తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టిడిపి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏలూరు టిడిపి ఇన్చార్జ్ బడేటి చంటీ, గంటా మురళి తదితరులు విమర్శించారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం లోని తుఫాను వల్ల నష్టపోయిన పంట పొలాలను టిడిపి బృందం పరిశీలించింది. సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని రైతులను పరామర్శించడానికి పంట నష్టం అంచనా వేయడానికి ఏ ఒక్క అధికారికి కూడా రాలేదని మండిపడ్డారు. పంట కాలువలో పూడిక తీయక పోవడం వల్ల కురిసిన వర్షం నీరు బయటకు వెళ్లే మార్గం లేక పంట నష్టం తీవ్రంగా ఉందని అన్నారు.. పండిన పంట చేతికి వచ్చే సమయం లో వచ్చిన ఈ కష్టాన్ని ప్రభుత్వ భరించాలని రంగు మారిన మొలకెత్తిన ధాన్యం బేషరతుగా ప్రభుత్వం కొనాలి, అలా కొనని పక్షంలో మార్చి తర్వాత ఏర్పడే టిడిపి జనసేన ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని తెలిపారు. అధికారులు వైఎస్ఆర్సిపి నాయకులు కేవలం ఏసీ రూములకే మాత్రమే పరిమితం అయ్యారని విమర్శించారు.. వైయస్సార్సీపి పార్టీకి టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగించడం పై ఉన్న శ్రద్ధ రైతుల పంట పొలాలు పరిశీలించడంలో లేదని మండిపడ్డారు.. రైతులకు ఎల్లప్పుడూ టీడీపీ పార్టీ అండగా ఉంటుందని బరోసా ఇచ్చారు.
Tag:
chintamaneni prabhakar
ఏలూరు జిల్లా పెదవేగి మండలంలో వైసీపీ నేతలు భారీ స్థాయిలో అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ధ్వజమెత్తారు. పోలవరం కుడి కాలువ వద్ద అక్రమంగా గ్రావెల్ తవ్వకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో ఆయన గ్రావెల్ తవ్వకాలను అడ్డుకున్నారు. వైసీపీ నేతలు అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ అధికారులకు చింతమనేని ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించలేదంటూ ఆయనే స్వయంగా రంగంలోకి దిగారు. గత అర్ధరాత్రి వేళ పోలవరం కుడి కాలువ వద్ద పలు వాహనాలను పట్టుకున్నారు. చింతమనేని 10 లారీలను, 2 జేసీబీలను, 2 ట్రాక్టర్లను పట్టుకున్నారు. తాను పట్టుకున్న వాహనాలతో సహా పెదవేగి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. పోలీసులు కేసు నమోదు చేసేంత వరకు కదలబోనని చింతమనేని నిరసనకు దిగారు. గత అర్ధరాత్రి నుంచి ఆయన పోలీస్ స్టేషన్ వద్దే నిరసన తెలుపుతున్నారు.





Total views : 78524