ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఏపీ మంత్రివర్గంలోకి తీసుకున్న సీఎం చంద్రబాబు వెల్లడించారు. జనసేనలో ప్రధాన కార్యదర్శిగా చురుకుగా వ్యవహరిస్తున్న నాగబాబుకు మంత్రి పదవి కేటాయించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. దీంతో పాటుగా టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుల పేర్లను కూడా సీఎం వెల్లడించారు. అయితే నాగబాబుకు ఏ శాఖను కేటాయిస్తారనే దానిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ కోరికతో పాటుగా.. జనసేన పార్టీకీ నాగబాబు అందించిన సేవలకు గాను ఆయన్ను కేబినెట్లోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో కేబినెట్లో జనసేన బలం మరింత పెరగనుంది.
ఏపీ అసెంబ్లీ నియమాలను అనుసరించి మొత్తం 25 మంత్రి పదవులు ఉండాల్సి ఉంటే, ప్రస్తుతం మంత్రివర్గంలో 24 మంది ఉన్నారు. మిగిలిన ఒక స్థానం జనసేనకు కేటాయించారు. ఈ నేపథ్యంలో జనసేన తరపున నాగబాబును మంత్రిగా ఖరారు చేస్తూ టీడీపీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జనసేన నుంచి పవన్ కళ్యాణ్, కందుల దుర్గేశ్, నాదెండ్ల మనోహర్ మాత్రమే మంత్రివర్గంలో ఉన్నారు. అయితే కూటమి పొత్తు ఒప్పందం ప్రకారం, జనసేనకు నాలుగు మంత్రి పదవులు, బీజేపీకి ఒక పదవి కేటాయించాల్సి ఉంది. అందులో భాగంగా ఈ ఖాళీని నాగబాబుతో భర్తీ చేయనున్నారు. ఇక రాజ్యసభ స్థానాల విషయానికి వస్తే, కూటమి ప్రభుత్వం బీద మస్తాన్, సానా సతీష్ పేర్లను ఖరారు చేశారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఛార్థామ్ యాత్రలో తీవ్ర ట్రాఫిక్ జామ్ …ఉత్తరాఖండ్‌లో చార్ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. చార్ధామ్ యాత్రలో భాగంగా బద్రీనాథ్ వెళుతున్న భక్తులు భారీ ట్రాఫిక్‌జామ్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారాంతపు సెలవులు, యాత్రికుల రద్దీ భారీగా పెరగడంతో కేదార్నాథ్ , జోషిమఠ్, గోవింద్…
- రాజస్థాన్‌లో రాకాసి ఇసుక తుపాను బీభత్సం..రాజస్థాన్‌లో రాకాసి ఇసుక తుపాను బీభత్సం సృష్టించింది. చురు జిల్లాలో ఇసుక తుపాన్‌తో పాటు భారీ వర్షంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చురు, బికనేర్, శ్రీగంగానగర్‌లో అరగంట పాటు ఇసుక తుపాన్ అల్లకల్లోలం సృష్టించింది. ఇసుక తుపాను వీధులను కమ్మేసింది.…
- జాతీయస్థాయి పారా అథ్లెట్ చిరాగ్ త్యాగి అనుమానస్పద మృతి..జాతీయ స్థాయిలో సత్తా చాటి ఇంటర్నేషనల్ స్థాయికి ఎదుగుతున్న పారా అథ్లెట్ చిరాగ్ త్యాగి ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్ జిల్లాలో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించడం తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని మురద్‌నగర్‌కు చెందిన ఈ యువ అథ్లెట్, గాజియాబాద్‌లోని ‘సాయి ఉప్వాన్’…
- జిందాల్ ప్లాంట్ నిర్వహణ తీరుపై డిప్యూటీ సీఎం పవన్ ఆరా..జిందాల్ ప్లాంట్ ఏర్పాటు వ్యయం, నిర్వహణ తీరుపై ప్లాంట్ ప్రతినిధులను, అధికారులను రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, యూనిట్ విక్రయ ఛార్జీల వివరాలను ఆయనకు ప్రతినిధులు వివరించారు. కాకినాడ…
- జూన్ 2న హైదరాబాద్‌లో భారీసభ ఏర్పాటు ..జనసేన పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ 2న హైదరాబాద్ లో ఓ భారీ సభ ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించింది. తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ జనసేన సాధక్ సమ్మేళనం పేరుతో జరగనున్న…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 89168