానీ చెరువులో చేప పిల్లలు ఉంటే చెరువు నిండిన ఎండిన అదే చెరువులో ఉంటాయని బ్రతికిన బ్రతుకుతాయి చచ్చిన చస్తాయి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళం చేపలాంటోల్లమని, కప్పలాంటి వాళ్లు కాంగ్రెస్ బిజెపి పార్టీ వాళ్ళని, కవిత అన్నారు. ప్రజలను ఒకటే కోరుతున్న మంచి నాయకుడు సంజయ్ అన్న మీరు కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే గా గెలిపించాలని కోరారు.
తెలంగాణ రాష్ట్రం సిద్ధించినా నిరుద్యోగ ఆశలు నెరవేరలేదని యువత భావిస్తోంది. అందుకే రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ కు బుద్ధి చెప్పేందుకు నిరుద్యోగులు సన్నద్ధమయ్యారు. నిరుద్యోగ యాత్ర పేరుతో యువత రాష్ట్రమంతటా పర్యటించి తెలంగాణా రాక ముందు కెసిఆర్ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదని ప్రజలకు వివరించనున్నారు. తెలంగాణా వచ్చిందే నీళ్లు, నియామకాల కోసమని, కానీ గులాబీ బాస్ ఆ రెండింటిని పూర్తిగా పక్కనపెట్టారని నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యలో నేటి నుంచి 26వ తేదీ వరకు నిరుద్యోగులు బస్సు యాత్ర చేయాలని తలపెట్టారు. హైదరాబాద్ గన్ పార్క్ నుంచి ప్రారంభమైన యాత్రను ఉద్దేశించి ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ పది సంవత్సరాల్లో కెసిఆర్ సర్కార్ ఉద్యోగ ప్రకటనలు ఆశించినంతగా చేయలేదని మండిపడ్డారు. మొక్కుబడిగా కొన్ని ఉద్యోగ నియామకాలు జరిపినా పేపర్ లీక్ కారణంగా విద్యార్థులు పూర్తిగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వచ్చేది మహిళలు, యువత కారణంగా అధికారంలోకి వస్తాయని చెప్పవచ్చు. కానీ కెసిఆర్ సర్కార్ యువత ఆశలను ఆడియాసలు చేయడంతో నిరుద్యోగులు మండిపడుతున్నారు. వీరందరూ మూకుమ్మడిగా గ్రామాల్లో పర్యటించి బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేస్తే ఈ ప్రభావం తప్పకుండా కెసిఆర్ పై పడుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
చెన్నూర్ లో బాల్క సుమన్ కు ఉస్మానియా విద్యార్థుల సెగ తగులుతోంది. తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మంది విద్యార్థులు సీఎం కేసీఆర్ వెన్నంట ఉప్పెనలా కదిలారు. అందులో ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి బాల్క సుమన్ ఒకరు. విద్యార్థి రాజకీయాల్లో కీలక భూమిక పోషించారు. అలాంటి బాల్క సుమన్ కు విద్యార్థి లోకం నిరసన తెలియజేస్తోంది. ఓయూలో ఆయనకు ఎదురుగాలి వీస్తోంది. యువ ఎమ్మెల్యేను ఓడించేందుకు ఓయు జేఏసీ సిద్ధమైంది. ఈ ఎన్నికలలో బాల్క సుమన్ ను ఓడించాలని ఓయూ జేఏసీ నేతలు పిలుపు నిచ్చారు. గుండా రాజకీయం చేస్తున్నాడని, నిరుద్యోగుల ఆత్మహత్యలకు బాల్క సుమన్ లాంటి ఎమ్మెల్యేలే కారణం మంటూ ఓయూ జేఏసీ ఆగ్రహాం వ్యక్తం చేస్తోంది. ఉద్యమ నాయకుడు అని చెప్పుకునే బాల్క సుమన్ కు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడ నుండి వచ్చాయని విద్యార్థి లోకం ప్రశ్నిస్తోంది. చెన్నూరు నియోజకవర్గంలో రౌడీ రాజకీయాన్ని అంతమొందించాలని విద్యార్థి లోకం పిలుపునిస్తోంది. విద్యార్థులు తలచుకుంటే ఎలాంటి నాయకుడుకైనా గెలుపోటములు నల్లేరు మీద నడకే అని అనటంలో ఎలాంటి సందేహం లేదు.
Read Also..
మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. రాత్రి పట్టణంలోని అయ్యప్ప టెంపుల్ సమీపంలో ప్రచారంలో భాగంగా నినాదాలు చేస్తూ ఎదురెదురైన బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరికి వారే నినాదాలు చేస్తుండడంతో సమయానికి పోలీసులు వచ్చి ఇరు వర్గాలను చెదరగొట్టడంతో వివాదం సద్దుమణిగింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావాలనే, తమను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని అడ్డుకొని తమపై తిడుతూ, అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.
ఎన్నికల వేళ అసంతృప్తి నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంప్ అవుతున్నారు. తాజాగా బోడుప్పల్ లో బీఆర్ఎస్ కు పార్టీకి షాక్ తగిలింది. బోడుప్పల్ కార్పోరేషన్ లో మంత్రి మల్లారెడ్డి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఐదుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేశారు. 23వ డివిజన్ కార్పొరేటర్ రాసాల వెంకటేష్ యాదవ్, ఒకటవ డివిజన్ కార్పోరేటర్ బింగి జంగయ్య యాదవ్,13వ డివిజన్ కార్పోరేటర్ దానగళ్ల అనితా యాదగిరి, 20వ డివిజన్ కార్పోరేటర్ జడిగే మహేందర్ యాదవ్,24వ డివిజన్ కార్పోరేటర్ గుర్రాల రమా వెంకటేష్ యాదవ్ లు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రెష్ యాదవ్, బోడుప్పల్ అధ్యక్షుడు పోగుల నరసింహ రెడ్డిల అధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు.
Read Also..
Read Also..
సనత్ నగర్ నియోజకవరంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ నీలిమ ఇంటింటి ప్రచారం బన్సిలాల్ పేట్ డివిజన్ లోని బలరాం కాంపౌండ్, పద్మారావు నగర్ హమాలి బస్తీలో నిర్వహించారు. ఈ సందర్భంగా కోటా నీలిమ మాట్లాడుతూ… నగరంలో అభివృద్ధి జరుగుతుంటే పద్మరావు నగర్ లో రోడ్లు, హమాలీ బస్తీ ఎందుకు అంత అధ్వనంగా ఉందని ప్రశ్నించారు. తిండికి లేని కేసీఆర్ కుటుంబానికి ఇవాళ లక్షల కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత ఆశపడిందని, కానీ వారి ఆశలపై కేసీఆర్ నీళ్లు చల్లారన్నారు. ఉద్యోగాలు రాక యువత ఆత్మహత్యలు చేసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. తెలంగాణ సాధించింది ఇందుకేనా? అని ప్రశ్నించారు.
ఎన్నికల సమయంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి.. అధికార పార్టీ నేతలే టార్గెట్ గా ఐటీ దాడులు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది.. మిర్యాలగూడ బీఅర్ఎస్ పార్టీ అభ్యర్థి తాజా మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు బినామీగా ఉన్న కాంట్రాక్టర్ వింజమూరి శ్రీధర్ ఇంటిపై తెల్లవారుజామునుండే ఐటీ దాడులు మొదలయ్యాయి. స్థానిక వైదేహి టౌన్షిప్ లో ఉన్న ఆయన నివాసంలో అధికారులు సోదాలు జరుపుతున్నారు.. దీంతోపాటు భాస్కర్ రావుకు సంబంధించిన రంగా రంజిత్ రంగా శ్రీధర్ బండారు కుశలయ్య నివాసాలలో కూడా ఐటి అధికారులు విస్తృతంగా తనిఖీలు జరుపుతున్నారు. సాగర్ నియోజకవర్గం లోని త్రిపురారం మండలం ముకుందాపురం సాల్వెంట్ ఆయిల్ మిల్లులో నిడమనూరు మండలం శాఖాపురం లో గల భాస్కర్ రావు నివాసంలో కూడా ఐటి అధికారులు సోదాలు జరుపుతున్నారు. 40 మంది అధికారులు బృందాలుగా విడిపోయి ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు.
Read Also..