ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు. మోడీ ప్రజల గురించి కాకుండా స్నేహితుల అభివృద్ధికి కృషిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాహక్కులను నిర్వీర్యం చేయాలనుకుంటున్న శక్తులపై తాము పోరాటం చేస్తుంటే.. మోడీ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. దేశంలోని వ్యవస్థలను బలహీనం చేయడానికి ప్రయత్నిస్తున్న వారికి వ్యతిరేకంగా ప్రజలు కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. వయనాడ్లో ఏర్పడ్డ వరదల వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. కానీ, కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందలేదని మండిపడ్డారు. వయనాడ్ ఎంపీగా అక్కడి ప్రజల అవసరాలు, హక్కుల కోసం పార్లమెంట్లో తన గళాన్ని వినిపిస్తాన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంలో విచారణ..తిరుమల లడ్డూ వ్యవహారంలో దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఈ వ్యవహారంపై కామెంట్లు చేయకుండా నిలువరించాలని..మానూరు శ్రీనివాస్ పిటిషన్ వేశారు. ఈ కామెంట్లపై సీబీఐ ఎలాంటి దర్యాప్తు జరపలేదని పేర్కొన్నారు. అయితే.. దర్యాప్తు పెండింగ్లో ఉన్నప్పుడు జోక్యం…
- ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్..లీసాగిల్తో ప్రమాణ స్వీకారం చేయించారు. పంజాబ్- హర్యానా హైకోర్టు నుంచి బదిలీపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చిన జస్టిస్ లీసా గిల్..న్యాయరంగంలో విశేష…
- అమరావతిలో రెండో రోజు కలెక్టర్ల సమావేశం.కలెక్టర్ల సదస్సులో అటవీశాఖాధికారులపై మండిపడ్డారు సీఎం చంద్రబాబు. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదని మండిపడ్డారు. ఎంత చెప్పినా మీలో మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అటవీ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివసిస్తున్న ప్రజలకు నీళ్లివ్వకూడదు, కరెంటివ్వకూడదు, ఇళ్లు…
- నెట్ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లేనని సీఎం రేవంత్ అన్నారు.నెట్ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లేనని సీఎం రేవంత్ అన్నారు. ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఐలైన్ స్టూడియో కార్యాలయాన్ని హైటెక్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ అన్ని అవకాశాలను కల్పిస్తుందని నెట్ ఫ్లిక్స్ కు…
- పాకిస్థాన్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సామాన్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.పాకిస్థాన్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సామాన్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ప్రభుత్వం ఇంధన ధరలను పెంచిన వెంటనే, దేశంలోని ప్రధాన నగరాల్లోని రిటైల్ వ్యాపారులు నిత్యావసర వస్తువులు, తినుబండారాల ధరలను అమాంతం పెంచేశారు. పాత ధరలకు కొనుగోలు చేసిన సరుకులపైనే…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి