Brs
నల్గొండ జిల్లా చండూర్ లో సిపిఐ ముఖ్య కార్యకర్తల సమావేశం పాల్గొన్న మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. 2018 ఎన్నికల్లో కమ్యూనిస్టుల పొత్తు వల్లే ఎమ్మెల్యే గా గెలిచిన. కేసీఆర్ గద్దె దింపడం బీజేపీ పార్టీ మోడీ నాయకత్వంతో సాధ్యం అనే నమ్మకం తో పార్టీ మరీనా. బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలు చేతిలో పెట్టుకొని లిక్కర్ కుంభకోణంలో కవితను అరెస్టు చేయకపోవడం దారుణం. రాష్ట్రంలో బిజెపి బీఆర్ఎస్ఒ కటయ్యాయి. నా లక్ష్యం కేసీఆర్ ను గద్దె దింపడమే, అది బీజేపీ తో సాధ్యం కాలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి విస్తుంది,కేసీఆర్ గద్దె దింపడం కాంగ్రెస్ తోనే సాధ్యమని తిరిగి సొంత పార్టీకి వచ్చిన. మునుగోడు ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టుల వల్లే బిఅర్ఏస్ గెలిచింది. పేదల పార్టీ ,ఆత్మగౌరవం తో పని చేసే నాయకులు కమ్యూనిస్టులు. ఉప ఎన్నికల్లో మీ లక్ష్యం బీజేపీ ఓటమి, రాజగోపల్ రెడ్డి మీద శత్రుత్వం కాదని తెలిసిపోయింది.
నాగర్ కర్నూల్ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేశానని మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి పరుస్తానని నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మరి జనార్దన్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ సమర్పించిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా తెలంగాణ అణిచివేతకు గురైందని ప్రత్యేక తెలంగాణ సాధన తో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సర్వతోముఖాభివృద్ధి సాధించాడని అన్నారు. నాగర్ కర్నూల్ లో కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా సగునీరు అందించడమే కాకుండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు బీజం వేసి పూర్తిచేసే దశకు చేరుకుందన్నారు. పాలమూరు రంగారెడ్డి తో తెలంగాణ సస్యశ్యామలమవుతుందని అన్నారు. మరోసారి ఆశీర్వదిస్తే చిత్తశుద్ధితో ప్రజా శ్రేయస్సు కై పనిచేస్తానని అన్నారు. విద్య వైద్య వ్యవసాయ రంగాలలో ఎంతో ప్రగతి సాధించామని ఉన్నత కళాశాలలు నెలకొల్పడం జరిగిందని అన్నారు.
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకుల విస్తృత స్థాయి సమావేశాన్ని పటాన్ చెరులోని జీఎంఆర్ కన్వన్షన్ సెంటర్ లో నిర్వహించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ లు కాసాని జ్ఞానేశ్వర్, భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి పనులే మూడో సారి అధికారంలోకి వచ్చేలా చేస్తాయన్నారు. పటాన్ చెరులో ఎమ్మెల్యే గా గూడెం మహిపాల్ రెడ్డి విజయం ఎప్పుడో ఖరారైందని, మెజార్టీయే మిగిలిందన్నారు. ఓట్ల కోసం కాంగ్రెస్, బీజేపీ నుంచి కొత్త బిచ్చగాళ్లు వస్తారని, ప్రజలు ఆలోచించి ఓటేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఓటడిగే హక్కు ఒక్క బీఆర్ఎస్ కే ఉందని జీఎంఆర్ చెప్పారు. రేపు ఉదయం 11 గంటలకు గణేష్ గడ్డ సిద్ది వినాయకుని వద్ద పూజలు చేసి నామినేషన్ వేయనున్నట్లు చెప్పారు.
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గుర్క జైపాల్ యాదవ్ రెండు సెట్ల నామినేషన్ల పత్రాలను రిటర్నింగ్ అధికారి శ్రీను నాయక్ కు దాఖలు చేశారు. అంతకుముందు కర్మన్ ఘట్ లోని కనకదుర్గ అమ్మవారి ఆలయంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత కల్వకుర్తిలోని అమరవీరుల స్తూపానికి తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జైపాల్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ గారు నన్ను ఆశీర్వదించి కల్వకుర్తి నియోజకవర్గం టిఆర్ఎస్ అభ్యర్థిగా టికెట్ మరియు బి ఫామ్ అందజేయడం జరిగిందని. ఆయన ప్రవేశపెట్టిన పథకాలే నన్ను గెలిపిస్తాయని కుల మతాలకు అతీతంగా కారు గుర్తు మీద ఓటు వేసి టిఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు నామినేషన్ కార్యక్రమంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ పలువురు బిఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్వో కార్యాలయంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి తో కలిసి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే సతీష్ కుమార్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అంతకుముందు స్థానిక శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో నామినేషన్ పత్రాలతో ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే సమయంలో అక్కడే ఉన్న హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ తో కరచాలనం చేసి కాసేపు ముచ్చటించారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి హుస్నాబాద్ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీగా నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి ఆర్వో కార్యాలయానికి తరలి వెళ్లారు. ఆర్వో కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన అనంతరం ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ 2014 కు ముందు ఉన్న పరిస్థితి, ఇప్పుడు హుస్నాబాద్ నియోజకవర్గంలో, రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని, మార్పును ప్రజలు గమనించాలన్నారు.
ఒకప్పుడు కరువు కాటకాలతో మెట్ట ప్రాంతంగా ఉన్న హుస్నాబాద్ లో ఇప్పుడు భూగర్భ జలాలు పెరిగి సంతోషంగా, సుభిక్షంగా రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారని తెలిపారు. అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు, తనను కూడా మూడో సారి గెలిపించి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ జనసందోహంతో హోరెత్తిపోయింది. గులాబీ బాస్ అభిమానులు భారీగా ఈ సభకు తరలివచ్చారు. ఈ సభలో ప్రసంగించిన కేసీఆర్ ఓటు చాలా విలువైనదని…ప్రతి ఒక్కరూ ఓటు హక్కును చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలని తెలిపారు. బీఆర్ ఎస్ పార్టీ వచ్చాక అభవృద్ది ఏ తరహాలో ఉంది చూసి తమను గెలిపించాలన్నారు సీఎం కేసీఆర్. ఈ సభ అనంతరం కేసీఆర్ హెలిక్యాప్టర్ లో ఆసిఫాబాద్ ప్రజా ఆశీర్వాద సభకు బయలుదేరారు. అయితే… సాంకేతిక లోపం వలన హెలిక్యాప్టర్ లో ప్రయాణం కుదరలేదు. దీంతో కాగజ్ నగర్ నుంచి ఆసిఫాబాద్ కు బస్సులో ప్రయాణించారు.
చింతపల్లి మండలం వింజమూరు గ్రామంలో ప్రచారం చేయడానికి వచ్చిన ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ను వింజమూర్ గ్రామ యువకులు అడ్డుకున్నారు.
గతంలో 2018 సంవత్సరంలో వింజమూరు గ్రామస్థులకు వింజమూరు గేట్ నుండి ఊర్లో వరకు రోడ్డు వేస్తానని రోడ్లు వేస్తేనే ఓట్లు అడుగుతానని వాగ్దానం చేసి రోడ్లు వేయించకపోవడంతో ఆ గ్రామ యువకులు రోడ్లు వేయించకుండా ఓట్లు అడగడానికి ఎందుకొచ్చావని ఎమ్మెల్యే ప్రచారాన్ని అడ్డుకోవడం జరిగింది.
నామినేషన్ దాఖలు చేసిన బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకర్ పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గ కేంద్రంలో బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకర్ బుధవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి వి హనుమ నాయక్ కు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం మీడియాతో పుట్ట మధుకర్ మాట్లాడుతూ.. ఒక బిసీ బిడ్డగా ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు మూడో సారి అవకాశం ఇచ్చారని, నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న బిసిలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, అగ్రవర్ణాలలో ఉన్నవారికి అనేక అవకాశాలు ఉన్నా కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా అనిచి వేశారని అందుకే ఈ సారి నేను పోటీలో ఉండవలసిన అవసరం ఏర్పడిందని అన్నారు. ఎవరికి సాయం చేయని కాంగ్రెస్ పార్టీ, రాజకీయంగా ఎదిగిన వారిని రాజకీయ సమాధి చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వాళ్ళు అన్ని విషయాల మీద పరిజ్ఞానం ఉన్నవాళ్లు ఎమ్మెల్యే అయితే, ఇప్పటికే నాలుగు సంవత్సారాలు ఏవిధమైన అభివృద్ధి జరిగిందో ప్రజలు చూసారని గుర్తు చేశారు. ఈ సారి బి ఆర్ ఎస్ పార్టీ తరుఫున నామినేషన్ వేసిన తనను ప్రతి ఒక్కరూ ఓటు వేసి గెలిపించాలని కోరారు.
కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బిఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థిగా గంగుల కమలాకర్ నామినేషన్ వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలే నా దైవం. నాలుగో సారి విజయం సాధిస్తాను. మూడు సార్లు అవకాశం ఇస్తే కరీంనగర్ రూపు రేఖలు మార్చాను. నాలగో సారి గెలిపిస్తే పదివేల మందికి ఉపాధి చూపే ప్రాజెక్టులు తీసుకువస్తాను. పది సంవత్సరాల లో ప్రజలు శాంతియుత వాతావరణం లో జీవిస్తున్నారని పేర్కొన్నారు.





Total views : 92832