రాజకీయ నాయకులంటేనే పదిమందికి న్యాయం చేసే నాయకులని మనం ఎంతో మందిని చూసి ఉంటాం. అయితే అందుకు భిన్నంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరులో ఓ స్థానిక వైసిపి నాయకుడు ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్నారు. అధికారం ఉంది కదా అని.. తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ… ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే అక్కడ పాగా వేసి ఆక్రమిస్తున్నాడు. గత 40 సంవత్సరాలుగా దుత్తలూరు పట్టణం కరెంట్ ఆఫీస్ వెనుక చిన్న పాక నిర్మించుకొని బతుకుతున్న తమను ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. కనికరించమని కాళ్లు మొక్కుతున్నా.. దయచూపడం లేదని వాపోతున్నారు. గతంలో కూడా ఇదే నాయకుడు తమ మీద దాడి కూడా చేశాడని కన్నీటి పర్యంతమవుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే… సదరు నాయకుడికే వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ కూలికి వెళితే తప్ప డొక్కాడని తమ మీద ప్రతాపం చూపిస్తున్న వైసిపి నాయకుడిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
business
శ్రీకాకుళం జిల్లా టెక్కలి డిగ్రీ కాలేజ్ ఎదురుగా స్టూడెంట్ పై నుండి ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు దూసుకెళ్లడంతో, తీవ్ర గాయాలు పాలైన బెండి.సాయి( 24 ) అనే విద్యార్థి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి టెక్కలి వెంకటేశ్వర కాలనీకి చెందిన బెండి ఉమామహేశ్వరి కొడుకు గా గుర్తించారు. మృతుడి తండ్రి తన చిన్నప్పుడే చనిపోవటం తో, తన తల్లి చదివించి, పెద్దచేసి అల్లారు ముద్దుగా పెంచుకుంది. కల్లెదురుగా కన్నకొడుకు చనిపోవటం తో కన్నీరు మున్నీరు గా విలపిస్తుంది.
ప్రకాశం జిల్లా మార్కాపురం లో తుఫాను ప్రభావం వలన వర్షాలు పడటంతో మార్కాపురం లోని పలు ప్రాంతాల్లో ఆఫ్రికన్ నత్తలు సందడి చేస్తూ కనిపించాయి. స్థానిక మాగుంట మున్సిపల్ పార్క్ లో వాకర్స్ కు, అరుదైన జాతికి చెందిన ఆఫ్రికన్ నత్తలు పెద్ద సంఖ్యలో కనిపించాయి. ఈ నత్తలు మొక్కలను, చెట్లను ఆహారం గా తీసుకుని పర్యావరణాన్ని తీవ్రంగా నాశనం చేస్తాయని పలువురు పర్యావరణ పరిరక్షకులు తెలిపారు. వెంటనే ఈ నత్తలను నివారించడానికి కృషి చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు .వాటిని అలాగే వదిలేస్తే వాటి సంఖ్య పెరిగి మొక్కలు మొత్తం సర్వనాశనం చేస్తాయని పర్యావరణ పరిరక్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఆఫ్రికన్ నత్తలను నివారించడానికి ప్రయత్నం చేయాలన్నారు.
Read Also…
Read Also…
తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ ఏ. రేవంత్ రెడ్డి గారికి తేదీ: 8.12.2023 నాడు తెలంగాణ సచివాలయంలో టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ అధ్వర్యంలో కేంద్ర సంఘ అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, ఎం. సత్యనారాయణ గౌడ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు, ముజిబుస్సైని, పర్వతాలు, శంకర్ తదితరులు కలిసి అభినందనలు తెలియజేశారు. అలాగే, గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారిని కూడా కలిసి అభినందనలు తెలిపారు. పది లక్షల ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల, కాంట్రాక్టు & ఔట్సోర్షింగ్ ఉద్యోగుల కుటుంబాల తరుపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అని, ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడాన్ని యావత్ తెలంగాణ ఎన్జీవోల సంఘం పక్షాన హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నాము. ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా అనేక హామీలను తమ మానిఫెస్టో లో చేర్చినందున ఉద్యోగుల సహకారంతో నూతన ప్రభుత్వం ఏర్పడింది. కనుక ఇక రాష్ట్ర అభివృద్ధి కోసం ఉద్యోగులుగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు సేవ చేస్తామని టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ తెలియజేశారు.
జిల్లా ఎస్పీ యూ.రవి ప్రకాష్ ఆదేశాల మేరకు పెనుగొండ లో రాత్రి పూట తాళాలు వేసి ఉన్న ఇళ్లలో జరుగుతున్న దొంగతనాల కేసులో తప్పించుకు తిరుగుతున్న నిందితున్ని పెనుగొండ పోలీసులు అరెస్టు చేసారు. నరసాపురం ఇంఛార్జి sdop జీ.వీ.ఎస్ పైడేశ్వరరావు పెనుగొండ పోలీసు స్టేషన్ వద్ద మీడియా సమావేశంలో మాట్లాడుతూ పెనుగొండ గ్రామంలోని చెరుకువాడకు చెందిన కోసూరి కరుణ (33సం) జల్సాలకు అలవాటు పడి రాత్రి పూట తాళాలు వేసిన ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి బంగారం, మరియు వెండి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. అంతే కాకుండా బైక్ లు దొంగతనాలకు కూడా పాల్పడేవాడని దొంగిలించిన వెండి, బంగారం వస్తువులను ఫైనాన్స్ కంపెనీలలో తాకట్టు పెట్టి తన అవసరాలకు ఉపయోగించుకునేవాడని తెలిపారు. పెనుగొండ ఇన్స్పెక్టర్ మరియు ఆయన సిబ్బందితో మరియు మధ్య వర్తులతో తేదీ.08-12-2013 తేదీన చెరుకువాడలో ముద్దాయి ఇంటి వద్ద సుమారు 5 గంటల సమయంలో అదుపులోకి తీసుకొని విచారించగా తన నేరచరిత్ర అంతా బయటపడింది. పట్టుబడిన కోసూరి కరుణ గత ఎనిమిది నెలల నుండి పాలకొల్లు మరియు పలు చోట్ల దొంగతనాలకు పాల్పడినట్లు తేలింది .అతని నుంచి సుమారు 12.5 కాసుల బంగారం, ఒక కేజి వెండి ఒక మోటార్ సైకిల్ రూ. 8,00,000 లక్షల విలువగల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలందరూ మోటార్ సైకిళ్ళుకు జీపీఎస్ సదుపాయం ఏర్పాటు చేసుకోవాలని, అలాగే ఇళ్లల్లో ఉన్న బంగారం మరియు నగదును వీలైనంత మేర బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఆర్ జే డి అధినేత, బీహార్ మాజీ సీఎం, మాజీ కేంద్ర మంత్రి లాలు ప్రసాద్ యాదవ్ కు గురువారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఆయన సతీమణి మాజీ ముఖ్యమంత్రి రబ్రి దేవి, ఆయన తనయుడు బీహార్ రాష్ట్ర డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, ఇతర కుటుంబ సభ్యులతో కలసి పాట్నా విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు తెలంగాణ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, స్థానిక యాదవ సంఘం నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.
చిత్తూరు జిల్లా పలమనేరు బైరెడ్డిపల్లి మండలం సాకే ఊరు గ్రామం నందు రాత్రి 13 ఏనుగుల గుంపు హల్ చల్ చేసింది. వరి, అరటి, పరింది చెట్లు హైబ్రిడ్ కసువు తిని తొక్కి నాశనం చేశాయి. అప్పుచేసి పంట పండిస్తున్నామని ఈ విధంగా ఏనుగులు తొక్కి తిని నాశనం పట్టిస్తున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి కుప్పం వెళ్లే రహదారిపైనే కాసేపు ఏనుగులు ఉన్నాయని గ్రామస్తులు భయాందోళనకు గురి అవుతున్నారు. ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తిరుపతి జిల్లా లో మిచాంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటన నిమిత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర హోం శాఖ మంత్రివర్యులు తేనేటి వనిత ఉన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జిల్లా ఇంఛార్జి మంత్రి కళత్తూరు నారాయణ స్వామి, రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి వర్యులు పెద్ది రెడ్డి రామ చంద్రా రెడ్డి, టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రి ఆర్కె రోజా ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, డిఐజి అమ్మిరెడ్డి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత, స్థానిక ఎమ్మెల్యే మరియు టిటిడి చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూధన రెడ్డి తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ శిరీష, జెడ్పీ ఛైర్మెన్ గోవిందప్ప శ్రీనివాసులు, తిరుపతి ఆర్డీవో రవిశంకర్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ విమలా కుమారి, స్వాగతం పలికారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుండి హెలికాప్టర్ ద్వారా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటన నిమిత్తం వాకాడుకు ముఖ్యమంత్రి బయల్దేరి వెళ్ళారు. వీరి వెంట రాష్ట్ర హోం శాఖ మంత్రివర్యులు తేనేటి వనిత, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, జిల్లా కలెక్టర్ వెంకట రమణా రెడ్డి ఉన్నారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గురువారం కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం గుండెకు స్టంట్ వేశారు. విద్యాసాగర్ రావు కోలుకుంటున్నారని, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. రెండు మూడు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని ఆయన తనయుడు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తెలిపారు.
Read Also…
Read Also…
ఏఐటీయూసీతోనే సింగరేణి కార్మికుల హక్కులు సాధ్యమని కార్మికులందరూ ఏఐటీయూసిని గెలిపించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య కార్మికులను కోరారు. పెద్దపెల్లి జిల్లా రామగుండం ఏరియా వన్ జీడికే టు ఇంక్లైన్ పై ఏర్పాటు చేసిన గేటు మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ.. గతంలో పనిచేసిన యూనియన్లు సింగరేణి యాజమాన్యంతో కుమ్మక్కై లాభాల బాటలో ఉన్న సింగరేణి సంస్థను నష్టాల పాలు చేశారని అన్నారు. కార్మికుల హక్కుల సాధన కోసం రాజీలేని పోరాటాలు చేసి అనేక హక్కులను సాధించిన ఘనత ఏఐటియూసికే దక్కిందని అన్నారు. సింగరేణిలో కొత్తగనుల ఏర్పాటు కోసం, ఉద్యోగాల కల్పన కోసం కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు. ఈసారి తమ యూనియన్ కి అవకాశం ఇవ్వాలని కార్మికులను కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ప్రధాన కార్యదర్శి మడ్డి. ఎల్లయ్య, బ్రాంచి అధ్యక్షులు రంగు శ్రీనివాస్ గౌడ్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.






Total views : 91177