ఏపీలో టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయానికి వచ్చిన ఓ సీఐడీ కానిస్టేబుల్ కార్యాలయ కార్యదర్శి అశోక్ బాబుకు నోటీసు అందించారు. టీడీపీ బ్యాంకు ఖాతాల వివరాలు అందజేయాలంటూ సీఐడీ తన నోటీసుల్లో పేర్కొంది. ఈ నెల 18 లోగా వివరాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. పార్టీ ఖాతాలోకి వచ్చిన విరాళాల వివరాలు అందజేయాలని సీఐడీ తన నోటీసుల్లో తెలిపింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుపై దర్యాప్తు చేస్తున్న సీఐడీ… అందులో భాగంగానే టీడీపీ కార్యాలయానికి కూడా నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది.
Chandra babu
తెలంగాణ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన పాల్గోన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…చంద్రబాబుకు మరో పది పదిహేనేళ్లు రాజకీయం చేసే సామర్థ్యం ఉందన్నారు. ఆయనకు వయస్సేమీ అయిపోలేదని, మోదీ కంటే ఆయన చిన్నవారే అన్నారు. చంద్రబాబు అరెస్ట్ విషయంలో తను చేసిన వ్యాఖ్యలు జనంలోకి తఫ్పుగా వెళ్లాయన్నారు. శాంతిభద్రతల విషయంలో తప్పక బాబు అరెస్ట్ నిరసనలు హైదరాబాద్ లో చేయవద్దని…అది పక్క రాష్ట్రం వ్యవహారం అని చెప్పానన్నారు. చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, ఏపీ సీఎం జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో తరుచూ టచ్‌లో ఉంటానన్నారు. చంద్రబాబు విషయంలో లోకేశ్ ఆవేదనను తాను అర్థం చేసుకున్నానని తమ మధ్య సోదర భావమే ఉందన్నారు.
పల్నాడు జిల్లా… రాజుపాలెం మండలం రెడ్డిగూడెం గ్రామంలో పవన్ వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో పాల్గొన్న జలవనరుల శాఖ మంత్రి రాంబాబు. పవన్ కళ్యాణ్ పై అంబటి ఘాటు కామెంట్స్ మా వాళ్లు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలనుకుంటారు. పవన్ కళ్యాణ్ సూట్ కేసులు క్యాష్ తీసుకొని చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలనుకుంటాడు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నం చేసే నీచమైనటువంటి రాజకీయాలు చేసే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి వచ్చిన వారిని మళ్ళా ఇంటికి పంపిస్తారు ఈ రాష్ట్ర ప్రజానీకం. పవన్ కళ్యాణ్ తెలంగాణలో బిజెపికి సపోర్ట్ చేస్తారంట. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో జెండా ఎత్తేశారు. పవన్ అక్కడ భారతీయ జనతా పార్టీ మోడీకి, ఇక్కడేమో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తారు. అక్కడ అలా ఇక్కడ ఇలా ఏమిటో ఎవరికి అర్థం కాదు. ఏప్పుడు ఎక్కడ ఎలా ఉంటాడో తెలియని వ్యక్తి పవన్ కళ్యాణ్. కమ్యూనిస్టులే నిజమైన దేశభక్తులను ఎన్టీ రామారావు పవన్ కళ్యాణ్ చెప్పారు. నావల్ల నా ప్రభుత్వం వల్ల మేలు జరిగితే ఓటెయ్యండి.
అని అడిగిన మొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రతి ఇంటికి ద్రోహం చేసిన వ్యక్తులు పవన్ కళ్యాణ్ చంద్రబాబు. ఉద్యోగాలు ఇస్తానని, ఋణ మాఫీ చేస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేశారు. వైసీపీ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు దేశానికి దార్శనియంగా ఉన్నాయన్నారు. అందరూ సమిష్టిగా పనిచేసి జగన్ మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు మంత్రి అంబటి.
పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని స్థానిక 20 వ వార్డ్ లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ చదలవాడ అరవింద బాబు ఇంటింటికి తిరిగి వైసీపీ ప్రభుత్వ పాలనలో సామాన్య ప్రజలు పడుతున్న బాధలను కష్టాలను అడిగి తెలుసుకొని వారి అభిప్రాయాలను నమోదు చేసుకున్నారు. చదలవాడ అరవింద్ బాబు కామెంట్స్…. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నీతి నిజాయితీగల మనిషి అని. యువతకి రైతులకి మంచి భవిష్యత్తు కావాలి అంటే అది బాబు వల్లే అవుతుందని అన్నారు.. నాలుగున్నరేళ్ల జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి లేదు,సంక్షేమం లేదు,ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయని అన్నారు.. టిడిపి మేనిఫెస్టో ద్వారా చంద్రబాబు నాయుడు ప్రజలకు అనేక హామీలు ఇవ్వడం జరిగిందన్నారు…మహిళల కోసం మహాశక్తి కార్యక్రమం తెస్తామని,ఇంట్లో ఎంతమంది మహిళలు అంటే అంతమందికి ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మహిళలు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఇసుక కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో చంద్రబాబును ఈ నెల 28వ తేదీ వరకు అరెస్ట్ చేయబోమని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. సీఐడీ తరపు న్యాయవాదుల స్టేట్మెంట్ ను రికార్డు చేసిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. ఆరోగ్య కారణాల వల్ల ఈ నెల 28వ తేదీ వరకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఇసుక కేసులో చంద్రబాబును ఏ2గా సీఐడీ పేర్కొంది.
Read Also..
చంద్రబాబు నాయుడును ఎదుర్కోలేక రాష్ట్రంలో కొన్ని దుష్ట శక్తులు ఆధారాలు లేని తప్పుడు కేసులు పెడుతున్నాయి.. చంద్రబాబు క్షేమంగా బయటికి రావాలి కొన్ని కోట్ల మంది ప్రజలు దేవుళ్లను మొక్కుకున్నారు. త్వరలోనే చంద్రబాబు ప్రజాక్షేత్రంలోకి వచ్చి మరల ముఖ్యమంత్రి అవుతారు. సుప్రీంకోర్టులో చంద్రబాబు ఆపిల్ చేసిన క్వాష్ పిటిషన్ తీర్పు ఈరోజు రేపో వెలువడనుంది. 17a గురించి సుప్రీంకోర్టు ఇచ్చే డైరెక్షన్ కోసం దేశం మొత్తం ఎదురుచూస్తుంది. చట్టాలను ఉల్లంఘించడం సీఎం జగన్‌కు వెన్నతో పెట్టిన విద్య చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి ప్రజలకు దూరం చేయాలనీ చూస్తున్నాను.
Read Also..
రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఊరటను కల్పించింది. చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఈరోజు హైకోర్టు విచారించింది. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. అప్పటి వరకు చంద్రబాబును అరెస్ట్ చేయకూడదని సీఐడీని ఆదేశించింది. మరోవైపు వాదనల సందర్భంగా ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ… స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై ఉన్నారని… ఆ గడువు ముగిసేంత వరకు ఆయనను అరెస్ట్ చేయబోమని కోర్టుకు తెలిపారు. మధ్యంతర బెయిల్ స్ఫూర్తిని కొనసాగిస్తామని చెప్పారు. బాబుపై తొందరపాటు చర్యలు తీసుకోబోమని తెలిపారు. ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేసిన హైకోర్టు… అరెస్ట్ చేయవద్దని ఆదేశిస్తూ తదుపరి విచారణను 22కి వాయిదా వేసింది.
ఓవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉంటూనే తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో అనధికారిక గౌరవ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి కొనసాగుతోందని వైసీపీ లీడర్ విజయసాయి రెడ్డి విమర్శించారు. ఆమె ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకమంటూ మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం ఆ పార్టీతో అంటకాగారని, చంద్రబాబు పార్టీ నుంచి గెంటేస్తే కాంగ్రెస్ లో చేరారని ఆరోపించారు. తన తండ్రిని అవమానించిన పార్టీ అంటూ అప్పటి వరకూ విమర్శించిన అదే కాంగ్రెస్ లో చేరి, నిస్సిగ్గుగా పదవులు చేపట్టారని అన్నారు. తండ్రిని అవమానించి, ఆ పునాదులపై ఏర్పాటైన టీడీపీలో అధికారం ఉన్నంతకాలం ఉన్న నీతిలేని చరిత్ర ఆమెదని తీవ్రంగా విమర్శించారు. కేంద్ర మంత్రిగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ ను నాశనం చేసిన మహా గొప్ప మహిళ అని పురంధేశ్వరిపై మండిపడ్డారు.
Read Also..
Read Also..