కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని మారేడుపల్లి కాలనీలలో డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలను జరిగిన అవకతవకలను సాక్షాదారులతో సహా బయటపెట్టిన బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ నిజమైన లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూములు మంజూరు చేయకుండా లక్షల రూపాయల మధ్యవర్తులతో దండుకున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే స్వర్గీయ సాయన్న కూతుర్లు ఎంత అవినీతికి పాల్పడ్డారని ఈ దుస్థితి తీసుకువచ్చి రోడ్డున పడేసిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటు వేయమని కుండ బద్దలు కొట్టిన స్థానిక ప్రజానీకం రోజు కూలికి పోతేనే పుట్ట గడిచే పరిస్థితులలో ఉన్న మా పొట్ట కొట్టి లక్షల రూపాయలు డబుల్ బెడ్ రూమ్ ఇప్పిస్తామని వసూలు చేసిన వారితో పాటు డబ్బులు ఇచ్చిన వారికే డబల్ బెడ్రూంలు మంజూరయ్యాయని అంతేకాకుండా ఇచ్చిన వారికి కూడా ఎటువంటి సదుపాయాలు లేకుండా మంచినీటికి కానీ లిఫ్ట్ కానీ పనిచేయకపోవడం స్థానిక ప్రజానీకం ఇబ్బందికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. మీకు అండగా నేనున్నానంటూ బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ వారికి చేయూతనిచ్చారు. జరిగిన అన్యాయము అక్రమాలను సాక్షాదారాలతో అధికారులకు ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని వారు అన్నారు.
Brs
కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చిందని ఏ ఒక్క హామీకి కూడా నిబద్ధత లేదని సత్తుపల్లి శాసనసభ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్లూరు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. మాజీ మంత్రి స్తంభాన్ని చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏనాడు దళితుల గురించి ప్రస్తావించిన కాంగ్రెస్ దళిత బంధు పథకం పై విమర్శలు చేస్తుందని ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తుందని కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొట్టమొదటిగా సత్తుపల్లి నియోజకవర్గంలోని దళితులందరికీ దళిత బంధు అమలు చేపిస్తానని అందరికీ దళిత బంధు అందిన తర్వాతే పార్లమెంటు ఎన్నికల్లో ఓటు అడుగుతామని సండ్ర తెలిపారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం లోని షాబాద్ మండలంలోని అంతారం, కాక్కులుర్, కేసారం, సర్దార్ నగర్ మరియు కుర్వగుడా గ్రామలలో బిఆర్ఎస్ అభ్యర్థి కాలే యాదయ్య ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతి గ్రామం తిరుగుతూ ప్రజలతో మమేకమై తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా ఆయన కోరారు.
ఈ ఎన్నికల్లో అయనకు ఉన్నా ప్రత్యర్థులను విమర్శిస్తూ వారి పై ఉన్న కేసుల గురుంచి చెప్తు వారికీ ఓటు వేస్తే అభివృధి అనేది కుంటు పడుతుందని ఈ సంద్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జడ్పిటిసి పట్నం అవినాశ్ రెడ్డి, మండల అధ్యక్షుడు గూడూరు నర్సింగరావు టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..
Read Also..
సింగరేణి పరిరక్షణతో పాటు కార్మికుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, గత ప్రభుత్వాలు పోగొట్టిన వారసత్వ ఉద్యోగాలను తిరిగి ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కె దక్కుతుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా గోదావరిఖని ఓసిపి 5 బొగ్గుగని పై బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి సీఎం కేసీఆర్ ను హ్యాట్రిక్ ముఖ్యమంత్రి గా గెలిపించాలని కార్మికులను కోరారు. తన వంతుగా కార్మికుల హక్కుల సాధన కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్మికులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట నగర మేయర్ అనిల్ కుమార్ , తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షుడు వెంకట్రావు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని పలు మసీదుల వద్ద వివిధ రాజకీయ పార్టీల నేతలు ముస్లిం సోదరులను కలిసి ఓట్లను అభ్యర్థించారు. శుక్రవారం ముస్లింల ప్రత్యేక నమాజు ల అనంతరం పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు తమకు ఓటు వేయాలంటూ ప్రచారం నిర్వహించారు. పోటాపోటీగా పార్టీల ప్రచార నినాదాలతో మసీదుల వద్ద అభ్యర్థుల అనుచరులు సందడి చేశారు. కాగా అభ్యర్థులు ఒకరికొకరు తారస పడిన ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా తమ ప్రచారం ముగించుకుని అక్కడి నుంచి జారుకున్నారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read Also….
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల తో కలిసి గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి తిరుగుతూ మహిళలు మరియు ఓటరులను కలుస్తూ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని హస్తం గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేసారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కోరికను తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి బహుమతిగా ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్న ఆరు గ్యారంటీ పథకాలపై ప్రజలను వివరిస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అనంతరం మీడియాతో జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, డిసెంబర్ 3న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని సృష్టించ బోతుంది అని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందన్నారు. సీఎం కేసీఆర్ మాట మనిషి కాదని మాటల మనిషి అని,మాటల పిట్ట అని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఏ ఒక్క స్కీమ్ అమలు కాలేదని అమలు చేయలేదని అన్నారు. కొల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బీరం. హర్షవర్ధన్ రెడ్డి ని ప్రజలు విపరీతంగా అసహ్యించుకుంటున్నారని అన్నారు. గెలిచిన మూడు నెలలకే పార్టీ మరి అమ్ముడు పోయిన వ్యక్తి ఎమ్మెల్యే బీరం. హర్షవర్ధన్ రెడ్డి అని అన్నారు. పంహౌస్ కేస్ లో 15 రోజులు కట్టేసిన వ్యక్తి కొల్లాపూర్ ఎమ్మెల్యే అని హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. గ్రామాలలో ప్రచారం లో తనకు పెద్ద ఎత్తున అనూహ్య స్పందన వస్తోందన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలంటే ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి అరాచక పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.
తెలంగాణ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారంపై ఎన్నికల కమిషన్ గట్టి నిఘా పెట్టింది. ఒక వైపు డేగ కన్నుతో పరిశీలిస్తోంది. మరోవైపు ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా కోట్లాది రూపాయలను సీజ్ చేస్తోంది. అభ్యర్థులు హద్దులు దాటకుండా మార్గదర్శకాలు విడుదల చేసింది. పాపం మంత్రి సత్యవతి రాథోడ్ ఈ డేగ కన్నుకు చిక్కుకున్నారు. ఎన్నికల మార్గదర్శకాలకు తిలోదకాలు ఇచ్చారు. ఆమె ఓటర్లను ప్రలోభపెడుతున్నారంటూ ఎఫ్ఎస్ టీ టీమ్ ఫిర్యాదు చేసింది. బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్‌నాయక్ తరఫున ప్రచారం కోసం ఇటీవల కొంగరగిద్దకు సత్యవతి వెళ్లారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు ఆమెకు హారతి ఇచ్చి స్వాగతం పలికారు. ఈక్రమంలో సత్యవతి రాథోడ్ హారతి పళ్లెంలో నాలుగు వేల రూపాయలు వేశారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకే డబ్బులిచ్చారని ఎఫ్ఎస్టీ బృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మంత్రి సత్యవతి రాథోడ్‌పై మహబూబాబాద్ జిల్లా గూడూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
Read Also..
Read Also..
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు సీఎం… బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కరీంనగర్ జిల్లాకు రానున్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్‌కు వెన్నుదన్నుగా నిలుస్తున్న ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ స్థానాలను మరోసారి గెలుచుకోవడమే లక్ష్యంగా కేసీఆర్, కేటీఆర్ ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్ ఇప్పటికే ఉమ్మడి జిల్లా పరిధిలోని సిరిసిల్ల, ధర్మపురి, మంథని, పెద్దపల్లి, కోరుట్ల నియోజకవర్గాల్లో పర్యటించి ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ కరీంనగర్లో నాలుగో సారి పోటీచేస్తున్న మంత్రి గంగుల కమలాకర్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ రెండో విడతలో కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో పాల్గొని ప్రచారం నిర్వహించనున్నారు. ఇందుకోసం మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ సీఎం కేసీఆర్ పాల్గొనే ప్రజా ఆశీర్వాద సభలకు భారీ జన సమీకరణతో విజయవంతం చేయడం ద్వారా పార్టీశ్రేణుల్లో ఉత్సాహం నింపే విధంగా చర్యలు చేపట్టారు. టీఆర్ఎస్ ఆవిర్భావ సభ నిర్వహించిన కరీంనగర్‌లోని ఎస్సారార్ కళాశాల మైదానంలోనే ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. గంగాధర మండలం పత్తికుంటపల్లిలో చొప్పదండి నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభ, హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంటలో ప్రజా ఆశీర్వాద సభలకు కూడా భారీ జనసమీకరణ చేస్తున్నారు. మరో 13 రోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ ఆశీర్వాద సభలతో పార్టీశ్రేణులు, ప్రజల్లో గెలుపు ఖాయమనే మెస్సేజీ తెచ్చే విధంగా ప్రణాళిక రూపొందించారు.
సీఎం పర్యటన వివరాలు
- శుక్రవారం మధ్యాహ్నం 12.40 గంటలకు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌నుంచి సీఎం కేసీఆర్ బయలు దేరి 12.50కి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
- 12.55కు హెలిక్యాప్టర్‌లో బయలుదేరి కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ హెలీప్యాడ్ గ్రౌండ్‌కు 1.30కి చేరుకుంటారు. అనంతరం ఎస్సారార్ కళాశాల మైదానానికి చేరుకుని ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
- 2.35కు అక్కడి నుంచి బయలు దేరి గంగాధర మండలం పత్తికుంట గ్రామానికి 2.40కి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగిస్తారు.
- 3.20కు అక్కడి నుంచి జమ్మికుంటకు 3.50 నిమిషాలకు చేరుకుని సభలో ప్రసంగిస్తారు.
- 4.30కు హన్మకొండ జిల్లా పరకాలకు బయలుదేరుతారు.
- సీఎం పర్యటన సందర్భంగా ఎస్సారార్ కళాశాల మైదానం వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.
Read Also..
సింగరేణి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నాయని, సింగరేణి కార్మికులను బార్డర్లో పనిచేసే సైనికులగా గౌరవిస్తామని పెద్దపల్లి జిల్లా రామగుండం కాంగ్రెస్ రామగుండం అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ అన్నారు. సింగరేణి కార్మికుల దీవెన యాత్రలో భాగంగా జీడికే టు ఎ బొగ్గు గని పై ఆయన కార్మికులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని రాబోయే ఎన్నికల్లో బిజెపి, బిఆర్ఎస్ ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పాలని కార్మికులను కోరారు. అనంతరం గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో సిబ్బందిని కలిసి తనకు ఈసారి ఎన్నికల్లో అవకాశం కల్పించాలని చేతి గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.
నల్లగొండ జిల్లాలో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. 40 మంది అధికారులతో బృందాలుగా రైస్ మిల్లర్స్ , బీఆర్ఎస్ అభ్యర్థి అనుచరుల ఇళ్లల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. నిన్న తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన ఐటీ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. మిర్యాలగూడలోని పలు రైస్ మిల్లుల యజమానులతోపాటు ఓ కాంట్రాక్టర్ ఇంట్లోనూ సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక కాంట్రాక్టర్ ఇంజమూరి శ్రీధర్ ఇంటితోపాటు రైస్ మిల్లు యజమానులు రంగా రంజిత్, రంగా శ్రీధర్, బండారు కుశలయ్య, రేపాల అంతయ్య ఇండ్లు, మిల్లుల్లో గురువారం ఉదయం 4 నుంచి అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. త్రిపురారం మండలం ముకుందాపురంలోని వెంకటసాయి సాల్వెంట్ ఆయిల్ మిల్లులోనూ సోదాలు చేపట్టినట్టు సమాచారం.