నామినేషన్ల దాఖలుకు నేడు శుక్రవారం చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థు వ్యర్థి,లకు సంబంధించి మరో సెట్ నామినేషన్లు, స్వంతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేసే అవకాశం ఉంది. శనివారం నుంచి నామినేషన్ల ఉపసంహరణ, పరిశీలనలో తిరస్కరణ ఆతర్వాత ఎన్నికల బరిలో ఉన్న తుది పోటీదారుల జాబితా వెల్లడవుతుంది. దీంతో ప్రచార వేడి ఊపందుకోనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీ లైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ తదితర పార్టీల అభ్యర్థుల ప్రకటన వెలువడింది. అన్నీ పార్టీల్లోనూ నామినేషన్ల ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఇక ఓట్ల కోసం అభ్యర్థుల ప్రచారం ముమ్మరం కానుంది.
Brs
దేశానికి ఆదర్శంగా తెలంగాణ ముందుకెళ్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కొడంగల్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో కేటీఆర్ మాట్లాడారు. కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది.. కరెంటు పోయిందన్నారు. కర్ణాటక రైతులు కొడంగల్ వచ్చి ధర్నాలు చేస్తున్నారు. అక్కడి ప్రజలు చెంపలు వేసుకుంటున్నారన్నారు. తెలంగాణలో 24గంటల విద్యుత్ కాదని 5గంటలు ఇస్తామంటున్నారన్నారు. కొడంగల్ పేరును అంతర్జాతీయ స్థాయిలో చెడగొట్టిన వ్యక్తి రేవంత్‌రెడ్డిఅని విమర్శించారు. రూ.50 లక్షలతో అడ్డంగా దొరికారన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డిని ప్రజలు గెలిపిస్తే.. కేసీఆర్ కాళ్లు పట్టుకునైనా ప్రమోషన్ ఇప్పిస్తానన్నారు. కొడంగల్‌ను అద్భుత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం అని కేటీఆర్ అన్నారు.
మంచిర్యాల జిల్లా లో నామినేషన్ల రగడ చోటుచేసుకుంది. నామినేషన్ వేసే సమయం లో ఇద్దరు అభ్యర్థులు ఒకే సమయానికి రావటంతో కార్యకర్తల నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. చెన్నూర్ స్థానానికి నామినేషన్ వేసేందుకు తహసీల్దారు ఆఫీసుకు బీఆర్ఎస్ అభ్యర్థి బాల్కసుమన్, కాంగ్రెస్ అభ్యర్ధి వివేక్ వెంకటస్వామి లు ఒకేసారి వచ్చారు. అయితే 500 మీటర్ల దూరంలో వివేక్ వాహనాన్ని పోలీసులు నిలిపివేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ వాహనానికి పోలీసులు అనుమతిచ్చారు. అయితే ఇద్దరూ ఒకే సమయానికి రావడంతో ఇరుపార్టీల నినాదాలతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. రెండు గ్రూపులను పోలీసులు శాంతింపజేశారు. పోలీసుల తీరుపై వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. అధికారులు రూల్స్ యధేచ్చగా అతిక్రమిస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతల దౌర్జన్యాన్ని ప్రజలు గమనించాలని కోరారు.
తాండూరు ప్రజలే ప్రచారకులు… ప్రజల ఆలోచన లు.. ప్రజల మనసు లోని కోరుకునే అభివృద్ధి కళ్ళముందు ఉంచాను… ఆశీర్వదించండన్నారు. ప్రజల ఆలోచన అభివృద్ధి పరీక్ష వ్రాసాను.. ఎన్ని మార్కులు వేస్తారో మీ నిర్ణయమని అన్నారు. ఎన్నికలప్పుడు వచ్చేది ఎవరు…. ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉండేది ఎవరు తాండూరు ప్రజలు ఆలోచించాలన్నారు. తాండూరు పేరు ప్రతిష్ట ను గౌరవాన్ని పెంచుకున్నాం… మరింత నిలబెట్టుక్కనేది ప్రజల ఆలోచననే అని అన్నారు. బి ఆర్ ఎస్ పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేశాను. తాండూరు ప్రజల ఆశీర్వాదం తో మంచి మెజార్టీ తో గెలిపించండన్నారు. ప్రతిరోజూ మీ కోసం 18గంటలు కష్టపడ్డ.. మీ కష్ట సుఖల్లో ఉన్నానన్నారు. తాండూరు ప్రజలు నా కుటుంబ సభ్యులన్నారు. గతంలో అద్భుత విజయం అందించి సేవ చేసే అవకాశం ఇచ్చారు. ఐదేళ్లు కష్టపడి పనిచేశా మీ ఆత్మా సాక్షిగా నాకు మార్కులు వేయండన్నారు.
పాలకుర్తి గడ్డకు ఒక చరిత్ర ఉంది.. పోరాట పటిమ ఉంది..మిమ్మల్ని చూస్తుంటే దొరల కడ్డీలను బద్దలు కొట్టడం ఖాయమనిపిస్తోంది
అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. పాలకుర్తి కాంగ్రెస్ విజయభేరి యాత్ర సభలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ
ఒకనాడు డీలర్ గా ఉన్న దయాకర్ రావు దందాలు చేసి ఇప్పుడు డాలర్ దయాకర్ రావు అయిండన్నారు.. ఝాన్సీ రెడ్డి కుటుంబం పేదలకు సేవలు చేశారు.మీకు సేవచేసేందుకు కాలేజీలు, ఆసుపత్రుల కోసం 80 ఎకరాల భూమి కొంటే దయాకర్ రావు లిటిగేషన్లు పెట్టి ఇబ్బందులు పెట్టిండన్నారు. రేవంత్ రెడ్డి వస్తే తెలంగాణను అమ్ముకుంటాడని కేసీఆర్ అంటున్నాడు .. 2009లో సికింద్రాబాద్ ఎంపీ సీట్లు కేసీఆర్ అమ్ముకున్నాడన్నారు. పాలకుర్తిలో కాంగ్రెస్ ను భారీ మెజార్టీతో గెలిపించండి…ఈ ఎన్నికలు కేసీఆర్ నలుగురు కుటుంబ సభ్యులకు… నాలుగు కోట్ల ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధమని దొరల తెలంగాణ కావాలో, ప్రజల తెలంగాణ కావాలో నిర్ణయించుకోండి అని అన్నారు.
ఇబ్రహీంపట్నం మంచిరెడ్డి కిషన్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దాడిని ఖండిస్తూ మంచిరెడ్డి కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. మాట్లాడుతూ, ముందే ప్లాన్ చేసుకొని మా కార్యకర్తలపై నాయకులపై రాళ్లు విసరడం జరిగింది సుమారుగా 35 కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. మూడుసార్లు ఓడిపోయిన మళ్లీ ఓడిపోవడానికి నామినేషన్ వేసి ఇలా దాడి చేయడం కరెక్టు కాదని హెచ్చరించారు. దాడికి ప్రతి దాడి చేస్తే అది కరెక్ట్ కాదని అన్నారు. ఈ ఎన్నికలలో ప్రజలే బుద్ధి మల్రెడ్డి రంగారెడ్డికి కాంగ్రెస్ పార్టీకి స్టేట్ లో ఇక్కడ ఇబ్రహీంపట్నంలో అవకాశం ఇవ్వరు అని అన్నారు. ఏది ఏమైనా మా కార్యకర్తలను నేను కాపాడుకుంటానని భరోసా ఇచ్చారు.
మంథని మండల కేంద్రంలో బి ఎస్ పి ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం నియోజకవర్గ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా చల్లా నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. భారత రాజ్యాంగమే బి ఎస్ పి మ్యానిఫెస్టో అని అన్నారు. మంథని ప్రాంతంలో పాలించిన నాయకులు ఇక్కడి ఇసుకను, బొగ్గును, నిధులను ప్రాజెక్టుల పేరిట ఇక్కడి నాయకులు కోట్ల రూపాయలు దోచుకున్నారని, ఈ ప్రాంత ప్రజలు ముంపుకు గురైనా నష్ట పరిహారం కూడా ఇప్పించలేదని ఆరోపించారు. లు ఈ ప్రాంతాన్ని పాలించిన ప్రజలకు ఏలాంటి మేలు జరుగలేదని అన్నారు. అందుకే బహుజనుల కోసమే తాను ఎమ్మెల్యే బరిలో నిలిచానని, ఈ ఎన్నికలలో బహుజనులు తనను గెలిపిస్తారని ధీమా వ్యక్తంచేశారు.
ఒక వ్యక్తిని రెచ్చగొట్టి మందు తాగించి కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి చేయించారు – హరీశ్ రావు
కొంతమంది ఓ వ్యక్తిని రెచ్చగొట్టి… ఆయనకు మందు తాగించి తమ పార్టీ దుబ్బాక అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేయించారని మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ అభ్యర్థి హరీశ్ రావు అన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి ఎవరికీ హాని చేయని వ్యక్తి అని చెప్పారు. ప్రభాకర్ రెడ్డి అంబులెన్స్‌లో వచ్చి దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం హరీశ్ రావు మాట్లాడుతూ… ఆ రోజు ఒక గంట ఆలస్యమైతే ప్రభాకర్ రెడ్డి ప్రాణానికే ప్రమాదం ఉండేదన్నారు. ప్రతిపక్షాలు ఈ ఘటనపై ఇష్టారీతిన మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. మొండి కత్తి, కోడి కత్తి అంటూ హేళన చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎరువుల కోసం చెప్పులు క్యూ లైన్లో పెట్టాల్సిన పరిస్థితి, రాత్రి బావి వద్ద పడుకోవాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేవన్నారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఈరోజు అట్టహాసంగా తన నామినేషన్ ను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ మేరకు గోదావరిఖని లోని ఎమ్మెల్యే తన నివాసంలో తల్లి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. వివిధ దేవాలయాలలో ఎమ్మెల్యే నామినేషన్ పత్రాలతో పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ శ్రేణులు, అనుచరులతో స్థానిక సింగరేణి స్టేడియంలో ప్రజా ఆశీర్వాద కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వ మతాలకు సంబంధించిన గురువులు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ను ఆశీర్వదించారు. అనంతరం గులాబీ పార్టీ శ్రేణులతో పెద్ద ఎత్తున పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీపీసీ లోని రిటర్నింగ్ కార్యాలయంలో అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఎమ్మెల్యే వెంట ప్రభుత్వ విప్ భాను ప్రసాద్ రావు, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ కోలేటి దామోదర్ ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మరోసారి అధికారంలోకి వస్తామని అన్నారు. గతంలో రామగుండం నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేశామని, మరోసారి ప్రజలు తనకు అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
Read Also..
Read Also..
ముషీరాబాద్ లో బిఆర్ఎస్ విజయం తథ్యం అని ముఠాగోపాల్ పేర్కొన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గ బిఆర్ ఎస్ అభ్యర్థి ముఠాగోపాల్ భారీ ర్యాలీ నిర్వహించి అట్ట హాసంగా నామినేషన్ దాఖలుచేశారు.నామినేషన్ ప్రారంభానికి ముందు ముషీరాబాద్ చౌరస్తాలోని మహంకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ ర్యాలీగా ఆయన బయలుదేరి ముషీరాబాద్ రిటర్నింగ్ కార్యాలయంలో నియోజకవర్గ ఎన్నికల అధికారి వి.లక్ష్మిణా రయణకు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మత్కడుతూ తాను చేసిన అభిరుద్దె తనను గెలిపిస్తుందన్నారు.




Total views : 92828